ఇక్మాల్ ఆయత్ నిదర్శనం-1

ఆది, 07/17/2022 - 15:22

ఇది గదీరె ఖుమ్ లో అవతరించబడింది అని నిరూ పిస్తున్న కొన్ని కారణాల వివరణ...

ఇక్మాల్ ఆయత్ నిదర్శనం-1

ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ وَأَتۡمَمۡتُ عَلَيۡكُمۡ نِعۡمَتِي وَرَضِيتُ لَكُمُ ٱلۡإِسۡلَٰمَ دِينٗا
అనువాదం: ఈ రోజు నేను మా దీన్ ని మీ కొరకు పరిపూర్ణం చేశాను. మీ పై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు ఇస్లాం ధర్మాన్ని ఇష్టానుసారమైనదిగా చేశాను[మాయిదహ్ సూరా:5, ఆయత్:3]

ఒకవేళ వాళ్ళు ఈ ఆయత్ “గదీరె ఖుమ్”లో అవతరించబడింది అని అంగీకరించినట్లైతే, దీన్‌కు సంపూర్ణత్వం ప్రసాదించబడింది ఈ అలీ(అ.స) యొక్క విలాయత్ (సాన్నిధ్యము) అంశమే అనీ, మరియు ముస్లిముల పై అనుగ్రహాలు పూర్తి చేయబడ్డాయి అనీ, ముగ్గురు ఖలీఫాల ఖిలాఫత్ పదవి ఆవిరై ఎగిరి పోయింది అనీ, సహాబీయులు న్యాయమూర్తులు అనే విశ్వాసపు షిప్పు మునిగిపోయింది అనీ, ఖిలాఫత్ మరియు వాటి పరియాలోచన కేంద్రాలు నాశనం అయ్యాయి అనీ, చాలా ప్రముఖ హదీసులు నీళ్ళలో ఉప్పు కరిగిపోయినట్లు కరిగిపోయాయి అనీ, మతాలు మరియు వాటి పెద్దలు సందేహాలకు గురి అవుతారు అనీ, చాలా రహస్యాల పైనుండి ముసుగు తీయబడుతుంది అనీ, గాలిలో నిలబెట్టబడిన పెద్ద కట్టడం కూలిపోతుంది అనీ కూడా ఒప్పుకోవలసి వస్తుంది. మరి ఇలాంటి అంగీకారం చాలా కష్టమైనది ఎందుకంటే ఈ సమస్య ఒకపెద్ద ఉమ్మత్ యొక్క విశ్వాసానికి సంబంధించింది. ఆ ఉమ్మత్‌కు ఒక చరిత్ర ఉంది, వాళ్ళ ఉలమాలు ఉన్నారు, వాళ్ళ వద్ద మంచి మంచి రివాయతులూ ఉన్నాయి. అందుకని వాళ్ళు బుఖారీ మరియు ముస్లిం లాంటివాళ్ళను సమర్ధించడంలో నిస్సహాయులు ఎందుకంటే వాళ్ళు ఈ ఆయత్‌ను అరఫా రాత్రి శుక్రవారం రోజు అవతరించబడింది అని రివాయత్‌ను లిఖించారు.

వీళ్ళు ఈ ఆయత్‌ను తీసి వేరే చోట ఫిట్ చేస్తే ముందు నుండి ఉన్న షియా ముస్లింల రివాయత్‌లు నిరాధారం అవుతాయి మరి షియాలను దూషించడం మరియు లఅనత్ చేయడం, సహాబీయుల ప్రతిష్టతను కించపరచడం కన్న మేలయినదే కదా. ఈ సహాబీయులు[1] మాసూములు(పవిత్రులు), వాళ్ళ వచనల మరియు కార్యముల పట్ల ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదు. ఇక షియా ముస్లిములు అంటారా, వాళ్ళు మజూసీయులు(అగ్న్యుపాసకుడు) అవిశ్వాసులు, నాస్తికులు, జిందీఖులు, వాళ్ళ వర్గ సృష్టికర్త “అబ్దుల్లా ఇబ్నె సబా”.[2] ఇబ్నె సబా ఒక యూదుడు, ఇస్లాం మరియు ముస్లిములను మోసగించడానికి హజ్రత్ ఉస్మాన్ ఖిలాఫత్ పదవీ కాలంలో ఇస్లాం స్వీకరించి ముస్లింగా మారాడు.

షియా ముస్లింలపై ఇలాంటి నిందలు వేయడం ఉమ్మతె ముస్లిమహ్ యొక్క ఈ శిక్షణ; “సహాబీ ఎలాంటి వాడయిన సరే అతడు తన జీవిత కాలంలో ఒక్కసారి దైవప్రవక్త(స.అ)ను దర్శించిన వాడైనా సరే, సహాబీయులను గౌరవించాలి” వల్ల సులభం అయ్యింది.

కాని వాళ్ళను ఈ షియా ముస్లింల రివాయతులు నకిలీ రివాయతులు కావు, అంతేకాదు ఈ రివాయతులు ఎవరి ఇమామత్ పై దైవప్రవక్త(స.అ) నస్స్[3] ఉందో ఆ పన్నేండు ఇమాములు ప్రవచించినటువంటి రివాయతులు అని కూడా ఒప్పించ లేము. హిజ్రీ యొక్క మొదటి శతాబ్ధ ఇస్లామీయ అధికారం ప్రజల మనసులో సహాబీయుల పట్ల ఇష్టం మరియు గౌరవ బీజాన్ని నాటడంలో ఎలాగైతే సాఫల్యం అయ్యిందో అలాగే ఉమ్మతె ముస్లిమహ్ మనసులో హజ్రత్ అలీ(అ.స) మరియు వారి సంతానం పట్ల ద్వేషం సృష్టించడంలో కూడా సాఫల్యం అయ్యింది; హజ్రత్ అలీ(అ.స) పై పీఠాల నుండి లఅనత్ చేయబడేది, మరి వాళ్ళ షియాలను హింసించి చంపారు, పట్టణాల నుండి బహిష్కరించబడ్డారు. ముఆవియా కాలంలో అసత్యం, మూడనమ్మకాలు మొ॥ లాంటి ప్రచార సాధనాలు చాలా ఎక్కువగా ఉండేవి అందుకు జనం షియాలను చాలా ద్వేషించే వారు మరియు షియాలపై మనసు విప్పి మరీ తప్పుడు మరియు చెడు నమ్మకాలు అంటకట్టబడ్డాయి. ఎందుకంటే వీళ్ళే అధికారానికి ఎదురుతిరిగే వారు. ఎలాగైతే ఈ రోజుల్లో వాళ్ళను మంచి మంచి పోస్టుల నుండి తొలగిస్తున్నారో మరియు వీలు దొరికితే చంపేస్తున్నారో అలాగన్నమాట.

అందుకనే అప్పటి చరిత్రకారులు మరియు రచయితలు షియాల పేరు “రవాఫిజ్” అని పెట్టారు. వాళ్ళను కాఫిర్ అనేవారు, మరి అధికారులకు దగ్గర అవ్వడానికి వాళ్ళ రక్తం చిందించడం న్యాయసమ్మతిగా(ముబాహ్) భావించే వారు. అమవీ అధికారం అంతమైన తరువాత అబ్బాసీయులు అధికారం పై వచ్చినప్పుడు కొంత మంది చరిత్రకారులు తమ పాత పధ్ధతుల పైనే నడిచేవారు కాని కొందరు అహ్లెబైత్[4] ల యదార్ధాన్ని తెలుసుకున్నారు అందుకని వాళ్ళు న్యాయంగా పని చేయాలని అనుకున్నారు మరియు సమస్యను సరి చేయాలని ప్రయత్నించారు మరియు హజ్రత్ అలీ(అ.స)ని “ఖులఫాయే రాషిదీన్‌”లలో చేర్చారు కాని వాళ్ళకు కూడా హజ్రత్ అలీ(అ.స)ని ప్రముఖులుగా మరియు శ్రేష్ఠులుగా నిరూపించే ధైర్యం చాల్లేదు. అందుకనే వీళ్ళు తమ సహ్హాహ్ పుస్తకాలలో అప్పుడప్పుడూ అక్కడక్కడా హజ్రత్ అలీ(అ.స) గారి ప్రతిష్టతలను లిఖించే వారు.

కాని ఖులఫాయే సలాసహ్(ముగ్గురు ఖలీఫాల)లకు భిన్నంగా కాకుండా ఉండే విధంగా జాగ్రత్త పడేవారు. మరి కొందరైతే వాళ్ళ పై హజ్రత్ అలీ(అ.స) గారి ప్రతిష్టతను ఎక్కువ అని భావించే వాళ్ళ నోళ్ళు మూయించడానికి అబూబక్ర్, ఉమర్ మరియు ఉస్మాన్‌ల ప్రతిష్టత పట్ల స్వయంగా తప్పుడు రివాయతులు సృష్టించే వారు.

రిఫరెన్స్
1. అహ్లెసున్నతుల విశ్వాసం ప్రకారం, సహాబీయుల ఉదాహారణ నక్షత్రాలు వంటిది, ఎవ్వరి అడుగుజాడలలో నడిచిన రుజుమార్గానికి చేరగలరు.
2. అల్లామా అస్కరీ గారి పుస్తకంలో అబ్దుల్లాహ్ ఇబ్నె సబా గురించి చదవండి అప్పుడు తెలుస్తుంది చరిత్రలో ఇలాంటి వ్యక్తే లేడు అని. అబధ్ధం చెప్పడం లో ప్రముఖుడు మరియు తప్పుడు, నకిలీ రివాయతులు తయాలు చేయువాడు సైఫ్ బిన్ ఉమర్, ఆతడిని సృష్టించాడు. అలాగే డాక్టర్ తాహా హుసైన్ పుస్తకం అల్ ఫిత్నతుల్ కుబ్రాను చదవండి. లేదా కితాబుస్సిలతి బైనత్తసవ్వుఫి వత్తషయ్యో చదవండి. అప్పుడు మీకు అర్ధమవుతుంది అబ్దుల్లాహ్ ఇబ్నె సబా అని అమ్మారె యాసిర్‌ను అనేవారు.
3. ఇస్లాం యొక్క స్పష్ట ఆదేశం.
4. అహ్లెబైత్(అ.స)ల సద్గుణం, జ్ఞానం, ధర్మనిష్ఠ మరియు అనుగ్రహాన్ని చూసి ప్రజలు యధార్ధాన్ని తెలుసుకున్నారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14