హజ్రత్ ఇమామ్ హుసైన్(అ.స) యొక్క దర్శనానికి వచ్చిన మొట్ట మొదటి యాత్రికుడు మరియు జాయిర్ ఎవరు అన్న విషయం పై సంక్షిప్త వివరణ...
దైవప్రవక్త(స.అ) యొక్క 11వ ఉత్తరాధికారి హజ్రత్ ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) ఉల్లేఖనం: విశ్వాసి 5 సంకేతాలు కలిగి ఉంటాడు:
1. రోజుకు 51 రక్అతులు(వాజిబ్ మరియు ముస్తహబ్ కలిపి) చదవడం
2. అర్బయీన్ యొక్క ప్రత్యేక జియారత్ చదవడం
3. కుడి చేతిలో అఖీఖ్ ఉంగరం ధరించడం
4. నమాజ్ లో సాష్టాంగం చేసేటప్పుడు (సజ్దా)లో నొసలును మట్టి పై ఉంచడం
5. (నమాజ్ లో) “బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్” గట్టిగా చెప్పడం[1]
ఇప్పుడు వీటిని వివరంగా తెలుసుకుందాం:
51 రక్అతులు చదవడం: నవాఫిల్ నమాజులు చదవడం వల్ల మనిషికి రోజువారి వాజిబ్ నమాజులలో శ్రద్ధ పెరుగుతుంది. ఈ ముస్తహబ్ నమాజుల ద్వార మనిషికి వాజిబ్ నమాజులలో కలిగే పరధ్యానం పోతుంది. అలాగే నవాఫిల్ నమాజులలో ముఖ్యంగా నమాజె షబ్, ఉపధిని పెంచుతుంది.
నవాఫిల్ నమాజులు చదవడం వల్ల కలిగే అతి ముఖ్యమైన ప్రభావం గురించి హదీసు లో ఇలా ఉల్లేఖించబడి ఉంది.. అల్లాహ్ ఇలా అనెను: “నిస్సందేహంగా నా దాసుడు అతడిని నేను ఇష్టపడాలని నాఫెలా మరియు ముస్తహబ్ చర్యల ద్వార నా సామిప్యాన్ని కోరితే, నేను అతడిని ఇష్టపడతాను, నేను ఇష్టపడితే నేను అతడు వినే చేవులవుతాను, అతడు చూసే కనులవుతాను, అతడు మాట్లాడే నోరునౌతాను, అతడి ఆగ్రహాన్ని వ్యక్తం చేసే చేయినౌతాను”[2]
అంటే నవాఫిల్ ద్వార మనిషి అల్లాహ్ సామిప్యాన్ని పొందగలడు.
అర్బయీన్ జియారత్ చదవడం: అర్బయీన్ ప్రత్యేక జియారత్ చదివి మనిషి అహ్లెబైత్(అ.స) సామిప్యాన్ని పొందగలడు. ఈ జియారత్ లో అతి ముఖ్యామైన అంశం “విలాయత్ పట్ల విధేయత కలిగి ఉండం” పై జ్ఞాప్తిక.
ఇమామ్ హుసైన్(అ.స) కాలంలో, అజ్ఞానులు మరియు మార్గభ్రష్టులు తమ కాలపు ఇమామ్ మరియు నాయకుడిని ప్రాపంచిక అల్పమైన ఆశలకు బదులుగా అమ్ముకుని ఇహపరలోకాల కష్టాలను కొని తెచ్చుకున్నారు.
కుడి చేతిలో అఖీఖ్ ఉంగరం ధరించడం: రకారకాల అభరణాలు ఉండగా ఇమామ్ ఎందుకని అఖీఖ్ ధరించడం ఉపదేశించారు?
అఖీఖ్ ఉంగరం, అన్ని రకాల తల నొప్పులకు, కండరాల మరియు వెన్ను నొప్పికి ఉపసమనం ఇస్తుంది. అలాగే ఈ ఉంగరం ఆత్మ యొక్క ఉత్తమత్వం, సంతోషం మరియు తృప్తి కోసం అలాగే కష్టాలను, కోపాలను తొలగించడం పై అలాగే కంటి చూపుపై మంచి ప్రభావం చూపుతుంది.
నమాజ్ లో సాష్టాంగం చేసేటప్పుడు (సజ్దా) లో నొసలును మట్టి పై ఉంచడం: నొసలు మట్టిపై పెట్టడం ద్వార మనిషిలో ఉండే అహంకారం, అహంభావం అన్నీ తొలగిపోతాయి. వాటికి బదులుగా వినయవిధేయతలు వస్తాయి. అలాగే ఈ చర్య షైతాన్ కు దూరంగా మరయు అల్లాహ్ కు దగ్గర అవ్వడానికి కారణమౌతుంది.
(నమాజ్ లో) “బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్” గట్టిగా చెప్పడం: నిరాశకు గురి అయినప్పుడు “బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్” మనిషి పై చాలా మంచి ప్రభావం చూపుతుంది. దీని ఉదాహారణ; రీచార్జబుల్ బ్యాటరీ యొక్క ఎనర్జీ తగ్గితే దానిని చార్జీలో పెట్టి ఎలా దానిని చార్జీ చేస్తాము. అలాగే మనిషి నిరాశకు గురి అయినప్పుడు “బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్” చెప్పి తన బలహీనతకు గురి అయిన ఆత్మను బలపరుచుకుంటాడు.
జాబిర్ ఇబ్నె అబ్దుల్లాహె అన్సారీ, దైవప్రవక్త[స.అ] యొక్క సహచరుడు మరియు అహ్లెబైత్[అ.స] యొక్క మద్దత్తుదారుడు మరియు నమ్మకస్తుడు. తండ్రి పేరు అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ ఇబ్నె అన్సారీ. అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ అనగా జనాబె జాబిర్ యొక్క తండ్రి మక్కాలో జరిగిన “బైఅతె అఖబహ్”లో ఉన్నారు. “బద్ర్ మరియు ఒహొద్” యుద్ధాలలో వారు దైవప్రవక్త[అ.స]తో ఉన్నారు, ఒహొద్ యుద్ధంలో వీరమరణం పొందారు. మరి జనాబె జాబిర్ విషయానికి వస్తే ఇతను కూడా స్వయంగా “బైఅతె అఖబయే సానియా”లో ఉన్నారు కాని అప్పటికి వారి వయసు చాలా చిన్న వయసు, వారు తన తండ్రితో పాటు అందులో పాలుగొన్నారు. జానాబె జాబిర్ దైవప్రవక్త[స.అ] యొక్క అతి ముఖ్యమైన మద్దత్తుదారులలో ఒకరిగా లెక్కించబడేవారు. దైవప్రవక్త[స.అ] పాటు 18 యుద్ధాలలో పాలుగొన్నారు. అలాగే “సిఫ్ఫీన్” యుద్ధంలో హజ్రత్ అలీ[అ.స]తో కలిసి యుద్ధం చేశారు.
జాబిర్ ఇబ్నె అబ్దుల్లాహె అన్సారీ అర్బయీన్ రోజున ఇమామ్ హుసైన్[అ.స] యొక్క సమాధి దర్శనానికి వెళ్ళారు. వారి ఇమామ్ పై ఉన్న ఇష్టాన్ని అలా చాటుకున్నారు.
కొన్ని రివాయతుల అనుసారం, వారి జియారత్ దర్శనం మరియు కర్బలా బంధీలు షామ్ నుండి కర్బలాకు చేరుకోవడం ఒకే సారి జరిగింది. వారు తన జీవిత చివరిదశలో అంధులయ్యారు. హిజ్రీ యొక్క 74 లేదా 77 వ సంవత్సరంలో 94 సంవత్సరాల వయసులో మరణించారు.[ఆషూరా రీషెహా, అంగీజెహా, రవాదీద్ హా, పయామద్ హా, పేజీ622].
రిఫరెన్స్
1. షేఖ్ హుర్రె ఆములీ, వసాయిల్ అల్ షియా, భాగం10, పేజీ373.
2. మర్హూమ్ కులైనీ, ఉసూలె కాఫీ, భాగం2, పేజీ352.
3. సయీదె దావూదీ మరియు మహ్దీ రుస్తుం నెజాద్, (ఆయతుల్లాహ్ మకారిమ్ షీరాజీ ఆధ్వర్యంలో) ఆషూరా రీషెహా, అంగీజెహా, రవాదీద్ హా, పయామద్ హా, నాషిర్ ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స], ఖుమ్, 1388.
వ్యాఖ్యానించండి