ఇస్లాం శత్రువుల పట్ల ఇమామ్ హుసైన్(అ.స) తిరుగుబాటు, ఇస్లామీయ ప్రపంచం పై తన ప్రభావాన్ని చూపించింది. వాటి నుంచి కొన్ని ప్రభావాలు సంక్షిప్తంగా...

ఆషూరా ఖియామ్ యొక్క ఫలితాలు
ఇస్లాం శత్రువుల పట్ల ఇమామ్ హుసైన్(అ.స) తిరుగుబాటు, ఇస్లామీయ ప్రపంచం పై తన ప్రభావాన్ని చూపించింది. వాటి నుంచి కొన్ని ప్రభావాలు సంక్షిప్తంగా;
1. అధికారుల అసలు రంగు బయటపడడం
బనీ ఉమయ్యా తన అధికారాన్ని దీన్ రంగు పూసుకొని ఉండేవారు. వారు ఇస్లాం పేరున మరియు దైవప్రవక్త(స.అ) ఉత్తరాధికారులుగా ముస్లిముల పై అధికారం చేసేవారు, ఇమామ్ హుసైన్(అ.స) తిరుగుబాటు మరియు వారి పోరాడుతూ వీరమరణం పొందడం అమవీయుల అధికారంపై గట్టి దెబ్బ పడినట్లు అయ్యింది, దాంతో అధికార మండలి అవమానానికి గురి అయ్యింది. అందరూ దైవప్రవక్త(స.అ) కుమారుడు(సంతానం) అయిన హుసైన్(అ.స)ను అన్యాయంగా అతిదారుణంగా చంపినందుకు ప్రజలు యజీద్ ను దూషించేవారు.
2. వీరమరణం(షహాదత్) సున్నత్ ను జీవం పోయడం
చరిత్రానుసారం, దైవప్రవక్త(స.అ) కాలంలో ముస్లిముల విజయానికి కారణం, అల్లాహ్ మార్గంలో తమ ప్రాణాలను అర్పించే విషయంలో ఇష్టం కలిగివుండడం. కాని దైవప్రవక్త(స.అ) తరువాత ఇస్లాం అధికారం పెడదారి తప్పడం, మస్లిముల పట్ల మరియు వారి నిత్య అవసరాల పట్ల అధికార నిర్లక్ష్యం వల్ల అలాగే మరెన్నో కారణాల వల్ల ముస్లిముల నుంచి మెల్ల మెల్లగా ఆ ఆలోచన పోయింది. అల్లాహ్ మార్గంలో తమ ప్రాణాలు ఇవ్వడం కష్టంగా భావించేవారు. మరో ప్రక్క దౌర్జన్యపు అధికారం వల్ల ప్రజలు పిరికి వారిగా మారారు. కాని ఇమామ్ హుసైన్(అ.స) యొక్క వీరమరణం పరిస్థితులను మార్చింది. ప్రజలకు ధైర్యపాఠాలు నేర్పించింది. షహాదత్ సున్నత్ ను సమాజంలో జీవం పోసింది.
3. ఇస్లాం ఉమ్మత్ లో ఇస్లాం వ్యతిరేకుల పై తిరుగుబాటు ధళాలు
ఇస్లాం పేరున ఇస్లాంను నాశనం చేయాలనుకుంటున్న అధికారం పై ఇమామ్ హుసైన్(అ.స) యొక్క తిరుగుబాటు మరియు వీరమరణం ఇస్లామీయ సమాజంలో మరెన్నో విప్లవాలకు కారణంగా మారింది. ఉదాహారణకు “ఖియామె తవ్వాబీన్” “ఖియామె ముఖ్తార్” మొ.. [1]
రిఫరెన్స్
1. సీమాయె పీష్వాయాన్, మహ్దీ పీష్వాయీ, పేజీ60.
వ్యాఖ్యానించండి