తఖ్లీద్ మరియు మర్జయియ్యత్, అహ్లెసున్నత్ దృష్టిలో-2

బుధ, 03/16/2022 - 17:27

“తఖ్లీద్ మరియు మర్జయియ్యత్, అహ్లెసున్నత్ దృష్టిలో” ఈ టాపిక్ పై చర్చించినప్పుడు, ఆశ్చర్యానికి గురి అవ్వడం తప్పనిసరి. ఎందుకంటే...

తఖ్లీద్ మరియు మర్జయియ్యత్, అహ్లెసున్నత్ దృష్టిలో-2

అల్లాహ్, అహ్లెసున్నత్ వల్ జమాఅత్
లకు, సఖ్లైన్ గురించి ప్రశ్నించినప్పుడు వారు ఏమని బదులిస్తారు, అన్నది నాకు మాత్రం అర్ధంకావట్లేదు. దాని పై అల్లాహ్ దైవప్రవక్త(స.అ)ను సాక్షిగా ప్రదర్శిస్తాడు. అప్పుడు వారు దైవప్రవక్త(స.అ) సాక్ష్యాన్ని “మేము మా నాయకులను అనుచరించాము” అని చెప్పి నిరాకరించ లేరు.
ఒకవేళ అల్లాహ్ వారితో “ఖుర్ఆన్
లో లేదా దైవప్రవక్త(స.అ) సున్నత్
లో ఈ నాలుగు వర్గాలను అనుసరించమని ఆదేశంగాని లేదా సాక్ష్యంగాని ఉందా?” అని ప్రశ్నిస్తే?
వారి ఇచ్చే జవాబేమిటో మనకు తెలిసిందే, దాని కోసం అధికజ్ఞానం అవసరం లేదు; “అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్
లో దాని గురించి లేదు. అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్
లో కేవలం పవిత్ర ఇత్రత్(అ.స)
ను ఆశ్రయించండి, వారి నుండి దూరం కావద్దు, అని స్పష్టంగా ఆదేశించబడి ఉంది. బహుశ వారు ఇలా అనవచ్చు:
رَبَّنَآ أَبۡصَرۡنَا وَسَمِعۡنَا فَٱرۡجِعۡنَا نَعۡمَلۡ صَٰلِحًا إِنَّا مُوقِنُونَ
అనువాదం: మా ప్రభువు! మేమంతా చూసుకున్నాము. విన్నాము. ఇక మమ్మల్ని తిరిగి పంపించు. మేము సత్కార్యాలు చేస్తాము. మాకిక పూర్తి నమ్మకం కలిగింది.[సజ్దాహ్ సూరా:32, ఆయత్:12]    
కాని వారి మాటలు అంగీకరించబడవు. మరి వారితో ఇలా అనబడుతుంది: “ఇలా అని మీరు ఇంతకు ముందు కూడా చెప్పేవారు” అప్పుడు దైవప్రవక్త(స.అ) ఇలా అంటారు: ఓ అల్లాహ్! నా సమూహం ఖర్ఆన్
ను ఒంటరిగా వదిలేసింది. నేను నా ఇత్రత్(అ.స) పట్ల వారికి వసీయత్(వీలు) చేశాను. మరియు నా కుటుంబీకుల పట్ల ప్రేమ గురించి నీ ఆదేశాన్ని చేర్చాను, అయినా సరే వారు నా బైఅత్
ను ఉల్లంఘించారు. నా నుండి సంబంధాన్ని తెంచేసుకొని నా కుమారులను చంపేశారు. నా గౌరవాన్ని కూడా లెక్క చేయలేదు. వీరికి నా సిఫారసు లభించదు. (నా ఆశ్రయం వీళ్ళకు దక్కదు).

وَيَوۡمَ يَعَضُّ ٱلظَّالِمُ عَلَىٰ يَدَيۡهِ يَقُولُ يَٰلَيۡتَنِي ٱتَّخَذۡتُ مَعَ ٱلرَّسُولِ سَبِيلٗا يَٰوَيۡلَتَىٰ لَيۡتَنِي لَمۡ أَتَّخِذۡ فُلَانًا خَلِيلٗا لَّقَدۡ أَضَلَّنِي عَنِ ٱلذِّكۡرِ بَعۡدَ إِذۡ جَآءَنِيۗ وَكَانَ ٱلشَّيۡطَٰنُ لِلۡإِنسَٰنِ خَذُولٗا
అనువాదం: ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు: “అయ్యో! నేను దైవప్రవక్త మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బాగుండేది!” “అయ్యో నా దౌర్భాగ్యం! నేను ఫలానా వ్యక్తిని స్రేహితునిగా చేసుకొకుండా ఉంటే ఎంత బాగుండేది!” “నా వద్దకు ఉపదేశం వచ్చిన తరువాత కూడా వాడు నన్ను అపమార్గం పట్టించాడే! ఎంతైనా షైతాన్ మనిషికి విషయంలో ద్రోహం చేసేవాడే!”[అల్ ఫుర్ఖాన్ సూరా:25, ఆయత్:27-29]

రిఫరెన్స్
అల్ షియా, హుమ్ అహ్లుస్సున్నహ్, సమావీ తీజానీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16