అబూబక్ర్ ఇబ్నె అబీ ఖహాఫహ్-1

మంగళ, 03/29/2022 - 16:47

అహ్లె సున్నత్ వారు విశ్వసించే 12 మంది నాయకులలో మొదటి నాయకుని గురించి మరియు వారు చేసిన పనుల గురించి సంక్షిప్తం వివరణ...

అబూబక్ర్ సిద్దీఖ్ ఇబ్నె అబీ ఖహాఫహ్-1

అబూబక్ర్ దైవప్రవక్త(స.అ) యొక్క 500 హదీసులు సంగ్రహించి నిప్పంటించి ఉపన్యాసం మధ్యలో ఇలా అన్నారు: దైవప్రవక్త(స.అ) యొక్క ఏ హదీసును కూడా ఉల్లేఖించకండి మరియు ఒకవేళ మీతో ఎవరైనా దీని గురించి ప్రశ్నిస్తే “మా మరియు మీ మధ్య ఖుర్ఆన్ మజీద్ యొక్క హలాల్
ను హలాల్ మరియు దాని హరామ్
ను హరామ్ అని భావించండి” అని అనండి.
దైవప్రవక్త(స.అ) లేఖనం వ్రాయాలని అనుకున్న విషయంలో అబూబక్ర్, దైవప్రవక్త(స.అ)ను వ్యతిరేకించారు. “దైవప్రవక్త(స.అ) మతిభ్రమించి మాట్లాడు తున్నారు మనకు అల్లాహ్ గ్రంథమే చాలు” అన్న ఉమర్ వచనాన్ని సమ్మతిం చారు (అల్లాహ్ శరణు).
మరి అలాగే అలీ(అ.స) యొక్క ఖిలాఫత్
ను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకొని, అతని ఖిలాఫత్
కు సంబంధించిన దైవప్రవక్త(స.అ) స్పష్టమైన నుసూస్
ను వ్యతిరేకించారు.
“ఒసామహ్” యొక్క ఆధిపత్యాన్ని మరియు అతని సైన్యంలో వెళ్ళకుండా దైవప్రవక్త(స.అ) సున్నత్
ను వ్యతిరేకించారు. దైవప్రవక్త(స.అ) ప్రియమైన కుమార్తే ఫాతెమా జహ్రా(స.అ)ను బాధపెట్టి ఆమెను బెదిరించి, దైవప్రవక్త(స.అ) సున్నత్
ను వ్యతిరేకించారు.
జకాత్ ఇవ్వనటువంటి ముస్లిములతో యుద్ధం చేసి, వారిని చంపి, దైవప్రవక్త(స.అ) సున్నత్
ను వ్యతిరేకించారు.

దైవప్రవక్త(స.అ) నిషిద్ధించినా సరే “ఫజా సల్మహ్”ను కాల్చి, దైవప్రవక్త(స.అ) సున్నత్
ను వ్యతిరేకించారు, “ముఅల్లఫతుల్ ఖులూబ్” యొక్క భాగాన్ని ఇవ్వకుండా ఉమర్ వచనాన్ని తాయీదు చేసి, దైవప్రవక్త(స.అ) సున్నత్
ను వ్యతిరేకించారు.
ఉమర్
ను, ఎవరి సలహా లేకుండా ముస్లిముల ఖలీఫాగా నిర్ధారించి, దైవప్రవక్త(స.అ) సున్నత్
ను వ్యతిరేకించారు. అహ్లెసున్నత్ యొక్క సహ్హాహ్ మరియు చరిత్ర గ్రంథాలు ఈ వ్యతిరేకాలన్నీంటితో నిండి ఉన్నాయి.
ఉలామాలు చెప్పినట్లు, దైవప్రవక్త(స.అ) ప్రవచనం, అతను చేసిన పని మరియు ఎవరైనా ఎదైనా చేస్తే దానిని ఇది తప్పూ అని ఆపకపోవడాన్ని దైవప్రవక్త(స.అ) సున్నత్ అని అంటారు. అంటే అబూబక్ర్ వీటన్నీంటిని వ్యతిరేకించారు అని అనవచ్చన్నమాట. ఉదా:

దైవప్రవక్త(స.అ) ప్రవచనం పట్ల వ్యతిరేకత
దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: “ఫాతెమా(స.అ) నా భాగం, ఆమెను ఆగ్రహం తెప్పించిన వాడు నన్ను ఆగ్రహం తెప్పించినట్లే”
ఫాతెమా(స.అ) అబూబక్ర్ పై ఆగ్రహంతోనే ఈ లోకం నుండి వేళ్ళిపోయారు, ఇలా అని బుఖారీ వ్రాశారు.
సహాబీయులు ఒసామహ్‌ను సైన్యాధిపతి చేసినప్పుడు అభ్యంతరించి అతని సైన్యంలో చేరేందుకు నిరాకరించించనపుడు, దైప్రవక్త ఇలా ప్రవచించారు: “ఒసామహ్ సైన్యంలో చేరనివారి పై అల్లాహ్ యొక్క లఅనత్”. ఇన్ని విషయాలని వ్యతిరేకించినప్పటికీ అబూబక్ర్ ఖలీఫాగా నిశ్చయించబడ్డారు.

దైవప్రవక్త(స.అ) చేసిన వాటిని వ్యతిరేకించడం
దైవప్రవక్త(స.అ), అల్లాహ్ ఆదేశం ప్రకారం “ముఅల్లఫతుల్ ఖులూబ్”లకు వారి భాగం ఇచ్చారు. కాని అబూబక్ర్ వారి హక్కును వారికి ఇవ్వలేదు. దాని పై ఖుర్ఆన్ యొక్క స్పష్టమైన నస్స్ ఉంది. మరియు దైవప్రవక్త(స.అ) దాని పై అమలు చేశారు. కేవలం ఉమర్
ను సంతోషపరిచేందుకు అబూబక్ర్ ఈ పని చేశారు. ఎందుకంటే ఉమర్ ఇలా అన్నారు: ఇక మీ అవసరం మాకు లేదు.

దైవప్రవక్త(స.అ) తాయీద్ చేసిన వాటి వ్యతిరేకత
దైవప్రవక్త(స.అ) మౌనంగా ఉండి ప్రజలకు తన హదీసులు ఉల్లేఖించేందుకు మరియు ప్రజల మధ్యలో తీసుకొచ్చేందుకు అనుమతిచ్చారు. కాని అబూబక్ర్ ఆ హదీసులను నిప్పంటించేశారు. మరియు వాటి ఉల్లేఖన మరియు ప్రచారాన్ని నిషేదించారు.
అబూబక్ర్‌కు, ఖుర్ఆన్ యొక్క ఎన్నో అహ్కాములు, ఆదేశాలు తెలియవు. అతనితో ఖుర్ఆన్
లో ఉన్న “కలాలహ్”  గురించి ప్రశ్నించినప్పుడు అతను ఇలా అన్నారు: “నేను నా అభిప్రాయాన్ని చెప్పగలను ఒకవేళ ఆ అభిప్రాయం సరైనదైతే అల్లాహ్ నుండి మరియు తప్పైతే షైతాన్ నుండి”.[1]
అల్లాహ్ ఖుర్ఆన్
లో మరియు దైవప్రవక్త(స.అ) తన హదీసులలో స్పష్టంగా “కలాలహ్” నిర్భంధనను ప్రవచించి ఉండగా “కలాలహ్” నిర్భంధం గురించి అడిగనప్పుడు అతను నేను నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాను అన్న ఆ ముస్లిముల ఖలీఫా పై ఆశ్చర్యం కలగక మరేమి కలుగుతుంది చెప్పండి. ఎందుకంటే ఖలీఫాకు ఆ రెండింటితో(ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్) సంబంధమే ఉండేది కాదు.
మరి అతనే స్వయంగా షైతాన్ అతని అభిప్రాయాన్ని లోపరచుకొని ఉంటాడు అని అంగీకరించారు. ఇది ముస్లిముల ఖలీఫా అయిన అబూబక్ర్
కు ఇది అనుకోకుండా ఎదురైన సమస్య అని కాదు, అతను ఇంతకు ముందు కూడా ఇలాంటి మాటలు ఎన్నో సార్లు ఇలా చెప్పారు: “నాతో షైతాన్ ఉన్నాడు అతడు నన్ను తప్పుత్రోవ పట్టిస్తూ ఉంటాడు”.
గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఇస్లామీయ ఉలమాల స్పష్టమైన తీర్మానం ఏమిటంటే “అల్లాహ్ గ్రంథం పట్ల సొంత అభిప్రాయం పై అమలు చేసిన వాడు కాఫిర్, అవిశ్వాసి”, అందుకే దైవప్రవక్త(స.అ) ఎప్పుడు కూడా తన సొంత అభిప్రాయం మరియు ఖియాస్ ద్వార ఏదీ చెప్పలేదు.

రిఫరెన్స్
1. తఫ్సీరె తబరీ, తఫ్సీరె ఇబ్నె కసీర్, తఫ్సీరె ఖాజిన్, తఫ్సీరె జలాలుద్దీన్ సీవ్తీ, ఖుర్ఆన్ వ్యాఖ్యులందరూ అల్ నిసా సూరహ్ యొక్క ఈ ఆయత్لیستفتونک قل اللہ یفتیکم فی الکلاله  వ్యాఖ్యానంలో వ్రాశారు.
2. అల్ షియా, హుమ్ అహ్లుస్సున్నహ్, సమావీ తీజానీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
16 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17