అబద్ధం ఇస్లాం దృష్టిలో

శని, 09/10/2022 - 09:28
అబద్ధం ఇస్లాం దృష్టిలో

అబద్ధం షిర్క క్రమంలో
అబద్ధం అల్లాహ్ పట్ల షిర్క(అల్లాహ్ కు భాగస్వామ్యం) క్రమంలో లెక్కించబడుతుంది అని దైవప్రవక్త(అ.స) యొక్క ఈ హదీస్ ద్వార తెలుస్తుంది.
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: మీకు అతిపెద్ద పాపముల గురించి తెలియపరచన? అతిపెద్ద పాపం అల్లాహ్ పట్ల షిర్క, తల్లిదండ్రుల పట్ల (అగౌరవ)ప్రవర్తన మరియు అబద్ధం చెప్పటం.
అబద్ధం గురించి ఇమామ్ అలీ(అ.స) ఇలా ప్రవచించారు: “అబద్ధం చెప్పే రోగం, అతి నీఛమైన రోగం”
ఇమామ్ సాదిఖ్(అ.స) ఇలా ప్రవచించారు: అల్లాహ్ సుబ్హానవు వ తఆలా ప్రవక్తలను కేవలం సత్యం పలకడానికి మరియు పరోపకారి తనాన్ని నిర్వర్తించడానికి అది ఎదుటివాడు మంచివాడు కానివ్వండి లేదా దుర్మార్గుడు కానివ్వండి.
ఈ హదీసుల ద్వార తెలిసే విషయమేమిటంటే అబద్ధం అతిపెద్దపాపం మరియు అతి నీఛమైన చర్య. అల్లాహ్ మనల్ని ఈ చర్య నుండి కాపాడుగాక!

అబద్ధాలకోరు నుండి జాగ్రత్త...
అబద్ధాలకోరుల నుండి తీసుకోవలసిన జాగ్రత్తులను వివరిస్తున్న హజ్రత్ అలీ(అ.స)హదీసులు:
హజ్రత్ అలీ(అ.స)ఉల్లేఖనం: ముస్లిములు అబద్ధాలకోరుతో స్నేహం చేయకపోవటం మంచిది; ఎందుకంటే అబద్ధాలకోరు ఒకవేళ నిజం మాట్లాడినా ఎవరూ దానిని నమ్మరు.[1]
హజ్రత్ అలీ(అ.స)ఉల్లేఖనం: “అబద్ధాలకోరుకు సలహా లేదు(అనగా అతడి సలహా విలువలేనిది)[2]
హజ్రత్ అలీ(అ.స)ఉల్లేఖనం: అబద్ధాలకోరు మరియు మృతుడు ఇద్దరూ సమానం; ఎందుకంటే మృతుడి పై బ్రతికున్నవాడి సమర్థత ప్రజలు అతడిని నమ్మడంలో ఉంది; ఎప్పుడైతే ప్రజలు అబద్ధాలకోరు మాటలను నమ్మరో, ఇక అతడు బ్రతికుండటం కూడా మిథ్యమే[3]

అబద్ధం మరియు విశ్వాసం
అబద్ధం చెప్పేవాడు మరియు మోసం చేసేవాడు విశ్వాసి కాలేడు అని కొన్ని హదీసులు సూచిస్తున్నాయి.
దైవప్రవక్త(స.అ)ఉల్లేఖనం: విశ్వాసి పై ఎటువంటి విషయమైన ప్రభావించగలదు అబద్ధం మరియు మోసం తప్ప[4]
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స)ఉల్లేఖనం: అబద్ధం, విశ్వాసాన్ని నాశనం చేస్తుంది. మరో చోట ఇలా ఉల్లేఖించారు: నిస్సందేహంగా అబద్ధం, ఈమాన్ యొక్క నాశనానికి కారణం[5]
ఇమామ్ అలీ(అ.స)ఉల్లేఖనం: అబద్ధం ఉన్నంత వరకు విశ్వాసం యొక్క నిజమైన రుచిని ఆశ్వాదించలేడు. మరి అలాగే మరో చోట ఇలా వివరించారు: అబద్ధానికి దూరంగా ఉండండి, ఎందుకంటే అది విశ్వాసాన్ని దూరం చేస్తుంది[6]

అబద్ధాల ఫలితం
హజ్రత్ అలీ(అ.స)ఉల్లేఖనం: అబద్ధం యొక్క ఫలం, ఈహలోకంలో అవమానం మరియు పరలోకంలో శిక్ష[7]
హజ్రత్ అలీ(అ.స)ఉల్లేఖనం: అబద్ధం యొక్క ప్రతిఫలం చివరికి నింద మరియు సిగ్గు మాత్రమే[8]
హజ్రత్ అలీ(స.అ)ఉల్లేఖనం: అబద్ధాలకోరు సిగ్గులేనివాడు[9]
హజ్రత్ అలీ(అ.స)ఉల్లేఖనం: అబద్ధాలకోరు మరియు మృతుడు ఇద్దరూ సమానం....[10]

అబద్ధం అవిశ్వాసం మరియు కపటానికి కారణం
అబద్ధం అవిశ్వాసం మరియు కపటానికి కారణమౌతుంది, ఎందుకంటే అబద్ధం చెప్పేవాడి ఈమాన్ నాశనమౌతుంది, ఈమాన్ పోతే మెల్ల మెల్లగా అవిశ్వాసం లేదా కపటం చోటు చేసుకుంటుంది. దీని గురించి హదీసులు ఇలా సూచిస్తున్నాయి;
ఒకరోజు ఒక వ్యక్తి దైవప్రవక్త(స.అ)వద్దకు వచ్చి ఇలా అన్నాడు: “ఓ దైవప్రవక్త[స.అ]! నరకవాసులు చేసిందేమిటి?
దైవప్రవక్త[స.అ]: అబద్ధం. ఎప్పుడైతే అబద్ధం చెబుతారో, దాంతో నీఛులవుతారు, నీఛులయిన తరువాత అవిశ్వాసులవుతారు, అవిశ్వాసులయిన తరువాత నరకానికి అర్హులవుతారు.[11]
ఈ విధంగా అబద్ధం మనిషి హృదయం నుండి ఈమాన్ ను దూరం చేయటమే కాకుండా, అవిశ్వాసపు చర్యలకు కూడా దారి తీస్తుంది అని తెలుస్తుంది.

అల్లాహ్ మరియు దూతల శాపం
అబద్ధం చెప్పటం ఎంత అయిష్టమైన చర్య అంటే అబద్ధం చెప్పేవారు అల్లాహ్ మరియు ఆయన దూతల శాపానికి గురి అవుతారు. అల్లాహ్ మరియు దూతల లఅనత్ కు అర్హుడవుతాడు.
దైవప్రవక్త(స.అ)ఇలా ప్రవచించెను: “అల్లాహ్ అబద్ధాలకోరును శపిస్తాడు; అతడు పరిహాసానికి అబద్ధం చెప్పినా సరే[12]
మరోచోట ఇలా ఉపదేశించారు: ఎప్పుడైతే ఒక విశ్వాసి, కారణం లేకుండా అబద్ధం చెబుతాడో, డబ్భైవేల దూతలు అతడిని శపిస్తారు మరియు అతడి హృదయం నుండి చెడువాసన బయటకు వస్తుంది, దాని వాసన ఆకాశానికి చేరుతుంది., అప్పుడు హామిలానె అర్షె ఇలాహి(ఆకాశాన్ని ఎత్తుకొని ఉన్న దూతలు) కూడా అతడిని శపిస్తారు.[13]

అబద్ధం ప్రవక్తల దృష్టిలో
ప్రవక్త ఈసా(అ.స)ఇలా ఉపదేశించెను: ఎవరి మాటలలో మిథ్యం మితిమీరుతుందో అతడి అందం, శౌరత్యం అల్లాహ్ మరియు సృష్టితాల దృష్టిలో పోతుంది. ప్రజలు అతడిని అసహ్యించుకుంటారు.
దైవప్రవక్త(స.అ)ఉల్లేఖనం: అబద్ధం, అతినీఛమైన మరియు మిక్కిలి పెద్ద లంచం
దైవప్రవక్త(స.అ)ఉల్లేఖనం: నిస్సందేహంగా అబద్ధం దుర్మార్గానికి చెందినది, మరియు అలాగే ఈ రెండూ(అబద్ధం మరియు దుర్మార్గం) నరకంలో స్థానం కలిగి ఉన్నాయి.
దైవప్రవక్త(స.అ)ఉల్లేఖనం: నిజంలో శాంతి ఉంది కాని అబద్ధంలో భయం ఉంది[14]

అబద్ధం దరిద్రానికి కారుణం
ఎప్పుడైతే ఒక మనిషికి అబద్ధం చెప్పటం అలవాటుగా మారుతుందో, పేదరికం మరియు దరిద్రం అతడి వెంటాడి వేటాడతాయి. అతడి జీవితం నుంచి మగళం పోతుంది. 
ఇమామ్ అలీ(అ.స)దరిద్రానికి కారణలు వివరిస్తు ఇలా అన్నారు.. అబద్ధం చెప్పే అలవాటు, దరిద్రాన్ని తీసుకొస్తుంది.[15]
దైవప్రవక్త(స.అ)ఉల్లేఖనం: అబద్ధం మనిషి యొక్క భాగ్యాన్ని తక్కువ చేస్తుంది.
బహుశ అబద్ధం చెప్పటం వల్ల సహాయం చేసేవాడు కూడా సహాయం చేయకపోడానికి ఒక కారణం అయి ఉండోచ్చు.

రిఫరెన్స్

1. మర్హూమ్ కులైనీ, కాఫీ, భాగం2, పేజీ341, హదీస్13.
2. మొహద్దిసె నూరీ, ముస్తద్రికుల్ వసాయిల్, భాగం9, పేజీ88, హదీస్10300
3. ఆముదీ, గురరుల్ హికమ్, పేజీ221, హదీస్4386
4. బిహారుల్ అన్వార్, భాగం74, పేజీ160, హదీస్150
5. కాఫీ, భాగం2, పేజీ339, హదీస్4
6. హుర్రె ఆములి, వసాయిల్ అల్ షియా, భాగం12, పేజీ246, పేజీ16216
7. ఆముదీ, గురరుల్ హికమ్, పేజీ220, హదీస్4400.
8. ఆముదీ, గురరుల్ హికమ్, పేజీ221, హదీస్4413.
9. ఆముదీ, గురరుల్ హికమ్, పేజీ221, హదీస్4416
10. ఆముదీ, గురరుల్ హికమ్, పేజీ221, హదీస్4386.
11. మొహద్దిసె నూరీ, ముస్తద్రికుల్ వసాయిల్, భాగం9, పేజీ89
12. ముస్తద్రికుల్ వసాయిల్, భాగం9, పేజీ88, హదీస్10300.
13. ముస్తద్రికుల్ వసాయిల్, భాగం9, పేజీ86, హదీస్10291.
14. మొహద్దిసె నూరీ, ముస్తద్రికుల్ వసాయిల్, భాగం9, పేజీ88, హదీస్10302
15. హుర్రె ఆములీ, వసాయిల్ అల్ షియా, భాగం15, పేజీ347, హదీస్20704.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14