నిజమైన ఖులఫా-ఎ-రాషిదీన్

బుధ, 03/16/2022 - 17:43

దైవప్రవక్త(స.అ) యొక్క పవిత్ర ఇత్రత్(అ.స) అయిన ఆ పన్నెండు ఇమాములే. నిజమైన ఖులఫా-ఎ-రాషిదీన్ లు...

నిజమైన ఖులఫా-ఎ-రాషిదీన్

దైవప్రవక్త(స.అ) యొక్క పవిత్ర ఇత్రత్(అ.స) అయిన ఆ పన్నెండు ఇమాములే. నిజమైన ఖులఫా-ఎ-రాషిదీన్ లు. వారి క్రమం:
1. విశ్వాసుల అధికారీ, సదాచారుల మార్గదర్శీ, అత్యంతమైన తేజస్సు గలవారి అధ్యక్షుడూ, ముస్లిముల నాయకుడూ, ఇస్లాంధర్మ నాయకుడూ, అపజయం ఎరగని అల్లాహ్ యొక్క చీల్చిచెండాడే సింహం అయిన అలీ ఇబ్నె అబీ తాలిబ్(అ.స). ఇతను, బుద్ధినే మతి తప్పించే, ఆత్మలను దిగ్భ్రమ చెందింపజేసే, హృదయాలను కాంతిపజేయు వంటి విజ్ఞాన పట్టణానికి ద్వారం. ఒకవేళ దైవప్రవక్త(స.అ) తరువాత ఇతను ఉండకపోయి ఉంటే ఇస్లాం ధర్మానికి స్థిరత్వం దక్కేది కాదు.
2. ఇమామ్ అబూ ముహమ్మద్, హసన్ ఇబ్నె అలీ(అ.స), స్వర్గ యువకుల నాయకులు. ఈ ఉమ్మత్
లో దైవప్రవక్త(స.అ) యొక్క రైహాన్ పుష్పం. భక్తులు, ధర్మనిష్ఠగల వారు మరియు మంచి హితులు.
3. ఇమామ్ అబూ అబ్దిల్లాహిల్ హుసైన్ ఇబ్నె అలీ(అ.స), స్వర్గ యువకుల నాయకులు. ఈ ఉమ్మత్
లో దైవప్రవక్త(స.అ) యొక్క రైహాన్ పుష్పం, సయ్యదుష్షుహదా(అమర వీరులు నాయకుడు), ఇతను ఉమ్మత్ సంస్కరణకై కర్బలా రణరంగంలో వీరమరణం పొందినటువంటి వారు.
4. ఇమామ్ అలీ ఇబ్నె అల్ హుసైన్(అ.స), జైనుల్ ఆబెదీన్, సయ్యద్దుస్సాజిదీన్ (సజ్దా చేయు వారి నాయకులు).
5. ఇమామ్ ముహమ్మద్ ఇబ్నె అలీ(అ.స), పూర్వం నుండి ప్రళయం నాటి వారి జ్ఞానం యొక్క లోతుకు చేరిన వారు.
6. ఇమామ్ జాఫరె సాదిఖ్ ఇబ్నె ముహమ్మద్(అ.స), ఏ కళ్ళు అటువంటి వారిని చూడలేదు, ఏ చెవులు అటువంటి వారిని వినలేదు. జ్ఞానం, అమలు మరియు ఫిఖాలో అతనిని మించిన వాడు ఉన్నాడు అని ఏ మనిషి ఆలోచనకి రాలేదు.
7. ఇమామ్మ మూసా కాజిమ్ ఇబ్నె జాఫర్(అ.స), దైవదౌత్వ వారసులు మరియు విజ్ఞాన గని.
8. ఇమామ్ అలీ ఇబ్నె మూసా రిజా(అ.స), చిన్న వయసులోనే తత్వాజ్ఞానం ప్రసాదించబడిన వారు.
9. ఇమామ్ ముహమ్మద్ ఇబ్నె అలీ అల్ జవాద్(అ.స), ఈవి మరియు అనుగ్రహించడంలో గొప్పవారు, సద్గుణం యొక్క అతి ఎత్తైన స్థాయిలో ఉన్నటువంటి వారు.
10. ఇమామ్ అలీ బన్ ముహమ్మద్ హాదీ(అ.స), దయా మరియు మార్గదర్శకం కలిగిన వారు.
11. ఇమామ్ హసన్ ఇబ్నె అలీ అల్ అస్కరీ(అ.స), దర్మనిష్ఠ మరియు భక్తికి పెట్టింది పేరు.
12. ఇమామ్ ముహమ్మద్ ఇబ్నె అల్ హసన్ అల్ మహ్‌దీ(అ.స). ఎలాగైతే ఈ భూమి అన్యాయం, అధర్మంతో నిండిపోయి ఉందో అలాగే దానిని అతను న్యాయధర్మాలతో నింపేస్తారు. ఇబ్నె మర్యమ్(జనాబె ఈసా) అతని వెనక నమాజ్ చదువుతారు. అల్లాహ్ అతని ద్వార తన కాంతిని సంపూర్ణిస్తాడు మరియు విశ్వాసులను సంతోషాన్ని ప్రసాదిస్తాడు.

విరే షియా ముస్లిముల పన్నెండు మంది ఇమాములు. కనుక ఎప్పుడైనా ఎక్కడైనా “షియా ఇమామియా ఇస్న అషరీ, జాఫరీ” అని పేరు వస్తే అది షియాలు అని అర్థం అంతే, వేరే వారు కాదు! ఎందుకంటే షియాలు తప్ప ఇస్లామీయ వర్గాలలో ఎవ్వరూ పన్నెండు ఇమాముల నాయకత్వాన్ని నమ్మరు.
వారి ప్రతిష్టతను, గొప్పతనాన్ని, అనుగ్రహాన్ని, పవిత్రతను ప్రవచిస్తూ అవతరించబడ్డ ఆయత్
లను అన్వేషించినట్లైతే వారి ఆత్మపవిత్రత, ఉనికి, స్థాయి, ఉత్తమత్వం తెలుస్తాయి. ఉదాహారణకు: “మువద్దత్ ఆయత్”, “తత్హీర్ ఆయత్”, “ముబాహలహ్ ఆయత్”, “అబ్రార్ ఆయత్” మొ॥.
వారి ఉత్తమత్వాన్ని, ఉమ్మత్ పై వారి శ్రేష్టతను, వారి జ్ఞానాన్ని, పవిత్రతను వివరించేటువంటి దైవప్రవక్త(స.అ) యొక్క హదీసులను అన్వేషించినట్లైతే, అప్పడు మేము తప్పకుండా వారి ఇమామత్‌ను అంగీకరిస్తాము. మరియు వారే ఈ ఉమ్మత్ కొరకు శరణులు మరియు మార్గదర్శకులు, అని ఒప్పుకొవడం ఖాయం.
షియాలే ఉత్తీర్ణులు; ఎందుకంటే వారు అల్లాహ్ యొక్క త్రాడును గట్టిగా పట్టుకొని ఉన్నారు. అనగా అహ్లెబైత్‌(అ.స)ల విలాయత్ పై విశ్వాసం కలిగివున్నారు. ఏమాత్రం హాని కలగనటువంటి గట్టి క్రమాన్ని ఆశ్రయించి ఉన్నారు. అనగా అహ్లెబైత్(అ.స)
ల పట్ల ఇష్టం, ప్రేమను మనసు నిండా నింపుకొని ఉన్నారు. కనుక వారు విముక్తి నౌక పై ఎక్కి మునిగిపోకుండా మరియు నాశనం అవ్వకుండా రక్షణ పొందారు. అందుకని మేము పూర్తి నమ్మకం, ఎరుక, భరోసాతో “షియా ఇమామీయులే అసలైన సున్నత్ అనుచరులు” అని అంటున్నాము. అల్లాహ్ ఇలా ప్రవచించెను:
لَّقَدۡ كُنتَ فِي غَفۡلَةٖ مِّنۡ هَٰذَا فَكَشَفۡنَا عَنكَ غِطَآءَكَ فَبَصَرُكَ ٱلۡيَوۡمَ حَدِيدٞ
అనువాదం: (అతనితో ఇలా చెప్పబడుతుంది:) “నిశ్చయంగా నీవు దీని పట్ల అశ్రద్ధలో పడిఉన్నావు. ఇక నీ నుండి నీ తెరను తొలగించాము. ఈనాడు నీ చూపు చాలా సునిశితంగా ఉంది.”[ఖాఫ్ సూరా:50 ఆయత్:22.]

రిఫరెన్స
అల్ షియా, హుమ్ అహ్లుస్సున్నహ్, సమావీ తీజానీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
15 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18