దైవప్రవక్త(స.అ) సద్గుణాలు

గురు, 05/12/2022 - 11:01

అల్లాహ్ ఖుర్ఆన్ లో తన ప్రవక్త(స.అ) కు ఇలా ఉపదేశించేను: “నీవు నైతికంగా అత్యున్నత స్థానంలో ఉన్నావు”[సూరయె ఖలమ్, ఆయత్4]

దైవప్రవక్త(స.అ) సద్గుణాలు

సత్ప్రవర్తన మరియు సద్గుణాలు అనగా సమాజంలో జీవించే ఇతర మనుషులు మరియు ప్రాణుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండడం. సత్ప్రవర్తన వ్యక్తిగత అభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధికి కూడా కారణమౌతుంది. సమాజంలో ఉత్తేజం, ఆత్మీయత, ప్రేమానురాగాలు, ప్రేరణ మరియు ప్రోత్సాహానికి కారణమౌతుంది. అలాగే సత్ర్పవర్తన కలిగివున్న వ్యక్తి మనశాంతి కలిగివుండటమే కాకుండా అతడితో సంబంధం కలిగివున్న ప్రతీ ఒక్కడి పై ప్రభావం చూపుతాడు.
అల్లాహ్ ఖుర్ఆన్ లో తన ప్రవక్త(స.అ) కు ఇలా ఉపదేశించేను: “నీవు నైతికంగా అత్యున్నత స్థానంలో ఉన్నావు”[సూరయె ఖలమ్, ఆయత్4]
మనం ముస్లిములు కాబట్టీ, మనం దైవప్రవక్త(స.అ) సున్నత్ ను అనుచరించడం విధిగా భావిస్తున్నాము కాబట్టీ, వారి నైతికాన్ని అనుచరించి ఉత్తిమ నైతికాన్ని మన సొంతం చేసుకోవాలి. స్వయంగా దైవప్రవక్త(స.అ)యే ఇలా ఉపదేశించారు: “గుర్తుంచుకోండి మీలో నాకు అత్యంత పోలిక కలిగివున్న వారు, మీలోని సత్ప్రవర్తన కలిగివున్న వారే”[1].
సత్ప్రవర్తన సమాజం మరియు మనిషికి మేలు కలిపించడమే కాకుండా మనిషి యొక్క మనశాంతి మరియు పాపములకు దూరంగా ఉండడానికి సహాయపడుతుంది.
దైవప్రవక్త(స.అ) ఉపదేశం: “నిస్సందేహంగా సత్ప్రవర్తన మరియు మంచి నైతికం సూర్యుడు మంచును నీరుగా మార్చినట్లు పాపములను నీరుగా మారుస్తుంది”[2]
పై చెప్పబడిన అంశాల నుండి మంచి నైతికం మరియు సత్ప్రవర్తన యొక్క ఫలితాలను ఇలా చెప్పవచ్చు: 1. వ్యక్తిగత మనశాంతి 2. సమాజం యొక్క మనశాంతి 3. దైవప్రవక్త(స.అ) పోలిక 4. పాపముల నుండి పవిత్రత.

ఎవరికైనా ఈ ప్రశ్న రావచ్చు: సత్ప్రవర్తన యొక్క సంకేతాలు ఏమిటి? అని.
ఇదే ప్రశ్న జహ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్(స.అ)తో చేయబడింది సత్ప్రవర్తన యొక్క పరిమాణం ఏమిటి? అని అప్పడు వారు ఇలా ఉపదేశించారు.. “ تُلِینُ جَانِبَكَ وَ تُطِیبُ كَلَامَكَ وَ تَلْقَى أَخَاكَ بِبِشْرٍ حَسَنٍ‏”[3].
ఈ హదీస్ లో ఇమామ్(అ.స) సత్ప్రవర్తన యొక్క మూడు సంకేతాలు వివరించారు: 1. వినయవిధేయతలు కలిగి ఉండడం 2. మాటలో సత్యం 3. ఇతరులతో కలిసేటప్పుడు చిరునవ్వుతో కలవడం.

దైవప్రవక్త(స.అ) యొక్క ఉత్తమ నైతికం యొక్క నమూనా
దైవప్రవక్త(స.అ) మస్జిదులో కూర్చోని ఉండగా అన్సార్ సమూహానికి చెందిన ఒక పనిమనిషి వచ్చింది. దైవప్రవక్త(స.అ) దుస్తులు పట్టుకొని లాగింది. దైవప్రవక్త(స.అ) ఏదైనా పని పడిందేమోనని తన చోటు నుండి నిలబడ్డారు ఆమె ఏమి చెప్పలేదు. దైవప్రవక్త(స.అ) కూడా ఏమీ చెప్పలేదు. ఇదే విధంగా రెండు మూడు సార్లు జరిగింది. నాలుగో సారి ఆమె దైవప్రవక్త(స.అ) దుస్తుల నుండి ఒక ముక్క వేరు చేసుకొని వెళ్లిపోయింది. ప్రజలు ఆమె ఈ చర్యపై ఆశ్చర్యానికి గురి అయి ఆమెతో అల్లాహ్ నీకు ఇలా చేయాలీ అలా చేయాలీ అని అన్నారు. నువ్వు మూడు సార్లు దైవప్రవక్త(స.అ)ను (తన పని నుండి) ఆపావు, ఏదీ చెప్పలేదు. దైవప్రవక్త(స.అ) కూడా ఏదీ చెప్పలేదు. దైవప్రవక్త(స.అ)తో ఏంపని ఉంది? ఆమె ఇలా అంది: నా ఇంట్లో ఒక రోగి ఉన్నాడు మీ దుస్తుల నుండి ఒక ముక్కను అతడి షిఫా(ఉపసమనం) కోసం తీసుకొని రమ్మని నన్ను పంపించారు. ఇలా చేయాలనుకున్న ప్రతీ సారీ వారు తన చోటు నుండి నిలబడేవారు మరియు నాకు వారు చూస్తుండగా ఈ పని చేయడానికి సిగ్గుగా అనిపించేది. అలా అనీ వారితో అడిగితీసుకోవాలని పించలేదు. నాలుగో సారి వారి దుస్తుల నుండి కొంత భాగాన్ని వేరు చేసుకున్నాను.[4]

ఇది దైవప్రవక్త(స.అ) యొక్క ఉత్తమ నైతికం సముద్రం నుండి ఒక చుక్కతో సమానమైన నమూనా. మేము కూడా వారి సత్ప్రవర్తనలను తెలుసుకొని వాటిపై అమలు చేసి వాటి ప్రభావాలు పొందాలి మరియు ఇతరుల పై ప్రభావం చూపించాలి. సమాజాన్ని ఒత్తిడ్ల నుండి విముక్తినివ్వాలనుకుంటున్నవారు తప్పకుండా తమ ప్రవర్తనను ఉత్తమ రీతిలో మలచుకోవడం అవసరం.

రిఫరెన్స్
1. వసాయిల్ అల్ షియా, హుర్రె ఆములీ, మొఅస్ససయె ఆలుల్ బైత్, ఖుమ్, 1409ఖ, భాగం12, పేజీ151.
2. ముస్తద్రికుల్ వసాయిల్, మొహద్దిసె నూరీ, మొఅస్ససయె ఆలుల్ బైత్, ఖుమ్, 1408ఖ, భాగం8, పేజీ445.
3. మన్ లా యహ్ జుర్హుల్ ఫఖీహ్, షేఖ్ సదీఖ్, ఇంతెషారాతె జామె ముదర్రిసీన్, ఖుమ్1413ఖ, భాగం4, పేజీ412.
4. ఉసూలె కాఫీ, తర్జుమా సయ్యద్ జవాద్ ముస్తఫవీ, దఫ్తరె నష్రె ఫర్హంగె అహ్లె బైత్(అ.స), తెహ్రాన్, భాగం3, పేజీ160., బిహారుల్ అన్వార్, అల్లామా మజ్లిసీ, మొఅస్ససతుల్ వఫా, బీరూత్ లెబ్నాన్, 1404ఖ, భాగం16, పేజీ264.    

https://btid.org/fa/news/2599

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 24