ఖుర్ఆన్ వ్యాఖ్యానం

ఆది, 01/21/2018 - 07:26

.ఖుర్ఆన్ వ్యాఖ్యానం మరియు వివరణను అరబీ, ఫార్సీ మరియు ఉర్దూ భాషలలో “తఫ్సీర్” అంటారు. ఖుర్ఆన్ వ్యాఖ్యానం అనగ తఫ్సీరె ఖుర్ఆన్.

ఖుర్ఆన్ వ్యాఖ్యానం

వ్యాఖ్యానం అనగా స్పష్టించడం. మరియు ఒకదాని పైనుండి ముసుగును ఎత్తివేయడం. దీనిని అరబీ, ఫార్సీ మరియు ఉర్దూ భాషలలో “తఫ్సీర్” అంటారు. ఈ తఫ్సీర్ జ్ఞానం, ఖుర్ఆన్ కు సంబంధించిన ఇస్లామీయ ముఖ్యవిద్యలలో ఒకటి. ఈ విద్య, మా కోసం ఖుర్ఆన్ పదాల పై మరియు ఆయత్ ల పై పడి ఉన్న ముసుగును తొలగిస్తుంది మరియు మమ్మల్ని ఖుర్ఆన్ యదార్ధాన్ని మరియు ఖుర్ఆన్ చెప్పాలను కుంటున్న అసలు అర్ధానికి దగ్గర చేస్తుంది.
వ్యాఖ్యానం, ఖుర్ఆన్ యొక్క ఒక ఆయత్ లేదా కొన్ని ఆయత్ లను అర్ధం చేసుకోలేకపోలేనటువంటి కఠోర మరియు అపరిచిత పదాలు గురించీ, లేదా ఖుర్ఆన్ ప్రస్తావన చాలా సంక్షిప్తంగా ఉన్నప్పుడు దాని వివరణ అవసరమైనప్పుడు గాని, చేయబడుతుంది.
అతి పెద్ద ఖుర్ఆన్ వ్యాఖ్యులు, అహ్లెబైత్[అ.స]కు చెందిన పవిత్ర ఇమాములు, ఎందుకంటే వీరే ఖుర్ఆన్ అవతరించబడే ఇంట్లో పుట్టి పెరిగినవారు, అల్లాహ్ వీరికే పవిత్ర గ్రంథ జ్ఞానాన్ని ప్రసాదించాడు మరియు వారు నేరుగా అల్లాహ్ నుండి జ్ఞానాన్ని పొందారు.
ఖుర్ఆన్ వ్యాఖ్యానం, వివిధ పద్ధతు గలదు. అందులో ఒకటి హదీసుల ద్వార ఖుర్ఆన్ ను వ్యాఖ్యానించడం అనగ ఆయత్ యొక్క అర్ధం తెలుసుకోవడానికి పవిత్ర ఇమాములు చెప్పిన హదీసులను విశ్వసించడం. రెండవ పద్ధతి, ఖుర్ఆన్ వ్యాఖ్యానం ఖుర్ఆన్ ద్వార అనగ కొన్ని పలు అర్ధాల గల ఆయత్ లను ప్రక్క ప్రక్కన పెట్టి మరియు ఒకే ప్రత్యేక రంగానికి చెందిన వాటిని సంగ్రహించి ఆయత్ అసలు భావాన్ని అర్ధం చేసుకోవడం.[ఉలూమె ఖుర్ఆన్, తఫ్సీరె ఖుర్ఆన్ వివరణ అధ్యాయంలో]

రిఫ్రెన్స్
ఉలూమె ఖుర్ఆన్, ఆయతుల్లాహ్ మారెఫత్, తఫ్సీరె ఖుర్ఆన్ వివరణ అధ్యాయంలో

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16