దైవప్రవక్త(స.అ) యొక్క సహాబీ అయిన సఅద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్ గురించి చరిత్ర గ్రంథాల పరంగా సంక్షిప్త వివరణ...
ఇది ఒక నింద మాత్రమే. దీనిని చరిత్ర సాక్ష్యాలు అసత్యంగా నిర్ధారిస్తు న్నాయి. ఎందుకంటే ఒకవేళ ఉస్మాన్ అలీ(అ.స) ఉపదేశాలను అంగీకరించినట్లైతే, దాని పై అమలు చేసినట్లైతే, ఉస్మాన్ కొరకు అలీ(అ.స) కన్న ఎక్కవ నిష్కపటమైన నీత్యుపదేశి ఎవ్వరూ లేరు.
మేము “సఅద్” సహకరించని విషయం గురించి సంక్షిప్తంగా చెప్పింది సరిగా హజ్రత్ అలీ(అ.స) అతని గురించి చెప్పిందే; “అతను శత్రుత్వం వల్ల అటు వెళ్ళిపోయాడు”
అంటే అతనికి యదార్థం చెలిసినప్పటికీ విరుద్ధమైన మాటలు, శత్రుత్వం అతని మరియు యదార్థం మధ్యలో అడ్డుగా వచ్చాయి. గద్దించేటువంటి అంతరాత్మలో ఆశ్చర్యం, ఆందోళన వచ్చినిలిచాయి. అతని ఆత్మ అతనిని అజ్ఞాన కాలపు అలవాట్ల వైపు మరలించింది. మరియు సఅద్ పై చెడుఆత్మ ప్రభావం ఎక్కువయ్యింది, అది అతనిని సత్య సహాయానికి అడ్డుపడింది.
అతని ఆశ్చర్య మరియు ఆందోళన స్థాయి గురించి చరిత్రకారులు వ్రాసిన విషయాలే దీనికి నిదర్శనం. “ఇబ్నె కసీర్” తన పుస్తకం “తారీఖ్” లో ఇలా వ్రాశారు: ఒకరోజు “సఅద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్”, “ముఆవియా ఇబ్నె అబీ సుఫ్యాన్” వద్దకు వెళ్ళారు, అప్పడు ముఆవియా అతనితో ఇలా అన్నాడు: నీకేమయ్యింది, నీవు అలీ(అ.స)తో ఎందుకని యుద్ధం చేయవు?
సఅద్: అయ్యో అయ్యో! నేను తుఫానుగాలి పైనుండి వెళ్ళేంత వరకు నా ఒంటెను(వాహనాన్ని) పడుకోబెట్టేశాను, ఆ తరువాత నాకు దారి అర్ధం అయ్యింది, నేను నా ప్రయాణం మొదలు పెట్టాను.
ముఆవియా: అల్లాహ్ గ్రంథంలో “అయ్యో అయ్యో!” లేదు, అల్లాహ్ ఇలా ప్రవచించెను:
وَإِن طَآئِفَتَانِ مِنَ ٱلۡمُؤۡمِنِينَ ٱقۡتَتَلُواْ فَأَصۡلِحُواْ بَيۡنَهُمَاۖ فَإِنۢ بَغَتۡ إِحۡدَىٰهُمَا عَلَى ٱلۡأُخۡرَىٰ فَقَٰتِلُواْ ٱلَّتِي تَبۡغِي حَتَّىٰ تَفِيٓءَ إِلَىٰٓ أَمۡرِ ٱللَّهِ
అనువాదం: ఒకవేళ విశ్వాసులలోని రెండు పక్షాల వారు పరస్పరం గొడవ పడితే వారి మధ్య సయోధ్య చేయండి. మరి వారిలో ఒక పక్షంవారు రెండవ పక్షం వారిపై దౌర్జన్యం చేసే వర్గం దైవాజ్ఞ వైపు మరలివచ్చే వరకూ మీరు వారితో పోరాడండి.[హుజురాత్ సూరా:49, ఆయత్:9]
అల్లాహ్ సాక్షిగా నీవు న్యాయస్థుడికి వ్యతిరేకంగా విరోధితో కలిసి లేవు మరి అలాగే విరోధికి వ్యతిరేకంగా న్యాయస్థుడితో కలసి లేవు.
అప్పుడు “సఅద్” ఇలా అన్నారు: నేను దైవప్రవక్త(స.అ) ఇలా చెప్పిన వ్యక్తితో ఏమాత్రం యుద్ధం చేయాను. దైవప్రవక్త(స.అ): “హారూన్, మూసా(అ.స)కు ఎలాగో నీవు కూడా నాకు అలాగే, కాని (తేడా ఏమిటంటే) నా తరువాత ఏ ప్రవక్త ఉండడు”.
ముఆవియా: ఈ హదీస్ నీతో పాటు ఇంకా ఎవరెవరు విన్నారు?
సఅద్: ఫలానా, ఫలానా మరియు ఉమ్మే సల్మా. ముఆవియా నిలబడ్డాడు. మరియు ఉమ్మె సల్మా
ను ప్రశ్నించాడు, ఉమ్మె సల్మా సఅద్ చెప్పిన హదీస్
నే చెప్పారు. అప్పుడు ముఆవియా ఇలా అన్నాడు: ఒకవేళ నేను ఈ హదీస్
ను ఈరోజుకు ముందు విని ఉంటే నా ప్రాణం లేదా అతని ప్రాణం పోయేంత వరకు అలీ(అ.స) యొక్క సేవకుడిగా మారిపోయేవాడిని.[1]
“మస్ఊదీ” కూడా తన పుస్తకం “తారీఖ్”
లో సఅద్ మరియు ముఆవియా చర్చను ఇలాగే వ్రాశారు. మరి సఅద్ ముఆవియాను “మన్జిలత్ హదీస్”ను వినిపించినప్పుడు అతడు ఇలా అన్నాడు: ఇంతకు ముందు నిన్ను ఎన్నడూ చీవాట్లు పెట్టలేదు, ఎందుకని నీవు అతనిని సహకరించలేదు? ఎందుకు అతనితో బైఅత్ చేయలేదు? నేను గనక దైవప్రవక్త(స.అ) నుండి అతని గురించి నీవు విన్నటువంటి హదీస్ విని ఉంటే, ప్రాణం ఉన్నంత వరుక అలీ(అ.స)కు సేవలు చేసే వాడిని.[2]
అలీ(అ.స) ప్రతిష్టతల క్రమంలో “సఅద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్”, ముఆవియాతో చెప్పిన ఈ హదీస్ కూడా ఒకే లక్ష్యాన్ని నిరూపిస్తున్న వందల హదీస్
లలో ఒకటి. అదేమిటంటే దైవప్రవక్త(స.అ) తరువాత ఇస్లామీయ సందేశాన్ని ప్రచారం చేయగల వ్యక్తి అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స). అతను తప్ప వేరే వారిలో ఈ పనిని చేసేందుకు శక్తిలేదు. ఇలా ఉన్నంత కాలం విశ్వసించిన సజ్జనులందరూ జీవితాంతం అతని సేవ చేయడమే గొప్ప.
ముఆవియా చెప్పిన మాట: “ఒకవేళ ఈ హదీస్
ను ఇంతకు ముందు విని ఉంటే నా పూర్తి జీవితాన్ని అలీ(అ.స) సేవలో గడిపేవాడిని” ఇది ప్రతీ విశ్వసించిన ప్రతీ స్త్రీ మరియు పురుషుడు గొప్పగా భావించేటువంటి యదార్థాం.
కాని ముఆవియా ఇలా “సఅద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్”ను పరిహాసించడానికి చెప్పిన మాట అది. ఎందుకంటే ఇంతకు ముందు సఅద్ అలీ(అ.స)
ను దూషించేందుకు నిరాకరించారు కాబట్టి. ఇకనైనా అలీ(అ.స)ను దూషించాలని, ముఆవీయా కోరిక నెరవేరాలని అలా చెప్పాడు.
వాస్తవానికి ముఆవియాకు అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) ప్రతిష్టత క్రమంలో “మన్జిలత్ హదీస్” కన్న ఎక్కవ తెలుసు. దైవప్రవక్త(స.అ) తరువాత అలీ(అ.స) అందరికన్న ప్రతిష్టులు అన్న విషయం అతడికి తెలియనిదేమి కాదు. స్వయంగా అతనే ఈ విషయాన్ని స్పష్టంగా “మొహమ్మద్ ఇబ్నె అబీబక్ర్
”కు వ్రాసిన ఉత్తరంలో వ్రాశారు. ఇన్
షా అల్లాహ్ త్వరలోనే మేము వాటిని వివరిస్తాము.
“ఉమ్మె సల్మా” చేత కూడా నిరూపించబడినటువంటి ఆ “సఅద్” యొక్క హదీస్ విని, ముఆవియా అలీ(అ.స) పై దూషణ కార్యక్రమాన్ని నిలిపివేశాడా?
ఏమాత్రం కాదు. అతని మార్గభ్రష్టత మించిపోయింది. అతను పాపములు చేసి గౌరవాన్ని పొందేవాడు. అలీ(అ.స) మరియు అలీ(అ.స) సంతానం పై లఅనత్ చేయించేవాడు. ప్రజలతో బలవంతంగా లఅనత్ చేయించేవాడు. ఈ లఅనత్ కార్యక్రమం 80 ఏళ్ళ వరకు నడుస్తూనే ఉంది. (ఇన్ని సంవత్సరాల కాలం తక్కువ కాలం కాదు) 80 ఏళ్ళలో పిల్లలు పెద్దవారవుతారు మరియు యువకులు ముసలి వారవుతారు.
فَمَنۡ حَآجَّكَ فِيهِ مِنۢ بَعۡدِ مَا جَآءَكَ مِنَ ٱلۡعِلۡمِ فَقُلۡ تَعَالَوۡاْ نَدۡعُ أَبۡنَآءَنَا وَأَبۡنَآءَكُمۡ وَنِسَآءَنَا وَنِسَآءَكُمۡ وَأَنفُسَنَا وَأَنفُسَكُمۡ ثُمَّ نَبۡتَهِلۡ فَنَجۡعَل لَّعۡنَتَ ٱللَّهِ عَلَى ٱلۡكَٰذِبِينَ
అనువాదం: కనుక నా వద్దకు ఈ జ్ఞానం వచ్చిన తరువాత కూడా నీతో ఎవరైనా ఈ విషయంలో వాదనకు దిగితే వారితో స్పష్టంగా ఇలా చెప్పేయి: “ రండి! మీ కుమారులను మా కుమారులను, మీ స్త్రీలను మా స్త్రీలను పిలుద్దాం. స్వయంగా మీరు మేము కూడా వద్దాం. ఆ తర్వాత “అబద్ధాలు చెప్పేవారిపై అల్లాహ్ శాపం పడుగాక!” అని దీనాతిదీనంగా ప్రార్థిద్దాము.[ఆలి ఇమ్రాన్ సూరా:3, ఆయత్:61]
రిఫరెన్స్
1. తారిఖె ఇబ్నె కసీర్, భాగం8, పేజీ77.
2. మురవ్విజుజ్జహబ్, హాలాతు సఅద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్.
వ్యాఖ్యానించండి