జిల్ హిజ్ మాసం చివరి రోజు ఆమాల్

శుక్ర, 08/24/2018 - 08:40

జిల్ హిజ్ మాసం ఇస్లామీయ క్యాలండర్ ప్రకారం 11వ మాసం, అనగా చివరి మాసం. ఆ మాసం యొక్క చివరి రోజు కూడా కొన్ని ప్రత్యేక ప్రార్థనలు ఉన్నాయి.

జిల్ హిజ్ మాసం చివరి రోజు ఆమాల్

జిల్ హిజ్ మాసం ఇస్లామీయ క్యాలండర్ ప్రకారం 11వ మాసం, అనగా చివరి మాసం. ఆ మాసం యొక్క చివరి రోజు కూడా కొన్ని ప్రత్యేక ప్రార్థనలు ఉన్నాయి. ఆ రోజు రెండు రక్అత్ ల నమాజ్ ను చదవాలి. రెండు రక్అత్ లలో కూడా అల్ హంద్ సూరహ్ తరువాత ఇఖ్లాస్ సూరహ్ ను 10 సార్లూ మరియు ఆయతల్ కుర్సీని 10 సార్లు చదవాలి. నమాజ్ పూర్తైన తరువాత ఈ దుఆ ను పఠించాలి:
దుఆ: “అల్లాహుమ్మ మా అమిల్తు ఫీ హాజిహిస్సనతి మిన్ అమలిన్ నహైతనీ అన్హు వ లమ్ తర్ౙహు వ నసీతుహు వ లమ్ తన్సహు వ దఔతనీ ఇలత్తౌబతి బఅ’దజ్తిరాయి అలైక, అల్లాహుమ్మ ఫఇన్నీ అస్తగ్ఫిరుక మిన్హు ఫగ్ఫిర్లీ వ అమిల్తు మిన్ అమలిన్ యుఖర్రిబునీ ఇలైక ఫఖ్బల్హు మిన్నీ వ లా తఖ్తఅ’ రజాయీ మిన్క యా కరీమ్”
అనువాదం: “ఓ అల్లాహ్ ఈ సంవత్సరంలో, నీవు నాపై నిషేదించిన మరియు నీకు నచ్చని కార్యములను చేసి మరిచాను, (కాని) నీవు వాటిని మరవకుండా నీవు చూస్తుండగా పాపములను చేసిన తరువాత కూడా నన్ను తౌబహ్ చేసేందుకు ఆహ్వానించావు. ఓ అల్లాహ్! నేను ఆ పాపములన్నీంటికి క్షమాపణ కోరుతున్నాను (మరి) నీవు నన్ను క్షమించు. నన్ను నీకు దగ్గర చేసేటువంటి నా చర్యలను నా నుండి అంగీకరించు. నీ కారుణ్య సన్నిధి నుండి నన్ను దూరం చేయకు ఓ దయామయుడా!”[మఫాతీహుల్ జినాన్, పేజీ498].

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, మతర్జిమ్ ఇలాహీ ఖుమ్షెయి, ఇంతెషారాతె ఉస్వహ్, 1379.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18