ఇమామ్ హుసైన్ యొక్క తిరుగుబాటుకు కారణం ఏమిటి మరియు మదీనహ్ నుంచి కర్బలా వరకు ఎదురుకున్న సమస్యలు మరియు సంఘటనల వివరణ సంక్షిప్తంగా...

ఇమామ్ హుసైన్ యొక్క తిరుగుబాటుకు కారణం ఏమిటి మరియు మదీనహ్ నుంచి కర్బలా వరకు ఎదురుకున్న సమస్యలు మరియు సంఘటనల వివరణ:
మదీనహ్
కాలం: రజబ్ మాసం యొక్క రెండవ సగం, హిజ్రీ యొక్క 60వ సంవత్సరం.
అప్పటి మదీనహ్ అధికారి(వలీద్ ఇబ్నె ఉత్బా)కి, ముఆవియహ్ మరణించిన తరువాత ఇమామ్ హుసైన్(స.అ) నుంచి యజీద్ ఖిలాఫత్ కై బైఅత్ ను తీసుకోమని ఆదేశం వచ్చింది. ఇమామ్ ఇలా అన్నారు: “యజీద్ మద్యం సేవిస్తాడు, అన్యాయంగా రక్తం చిందించే దుర్మార్గుడు, అవినీతిని పెంచేవాడు, అతడి చేతులు అమాయకుల రక్తంతో తడిచివున్నాయి. ఇలాంటి వ్యక్తితో నాలాంటి వ్యక్తి బైఅత్ చేయడు”
మర్వాన్ ఇబ్నె హకమ్ ఇమామ్ నుంచి యజీద్ కోసం బైఅత్ ను కోరినప్పుడు ఇమామ్ హుసైన్(స.అ) ఇలా అన్నారు: “ఓ అల్లాహ్ శత్రువా! నా నుంచి దూరమవ్వు, నేను దైవప్రవక్త(స.అ)ను ఇలా చెబుతుండగా విన్నాను: ‘ఖిలాఫత్ అబూసుఫ్యాన్ సంతానం పై నిషేధం, ఒకవేళ ముఆవియహ్ ను నా పీఠంపై కూర్చోవడం చూస్తే వాడిని చంపేయండి’ వారి ఉమ్మత్ అతడిని ఇలా (అవ్వడాన్ని) చూసింది కాని దాని పై అమలు చేయలేదు. ఇక ఇప్పుడు అల్లాహ్ వాళ్లను అవినీతి పరుడైన యజీద్ ను వారికి గురిచేశాడు”.
ఇమామ్ హుసైన్(అ.స) హిజ్రీ 60వ సంవత్సరం, రజబ్ మాసం 28వ తేది రాత్రి(ఉదయం అయితే 28వ తేది అనగ) కుటుంబ సభ్యులు మరియు కొందమంది సహచరులతో పాటు, దైవప్రవక్త(స.అ) సమాధిని వీడ్కోలు చెప్పి మదీనహ్ నుంచి మక్కాకు బయలుదేరారు.
ఇమామ్ హుసైన్(స.అ) తన తిరిగుబాటుకు గల కారణాన్ని ఇలా వివరించారు: 1) ఉమ్మత్ సవరణ మరియు వారి ఉత్తమత్వం కోసం 2) అమ్ర్ బిల్ మఅరూఫ్ 3) నహ్యి అనిల్ మున్కర్ 4) దైవప్రవక్త(స.అ) మరియు అలీ(అ.స) యొక్క సున్నత్ ను కాపాడడం మరియు వారిద్దరి సున్నత్ ను తిరిగి జీవం పోయడం.[1]
మక్కా
కాలం: 60వ హిజ్రీ, షాబాన్ యొక్క 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు.
ఇమామ్ హుసైన్(అ.స) షబాన్ యొక్క 3వ తేదీన మక్కాకు చేరుకున్నారు. అబ్బాస్ ఇబ్నె అబ్దుల్ ముతల్లిబ్ ఇంట్లో ఉన్నారు. మక్కా వాసులు మరియు మక్కా పొరుగు నుంచి వచ్చిన కాబా యాత్రికులు ఇమామ్ ను కలవడానికి వచ్చేవారు.
కూఫా వాసుల నుంచి 12 వేల ఉత్తరాలు వచ్చిన తరువాత ఇమామ్ హుసైన్(అ.స), ముస్లిం ఇబ్నె అఖీల్ ను రమజాన్ మాసం 15వ తేదీన తన ప్రతినిధిగా నియమించి కూఫాకు పంపారు.
ముస్లిం ఇబ్నె అఖీల్ తరపు నుంచి వచ్చిన కూఫా వాసుల ఇమామ్ హుసైన్(అ.స) పట్ల బైఅత్ తో కూడిన ఉత్తరం మరియు కాబా గౌరవాన్ని కాపాడడానికి (ఇమామ్ హుసైన్ ను కాబాలో హతమార్చాలనుకున్నారు) హజ్ చేయకుండా ఉమ్రా చేసుకొని జిల్ హిజ్ మాసం యొక్క 8వ తేదీన ఇరాఖ్ వైపుకు బయలుదేరారు.
మక్కాలో ఇమామ్ ఇచ్చిన ఉపన్యాసం నుంచి: “మేము; అహ్లెబైతులం అల్లాహ్ ఇష్టంలో మా ఇష్టం ఉంది... మా మార్గంలో ప్రాణాలను అర్పించాలనుకున్నవారు మరియు తన రక్తాన్ని అల్లాహ్ ను కలిసే మార్గంలో చిందించాలనుకుంటున్నావారు, మాతో బయలుదేరడానికి సిద్ధం అవ్వండి”.
సఫ్ఫాహ్
కాలం: హిజ్రీ యొక్క 60వ సంవత్సరం, జిల్ హిజ్ యొక్క 9వ తేదీ
ఇమామ్ హుసైన్(అ.స) ఇరాఖ్ వెళ్లడం పై వ్యతిరేకాన్ని వ్యక్తం చేసిన వారికి ఇమామ్ ఇచ్చిన సమాధనం: “దైవప్రవక్త(స.అ)ను కలలో చూశాను. ఒక ముఖ్యమైన కార్యానికి ఆదేశించబడ్డాను. తప్పకుండా దానిని అమలు పరచాలి”
ఈ ప్రదేశంలో ఫరజ్దఖ్ ఇమామ్ తో కలిశారు. ఇమామ్ ఇరాఖ్ యొక్క పరిస్థితుల గురించి ప్రశ్నించగా ఫరజ్దఖ్ ఇలా సమాధానమిచ్చారు: “వారి హృదయాలు మీతో ఉన్నాయి కాని వారి ఖడ్గాలు బనీ ఉమయ్యాహ్ తో ఉన్నాయి”
జాతె ఇర్ఖ్
కాలం: జిల్ హిజ్ యొక్క 14వ తేదీ, హిజ్రీ యొక్క 60వ సంవత్సరం
ఈ ప్రదేశంలో అబ్దుల్లాహ్ ఇబ్నె జాఫర్, హజ్రత్ జైనబ్(స.అ) యొక్క భర్త మదీనహ్ యొక్క గవర్నర్ అయిన “అమ్ర్ ఇబ్నె సయీద్” నుంచి ఇమామ్ కు ఎటువంటి హాని కలగదు అని హామీ పత్రం తీసుకొని వచ్చారు. అందులో ఇలా లిఖించబడి ఉంది: “నేను నిన్ను విభజనకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నాను. నువ్వు హతమార్చబడతావేమోనని భయపడుతున్నాను!! అందుకని నువ్వు సురక్షితంగా ఉండాలంటే నా వద్దకు తిరిగి వచ్చేయి!”
ఇమామ్ ఆ పత్రానికి ఇలా సమాధానమిచ్చారు: “అల్లాహ్ తరపు ఆహ్వానించువాడు సత్కార్యము చేయాలి. ముస్లిముల నుంచి అని అనే వాడు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నుంచి వేరు కాడు.... ఒకవేళ నీవు వ్రాసిన ఉత్తరం నా మంచిని ఆశించి వ్రాసి ఉంటే, అల్లాహ్ నీకు పుణ్యం చేకూర్చాలి” ఇలా అన్నారు: “ఉత్తమ రక్షణ, అల్లాహ్ రక్షణ. అల్లాహ్ నుండి ఆయన పట్ల భయం కోరుకుంటాము, దాంతో ఆయన ప్రళయదినాన మమ్మల్ని రక్షణ కలిపిస్తాడు”
అబ్దుల్లాహ్ తన కుమారులను(ఔన్ మరియు ముహమ్మద్ లను) ఇమామ్ తో పాటు కలిసి శత్రువులతో పోరడమని చెప్పి వారు మక్కా వైపుకు తిరిగి వెళ్లిపోయారు.[2]
రిఫరెన్స్
1. మజ్లిసీ, బిహారుల్ అన్వార్, తెహ్రాన్, అల్ మక్తబతుల్ ఇస్లామియహ్, 1393హి, భాగం44, పేజీ329.
2. http://www.valiasr-aj.com/persian/shownews.php?idnews=5886
వ్యాఖ్యానించండి