వివిధ అంశాలను సూచిస్తున్న మాసూమీన్(అ.స) యొక్క హదీసుల తెలుగనువాదం.
వివిధ అంశాలను సూచిస్తున్న మాసూమీన్(అ.స) యొక్క హదీసుల తెలుగనువాదం.
హజ్రత్ ఇమామ్ అలీ రిజా(అ.స) ఉల్లేఖనం: “ఎప్పుడైతే దాసులు ఇంతకు ముందు చేయని పాపాలకు పాల్పడతారో అల్లాహ్ వారి కొరకు వారు ఇంతకు ముందు ఎరగని కష్టాన్ని సృష్టిస్తాడు”[1]
ఇమామ్ అలీ(అ.స) ఉల్లేఖనం: “కళ్ళు కప్పి పాపములు చేయడం మానకోండి ఎందుకంటే మన సాక్షి, మన న్యాయమూర్తి ఒక్కడే”[2]
ఇమామ్ అలీ రిజా(అ.స) ఉల్లేఖనం: “అల్లాహ్ నుండి సహాయం కోరి ప్రయత్నించనివాడు తనను తాను హేళన చేసుకున్నట్లే”[3]
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: “ఆరోగ్యంగా ఉండటానికి చేసే ఖర్చు దుబారా ఖర్చు కాదు డబ్బును పోగొట్టుకునే మరియు శరీరాన్ని నష్టం కలిగించే వాటి కోసం ఖర్చు పెట్టడం దుబారా ఖర్చు అవుతుంది”[4]
ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స) ఉల్లేఖనం: “ఎవరైతే చేసే పని యొక్క జ్ఞానం లేకుండా ఆ పనిని చేస్తే దానిని సరిగా చేయటం కన్నా నాశనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి”[5]
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) హజ్రత్ లుఖ్మాన్ తన కుమారునితో ఇలా అన్నారు: కుమారా! రోజులో కొంత భాగం, చదువు కోసం నిశ్చయించు; ఎందుకంటే దానిని వదిలేస్తే కలిగే నష్టం వేరేవాటిని వదిలేస్తే వచ్చే నష్టానికి మించినది.[6]
ఇమామ్ అలీ(అ.స) ఉల్లేఖనం: ప్రతీ పాత్ర, దానిలో ఏదైనా వేస్తే నిండి పోతుంది ఒక్క జ్ఞానం యొక్క పాత్ర తప్ప. దానిని ఎంత నింపితే అంత విశాలమౌతుంది.[7]
ఇమామ్ అలీ(అ.స) ఉల్లేఖనం: ఎవరైతె నిజాన్ని నిజాయితీని తన పద్దతిగా చేసుకుంటాడో జీవిత భారం అతడి కోసం తేలిక అవుతుంది[8]
రిఫరెన్స్
1. అల్ కాఫీ, భాగం2, పేజీ275.
2. గురరుల్ హికమ్, హదీస్2524.
3. బిహారుల్ అన్వార్, భాగం78, పేజీ356.
4. మీజానుల్ హిక్మహ్, భాగం5, పేజీ287.
5. బిహారుల్ అన్వార్, భాగం78, పేజీ346.
6. బిహారుల్ అన్వార్, భాగం13, పేజీ415, హదీస్7.
7. నెహ్జుల్ బలాగహ్, హిక్మత్205.
8. తొహ్ఫుల్ ఉఖూల్, పేజీ91.
వ్యాఖ్యానించండి