ఖులఫాయే రాషిదీన్, అహ్లెసున్నత్
ల దృష్టిలో-2

శని, 03/19/2022 - 17:09

దైవప్రవక్త(స.అ) యొక్క పవిత్ర ఇత్రత్(అ.స) అయిన ఆ పన్నెండు ఇమాములే. నిజమైన ఖులఫా-ఎ-రాషిదీన్ లు...

ఖులఫాయే రాషిదీన్, అహ్లెసున్నత్
ల దృష్టిలో-2

గౌరవనీయులైన పాఠకులారా! అహ్లెసున్నత్ వల్ జమాఅత్ యొక్క ఈ గొప్ప ఫఖీహ్ అయిన అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ గురించి చదివి దిగ్భ్రమ చెందండి. అతను ఎలా యదార్థాలను మార్చేశాడో?, ముఆవియా కుమారుడు యజీద్ మరియ సఫ్పాహ్
లను అల్లాహ్ దాసులందరిలో ఉత్తములుగా నిర్ధారించాడో?. ఎలా “వారందరూ సజ్జనులు వారికి సాటిలేరు” అని స్పష్టంగా అన్నాడో?.
వైరం మరియు శత్రుత్వం, అతనిని అంధుడ్ని చేశాయి. మరి అలాగే అసూయ మరియు మనస్పర్థలు అతని నుండి అంతర్
దృష్టిని క్షీణించాయి. కనుక అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీ తాలిబ్(అ.స) యొక్క ఏ ఒక్క శ్రేష్ఠతా కనిపించేది కాదు. అందుకనే అతడు ఇమామ్ అలీ(అ.స) కన్న ముఆవియా, మరియు నాస్తికుడైన అతడి కుమారుడు యజీద్, మరియు అపరాధి అయిన సఫ్పాహ్
లను శ్రేష్ఠులుగా భావించాడు.[1]

“అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్” నిస్సందేహంగా తండ్రికి తగ్గ తనయుడు. గిన్నెలో ఏదుంటే (ఆ గిన్నె నుండి) అదే కారుతుంది, ఇందులో ఆశ్చర్యపడాల్సినవసరం లేదు. ఎందుకంటే ఇతడి తండ్రి హజ్రత్ అలీ(అ.స)ను ఖిలాఫత్ నుండి దూరంగా ఉంచారు. మరియు ప్రజల దృష్టిలో పడిపోవాలని చేతనైనంత వరకు ప్రయత్నించారు.
ఇతడు వైరం, ద్వేషం, దుర్మార్గాలు కలిగివున్న అతని కుమారుడే. ఉస్మాన్ తరువాత హజ్రత్ అలీ(అ.స) ఖలీఫా అయ్యారు, మరి అన్సారులు[2] మరియు మహాజిరీన్‌లు[3] అతనితో బైఅత్ చేశారు, అయినా సరే అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ అలీ(అ.స)

తో బైఅత్ చేయలేదు. అంతేకాకుండా అతని జీవనజ్యోతిని ఆర్పేయాలనే ఆలోచనలో ఉండే వాడు. హజ్రత్ అలీ(అ.స) పరిపాలన పట్ల ప్రజలను తప్పుత్రోవ పట్టించేవాడు. అందకనే ముస్లిముల ముందు “అలీ(అ.స) యొక్క అర్హత చాలా తక్కువ, అతను కూడా సాధారణ మనిషి లాంటి వారే” అని అనేవాడు.

కాని అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్, అమవీ ప్రభుత్వం కొరకు ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా పని చేశాడు. ముఆవియా మరియ యజీద్
కు అసత్యపు ఖిలాఫత్ యొక్క మకుటాన్ని పెట్టి దైవప్రవక్త(స.అ) ను నిందించాడు. మన్సూర్, సఫ్పాహ్ మరియు బనీఉమయ్యాహ్
కు చెందిన దుర్మార్గుల, దుష్టుల ఖిలాఫత్
ను అంగీకరించేవాడు. వారిని ముస్లిముల నాయకుడు, ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్ యొక్క స్పష్టమైన ఆదేశాల ప్రకారంగా విశ్వాసుల “వలీ” కి మించిన వారుగా భావించేవాడు. అలీ(అ.స) యొక్క ఖిలాఫత్
ను అంగీకరించేవాడు కాదు. ఇవి నిజంగానే దిగ్భ్రమ చెందింపజేసే విషయాలే.
వాస్తవానికి అతడిని అర్హతలేని వాడిగా, అధర్ముడిగా, నాసిబీగా నిర్ధారించేందుకు చాలా నిదర్శనలు ఉన్నాయి మరెప్పుడైనా వాటి గురించి మాట్లాడుకుందాం. ఇతనేనండి, అహ్లెసున్నత్ వల్ జమాఅత్ యొక్క పునాది పెట్టిన అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్. అందకనే ఈనాడు అతనే వారి కొరకు పెద్ద ఫిఖా జ్ఞాని మరియు గొప్ప ముహద్దిస్ కూడానూ.
ఒకవేళ మీర తూర్పు నుండి పడమర వరకు ప్రయాణించి అహ్లెసున్నత్ వల్ జమాఅత్ యొక్క మసీదులన్నీంటిలో నమాజ్ చదవండి. మరియు వారి ఉలమాలతో, విధ్వాంసులతో మాట్లాడండి, అయితే వారి ఉలమాల నోటి నుండి “అన్ అబ్దిల్లాహ్ బిన అమర్”(عن عبداللہ بن عمر) అని వినీ వినీ చెవులు పండిపోతాయి.

రిఫరెన్స్
1. బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించిన దైవప్రవక్త యొక్క ఈ ప్రవచనాన్ని మరిచిపోకుండా చదవండి: “అలీ ఇబ్నె అబీతాలిబ్ పట్ల ప్రేమ విశ్వాసానికి నిదర్శనం మరియు వారి పట్ల వైరం కపటాని నిదర్శనం” దైవప్రవక్త(స.అ) కాలంలో కపటవర్తనులు అలీ(అ.స) పట్ల వైరం ద్వారానే తెలిసేవారు.
2. మదీనాలో దైవప్రవక్త(స.అ)కు సహాయం చేసిన ముస్లిములు.
3. దైవప్రవక్త(స.అ)తో మక్కా నుండి మదీనాకు వలసి వచ్చిన వాళ్ళు.

అల్ షియా, హుమ్ అహ్లుస్సున్నహ్, సమావీ తీజానీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16