ఇమామ్ సజ్జద్(అ.స) ఉల్లేఖనలు

మంగళ, 08/23/2022 - 15:15

ఇమామ్ సజ్జద్(అ.స) యొక్క కొన్ని హదీసుల తెలుగు అనువాదం...

ఇమామ్ సజ్జద్(అ.స) ఉల్లేఖనలు

1. శ్రేయస్సు మరియు మంచి భాగ్యం, ఆత్మరక్షణలో ఉంది. (అన్ని విధాలా పాపముల నుండి దూరంగా ఉండడంలోనే శ్రేయస్సు మరియు మరియు మంచి భాగ్యం ఉంది).[1]

2. ఇహలోకంలో దానకరులు ప్రజల నాయకుడు (అయితే) పరలోకంలో ధర్మనిష్ఠులు నాయకులు అయి ఉంటారు.[2]

3. ఎవరైతే అల్లాహ్ (సంతోషం) కోసం వివాహం చేసుకుంటాడో అలాగే చుట్టాలతో మంచిగా ఉంటాడో, అల్లాహ్ అతడిని ప్రళయదినాన గొప్పస్థానం మరియు గౌరవాన్ని ప్రసాదిస్తాడు.[3]

4. శ్రెమించేవారిలో ప్రతిష్టాత్మకమైన మరియు ముఖ్యమైన వారు తన కడుపు మరియు మర్మాంగాలను కాపాడుకొనేందుకు ప్రయత్నించేవాడు.[4]

5. ప్రపంచం అర్థనిద్ర(కునుకు) లాంటిది మరియు పరలోకం మెలుకువ లాంటిది మరి మనం ఈ రెండింటి మధ్యలో వ్యాకులత నిద్రలో ఉన్నాము.[5]

6. కష్టాలలో సమ్మతభావం కలిగివుండడం విశ్వాసం మరియు నమ్మకం యొక్క ఉత్తమ స్థానాల నుండి.[6]

7. ఉత్తములతో కూర్చోవడం మంచి వైపుకు దారి తీస్తుంది, ఉలమాలతో జీవించడం మరియు వారితో మాట్లాడడం వివేకాన్ని పెంచుతుంది.[7]

రిఫరెన్స్
1. తొహ్ఫుల్ ఉఖూల్, పేజీ232, బిహారుల్ అన్వార్, భాగం75, పేజీ136, హదీస్3.
2. మిష్కాతుల్ అన్వార్, పేజీ232. బిహారుల్ అన్వార్, భాగం78, పేజీ50, హదీస్77.
3. మిష్కాతుల్ అన్వార్, పేజీ166.
4. మిష్కాతుల్ అన్వార్, పేజీ157.
5. తంబీహుల్ ఖవాతిర్, పేజీ343.
6. ముస్తద్రికుల్ వసాయిల్, భాగం2, పేజీ413, హదీస్16.
7. బిహారుల్ అన్వర్, భాగం1, పేజీ141.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12