జనాబె జైనబ్(స.అ)-2

బుధ, 08/31/2022 - 18:53

జనాబె జైనబ్[స.అ] యొక్క వంశం, ఆమె బాల్యం, ఆమె జ్ఞానం మరియు ఆమె యొక్క ఇమామత్ పట్ల విధేయత గురించి సంక్షిప్త వివరణ...

జనాబె జైనబ్(స.అ)-2

వివాహ జీవితం

ఇమామ్ హుసైన్[అ.స] లాంటి పవిత్ర ఇమామ్, ఖుర్ఆన్ పారాయణాన్ని వదిలి నిలబడి గౌరవిచేటువంటి వ్యక్తి పేరు జనాబె జైనబ్[అ.స]. మరి అలాంటి ప్రతిష్టతగల ఈమెకు జీవితాంతం తోడుగా ఉండేందుకు మరో వ్యక్తిని ఎన్నుకునే విషయం కూడా చాలా ముఖ్యమైనదౌతుంది. వచ్చే వ్యక్తిలో కూడా అవే గుణాలు అవే లక్షణాలు అదే స్వభావం అవే ప్రతిష్టతలు ఉండాలి. చరిత్ర మరియు రివాయత్ల ద్వార తెలిసే విషయమేమిటంటే దైవప్రవక్త[స.అ] యొక్క మిత్రులు, బంధువులు, సహాబీయులు మరియు చాలా మంది ఫాతెమా జహ్రా[స.అ] కోసం వివాహసంబంధాలు తీసుకొచ్చారు, దైవప్రవక్త[స.అ] “ఈ సమస్యను అల్లాహ్ పరిష్కరిస్తాడు” అని అంగీకరించలేదు. మరి హజ్రత్ అలీ[అ.స] తరపు నుండి కబురు వచ్చినప్పుడు గౌరవంగా అంగీకరించారు మరియు ఇలా అన్నారు: “అలీ లేకుంటే ఫాతెమాకు సరైన వాడు ఉండేవాడు కాదు”. మరి ఇదే విధంగా హజ్రత్ జైనబ్[అ.స] వివాహ సమస్య వచ్చినప్పుడు కూడా హజ్రత్ అలీ[అ.స] యొక్క మిత్రులు, బంధువులు మరియు సహాబీయులు ముందుకొచ్చి వారి మనసులో ఉన్న మాటను చెప్పారు కాని అలీ[అ.స] వారి కోరికను అంగీకరించే వారు కాదు. ఎప్పుడైతే అబ్దుల్లాహ్ ఇబ్నె జాఫరె తయ్యార్ యొక్క కబురు వచ్చిందో హజ్రత్ అలీ[అ.స] చాలా గౌరవంగా అంగీకరించారు. ఇదీ హజ్రత్ ముహమ్మద్[స.అ] మరియు హజ్రత్ అలీ[అ.స]లో ఉన్న నైపుణ్యం మరియు అంతర్ దృష్టి, వారు వివాహం విషయంలో ధర్మనిష్టా, గౌరవం, జ్ఞానం, వివేకం లాంటివే చూశారు. హజ్రత్ అలీ[అ.స] కూడా హజ్రత్ జైనబ్[అ.స] యొక్క మెహ్ర్(ఓలి) తన భార్య హజ్రత్ ఫాతెమా[అ.స] యొక్క మెహ్ర్ కు సమానంగా ఇచ్చారు.

అబ్దుల్లాహ్ ఇబ్నె జాఫర్
అబ్దుల్లాహ్ ఇబ్నె జాఫర్ ప్రముఖ వ్యక్తి. అతని త్యాగం మరియు ఔదార్యత గురించి చర్చలు జరిగేవి. తండ్రి పేరు జాఫర్ ఇబ్నె అబీతాలిబ్[అ.స], ఇతను వీరత్వం, ధైర్యసాహసాలలో ప్రముఖులు. ఇతను దైవప్రవక్త[స.అ]ను విశ్వసించడం మరియు దైవారాధనకు వ్యతిరేకత పట్ల ప్రయత్నం వారికి ఇస్లాం రక్షణ కోసం మక్కా నుండి “హబషహ్” వెళ్ళవలసి వచ్చింది. 12 సంవత్సరాలు తన తండ్రి హజ్రత్ అబూతాలిబ్ మరియు తల్లి ఫాతెమా బింతె అసద్ కు దూరంగా పరాయి దేశంలో జీవితం గడిపారు. చాలా నిజాయితీ మరియు బలిదానాలతో ఇస్లాం ధర్మం తరపు నుండి పోరాడారు దాంతో హబషహ్ రాజు నజాషీ మరియు క్రైస్తవ ఫాదర్ల పై గట్టి ప్రభావం పడింది. జనాబె అబ్దుల్లాహ్ ఇలాంటి ధైర్యవంతులు, త్యాగమూర్తుల మరియు విశ్వసి యొక్క కుమారుడు. హజ్రత్ అబూతాలిబ్ నిరంతరం ఇస్లాం మార్గంలో చాలా త్యాగాలు అర్పించుకున్నారు. అబ్దుల్లాహ్ ఇబ్నె జాఫర్ యొక్క స్వభావం కూడా తన తండ్రి లాగ అలీ[అ.స] స్వభావంతో కలిసేది, అందుకనే వారు కూడా ఇమామ్ పట్ల విధేయులుగా ఉండేవారు. జనాబె జైనబ్ ఎప్పుడు ఇమామ్ హుసైన్[అ.స]ను చూడాలనుకుంటే అప్పుడు అనుమతిచ్చేవారు, చివరికి కర్బలా ప్రయాణంలో ఆమెకు ఆమె అన్నయ్య ఇమామ్ హుసైన్[అ.స]తో పాటు వెళ్ళడానికి కూడా అనుమతిచ్చారు. అంతేకాకుండా తమ ఇద్దరు కుమారులైన ఔన్ మరియు మొహమ్మద్ లను కూడా ఇస్లాం తరపు నుండి పోరాడేందుకు జనాబె జైనబ్[అ.స]తో పాటు సాగనంపారు. ఇవన్ని వారి స్వభవ పవిత్రత మరియు ఇస్లాం పట్ల అతని గౌరవానికి నిదర్శనం.

రిఫరెన్స్
ముంతహల్ ఆమాల్, జనాబె జైనబ్(స.అ) జీవిత చరిత్ర.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 31