జనాబె జైనబ్[స.అ]-1

బుధ, 08/31/2022 - 18:11

జనాబె జైనబ్[స.అ] యొక్క వంశం, ఆమె బాల్యం, ఆమె జ్ఞానం మరియు ఆమె యొక్క ఇమామత్ పట్ల విధేయత గురించి సంక్షిప్త వివరణ...

జనాబె జైనబ్[స.అ]-1

అరబీ భాషలో “జైనబ్” యొక్క అర్ధం మంచిదృశ్యంగల వృక్షం. అనగా మంచి మంచి సువాసనలతో, రసభరితమైన పండ్లూ, పూలతో నిండుగా ఉన్న వృక్షం, దానిని చూడగానే మనసుకు శాంతి కలుగుతుంది మరియు అది ప్రతీ మనిషికి లాభం చేకూర్చుతుంది. “జైనబ్” యొక్క పదానికి ఇంకో అర్ధం కూడా ఉంది అది “జైను అబ్” అనగా “తండ్రికి అలంకరణ”. ఈమె హజ్రత్ అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్[స.అ] యొక్క ప్రియకుమార్తె. ఖుర్ఆన్, అహ్లెబైత్[అ.స]ను “షజరయే తయ్యబహ్” అనగా పవిత్రమైన వృక్షంగా వివరించింది, మరి జనాబె జైనబ్[అ.స] ఆ “షజరయే తయ్యబహ్” యొక్క మంచిదృశ్యం గల వృక్షంలాంటివారు దాని సుగంధంతో విశ్వాసులూ, ధర్మనిష్టులూ ప్రభావితులయ్యారు. ఈ వృక్షం యొక్క ప్రతిష్టత యొక్క ప్రకాశవంతమైనా, పచ్చనైనా ఆకులను అల్లాహ్ తయారు చేశాడు, అందులో గొప్ప గుణాలు, మాట సరళత్వం, మంచి స్వభావం, స్వచ్ఛమైన తౌహీద్, జ్ఞానం, కరుణా, జాలీ, దయా, ధర్మనిష్ఠత, ధైర్యసాహసాలు, శౌర్యం, ఉత్తమత్వం, పవిత్రిత, గొప్పతనం, సౌఖ్యం మరియు గౌరవం యొక్క సుగంధాలు ఉన్నాయి. మరి అందులో ఉన్న ఆకర్షణ చూసే వారికి ముగ్దుడ్ని చేస్తాయి.

జైనబ్[అ.స], ఇస్లాం కారకుడు మరియు అల్లాహ్ యొక్క హబీబ్, సకలలోకాలకే కారుణ్యం అయిన హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా[స.అ] మరియు అరబ్ యొక్క రాణి జనబె ఖదీజా యొక్క మనవరాలు. దైవప్రవక్త[స.అ] సహాయ, ఇస్లాం పరోపకారి అయిన జనాబె అబూతాలిబ్[అ.స] యొక్క పౌత్రి. విశ్వాసుల నాయకుడు, దైవప్రవక్త[అ.స] అసలు సిసలైన ఉత్తరాధికారి హజ్రత్ ఇమామ్ అలీ[అ.స] మరియు సర్వలోకస్ర్తీల నాయకురాలు అయిన హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] యొక్క కుమార్తె. స్వర్గయువకుల నాయకులైన ఇమామ్ హసన్ మరియు ఇమామ్ హుసైన్[అ.స] మరియు హజ్రత్ అబ్బాస్[అ.స] యొక్క చెల్లెలు. ఇస్లాం ప్రచారీ అయిన జఫరె తయ్యార్ మరియు అస్మా బింతె ఉమైస్ యొక్క కొడలు. త్యాగానికి మరియు ఔదార్యానికి మారు పేరు అయిన అబ్దుల్లాహ్ ఇబ్నె జాఫర్ యొక్క భార్య.

బాల్యం

జనాబె జైనబ్[అ.స]కు ఐదారేళ్ళ వయసు ఉన్నప్పుడే ఆమె తల్లి విలాయత్ కోసం పోరాడుతూ మరణించారు. ఆమె తన తల్లితో ఐదారేళ్ళ కన్న ఎక్కువ ఉండలేక పోయారు, అయినప్పటికీ ఆ ఐదారేళ్ళలోనే జరిగిన పాలనపోషణ తల్లి మనసు, ఆలోచనాబలం, మనశాంతి, సహనం, మాటతీరు, వివేకం, కరుణా, దయాలలో ఇంకో ఫాతెమా జహ్రా(సానియా జహ్రా[అ.స])గా తయారయ్యారు.

జనాబె జైనబ్(అ.స) కు ఫిదక్ ఉపన్యాసం పట్ల ఉన్న జ్ఞానం

“అబుల్ ఫరజ్” తన గ్రంథం “మఖాతిలుత్తాలిబీన్”లో ఇలా ఉల్లేఖించారు: “ఔన్ మరియు ముహమ్మద్”ల తల్లి, అఖీలయే బనీ హాషిం(వివేకీ), అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] కుమార్తె జైనబ్[అ.స] 5 సంవత్సరాల వయసులో “ఫిదక్” ఉపన్యాసాన్ని ఉల్లేఖించిన వారు. (హవాలా) గొప్ప ముహద్దిస్ అయిన షేఖ్ సదూఖ్[ర.అ] తన గ్రంథం “ఇలలుష్షరాయే”లో ఇలా ప్రస్తావించారు: మేము ముహమ్మద్ ఇబ్నె మూసా ఇబ్నె ముతవక్కిల్ నుండి, అతను అలీ ఇబ్నె హుసైన్ అస్అద్ ఆబాదీ మరియు అతను అహ్మద్ ఇబ్నె అబీ అబ్దిల్లాహ్ బర్ఖీ నుండి, మరియు అతను ఇస్మాయీల్ ఇబ్నె మెహ్రా నుండి మరియు అతను అహ్మద్ ఇబ్నె ముహమ్మద్ ఇబ్నె జాబిర్ మరియు అతను జైనబ్ బింతె అలీ[అ.స] నుండి “ఫిదక్” ఉపన్యాసాన్ని ఉల్లేఖించారు. ఈ ఉపన్యాసం వాక్చాతుర్యం, సమయోచిత భాషణము గల ఉపన్యాసం. ఇందులో ఇస్లాం కన్న ముందు మరియు ఇస్లాం యొక్క పూర్వపు సంఘటనలు ఉన్నాయి. 5 సంవత్సరాల వయసులో ఆ వాక్చాతుర్యం మరియు సమయోచిత భాషణంతో పాటు ఉపన్యాసాన్ని గుర్తుంచుకోవడం ఆమె యొక్క జ్ఞానం, మంచి వివేకం మరియు బుద్దికి నిదర్శనం.

ఇమామత్ పట్ల జనాబె జైనబ్(అ.స) విధేయత

జనాబె జైనబ్[అ.స] యొక్క జ్ఞానం, కరుణ, పట్టుదల, మంచి లక్షణాలు, గొప్పగుణాలు, ఈ అంతంలేని ప్రతిష్టతలను చూసీచూడనట్లు వదులుకోలేము. జనాబె ఫాతెమా జహ్రా[అ.స] జ్ఞాపకార్ధం, ఛాయాచిత్రం అయిన జనాబె జైనబ్[అ.స]లో తల్లిలో ఉన్న పట్టుదల, ఓర్పూ, సహనం, త్యాగం మరియు ఔదార్యం అన్నీ వచ్చాయి. ఇమామ్ హుసైన్[అ.స] ఆమె పట్ల గౌరవాన్ని చెల్లెలు అనే ఉద్దేశంతో చూపేవారు కాదు ఆమెలో ఉన్న ఫాతెమా జహ్రా[అ.స] యొక్క ఉత్తమత్వ స్వభావాలను, గుణాలను చూసి గౌరవించేవారు. మరి అలాగే జనాబె జైనబ్ కూడా ఇమామ్ హుసైన్[అ.స] ను తన అన్నయ్యా అని గౌరవిచేవారు కాదు ఆమె అతనిని ఇమామ్ గా భావించి, అతని పట్ల విధేయత చూపడం విధిగా భావించి కల్మషం లేకుండా ఇష్టపడేవారు మరియు గౌరవించేవారు. అలాగే ఇమామ్ హుసైన్[అ.స] కుమారుడు జైనుల్ ఆబెదీన్[అ.స] ఆమెకు అన్నయ్య కుమారుడు అవుతారు, వయసులో చిన్నవారు అయినా సరే ఇమామ్ కాబట్టి అయన ఆజ్ఞల మరియు ఆదేశాల పట్ల విధేయత చూపే వారు. మరి ఆమె యొక్క ఇమామ్ పట్ల ఈ విధేయతయే ఆమె జీవిత చరిత్ర చదివేవారికి ముగ్దుడ్ని చేస్తుంది.

రిఫరెన్స్
ముంతహల్ ఆమాల్, జనాబె జైనబ్(స.అ) జీవిత చరిత్ర.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 31