దైవప్రవక్త(స.అ), అహ్లెసున్నత్ వల్ జమాఅత్ ల ఫిఖా ను అంగీకరించరు అన్న విషయం పై మరికొన్ని సంక్షిప్త వివరణ...
ఈ అన్ని విషయాలున్నప్పటికీ, మేము పాఠకులకు ఇంకా సంతృప్తి పొందేందుకు అహ్లెసున్నత్
ల “సహ్హాహ్” గ్రంథాల నుండి ఒక సాక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాను. “బుఖారీ” తన “సహీ” గ్రంథంలో ఇలా వ్రాశారు: “దైవప్రవక్త(స.అ)తో ఇంకా అల్లాహ్ వహీ ద్వార అవతరించబడని వాటి గురించి అడిగినప్పుడు అతను స్పష్టంగా “నాకు తెలియదు” అని చెప్పేవారు. మరి వహీ అవతరించనంత వరకు జవాబు ఇచ్చేవారు కాదు. తన సొంత అభిప్రాయం మరియు ఇజ్తిహాద్ ద్వార ఏది చెప్పేవారు కాదు. అందుకనే ఖుర్ఆన్‌లో ఇలా ప్రవచించబడి ఉంది: بِمَآ أَرَىٰكَ ٱللَّهُ [నిసా సూరా:4, ఆయత్:105] (అనువాదం: (ఓ ప్రవక్తా!) అల్లాహ్ నీకు చూపిన విధాంగా...)[1]
అవును, సకలలోకాల ప్రభువు, మంచి తీర్పు ఇచ్చు వాడు, తన ప్రవక్త(స.అ) గురించి ఇలా ప్రవచించెను:
وَأَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ مُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ مِنَ ٱلۡكِتَٰبِ وَمُهَيۡمِنًا عَلَيۡهِۖ فَٱحۡكُم بَيۡنَهُم بِمَآ أَنزَلَ ٱللَّهُ
అనువాదం: (ఓ ప్రవక్తా!) మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్యసమేతంగా అవతరింపజేశాము. అది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరిస్తుంది, వాటిని పరిరక్షిస్తుంది. కాబట్టి నువ్వు వారి మధ్య అల్లాహ్ అవతరింపజేసిన ఈ గ్రంథానికనుగుణంగానే తీర్పు చెయ్యి.[మాయిదహ్ సూరా:5, ఆయత్:48]
ఔను ఖుర్ఆన్ దైవప్రవక్త(స.అ) శ్రేష్టత గురించి ఇలా కూడా ప్రవచించెను:
إِنَّآ أَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ لِتَحۡكُمَ بَيۡنَ ٱلنَّاسِ بِمَآ أَرَىٰكَ ٱللَّهُ
అనువాదం: (ఓ ప్రవక్తా!) అల్లాహ్ నీకు చూపిన విధాంగా నీవు ప్రజల మధ్య తీర్పు చెయ్యటానికి గాను మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్యంతోపాటు పంపాము.[నిసా సూరా:4, ఆయత్:105]
అహ్లెసున్నత్
ల వచనానుసారం, దైవప్రవక్త(స.అ) తన అభిప్రాయం మరియు ఖియాస్ ద్వార దేన్ని తీర్మానించే వారు కాదు. అయితే వారికి దాని పై అమలు చేయడం ఎలా సమ్మతమైనది? మరి ఎలా అల్లాహ్ అహ్కాములను మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్
ను వ్యతిరేకించడం మొదలు పెట్టారు?. మరియు తమనుతాము “అహ్లెసున్నత్” అని కూడా చెప్పుకుంటారు. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం.[2]
రిఫరెన్స్
1. సహీబుఖారీ, భాగం8, పేజీ148.
2. అల్ షియా, హుమ్ అహ్లుస్సున్నహ్, సమావీ తీజానీ.
వ్యాఖ్యానించండి