మేరాజ్ హదీస్

శుక్ర, 10/21/2022 - 14:16

అహ్లె సున్నత్ గ్రంథంలో ఉల్లేఖించబడిన మేరాజ్ హదీస్ సరైనది కాదు అని అహ్లె సున్నద్ గ్రంథాల నుండి నిదర్శనలు... 
 

మేరాజ్ హదీస్

మేరాజ్ హదీస్ పరిశోధన
హదీస్ అరబీలో
عن أبي الدرداء عن النبي صلي الله عليه وسلم قال : «رأيت ليلة أسري بي في العرش فرندة خضراء فيها مكتوب بنور أبيض : لا إله إلا الله محمد رسول الله أبو بكر الصديق عمر الفاروق»

పై హదీస్ అనువాదం: అబీ దర్దా దైవప్రవక్త(స.అ) నుండి ఉల్లేఖించారు, వారు(స.అ) ఇలా ఉల్లేఖించారు: మేరాజ్ రాత్రి నేను అల్లాహ్ నింగి పై ఒక పచ్చరంగు పలక(బోర్డు) పై తెల్లటి కాంతితో ఇలా వ్రాసి ఉండడాన్ని చూశారు: “లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదున్ రసూలుల్లాహ్ అబూబక్ర్ సిద్దీఖ్ ఉమర్ ఫారూఖ్”[1]
ఈ హదీస్ తప్పుడు హదీస్ అని అహ్లె సున్నత్ కు చెందిన చాలా మంది ముహద్దిసీనులు అంగీకరించి ఈ హదీస్ తప్పుడు హదీస్ అని సాక్ష్యాలను ప్రదర్శించారు. సాక్ష్యాలు;
మొదటి సాక్ష్యం:
A) అహ్లె సున్నత్ యొక్క ప్రముఖ ఆలిమ్ “ఇబ్నె జౌజీ” తన గ్రంథం “అల్ మౌజూఆత్” భాగం1, పేజీ327 లో ఈ హదీసును ఉల్లేఖించి ఇలా రచించెను: هذا حدیث لا یصح عن رسول الله(صلى الله علیه وسلم). و أبو بکر الصوفى ومحمد بن مجیب کذابان، قاله یحیى بن معین

ఈ హదీస్ సరైనది కాదు ఎందుకంటే ఈ రివాయత్(రావీయుల క్రమం)లో “ఉమర్ ఇబ్నె ఇస్మాయీల్” ఉన్నాడు. అతడి గురించి రిజాల్ జ్ఞానప్రవీణులైన యహ్యా ఇబ్నె మొయీన్ ఉమర్ ఇబ్నె ఇస్మాయీల్ గురించి ఇలా అన్నారు: “అతడి మాటలు నమ్మ దగినవి కావు, అతడు అబద్దాల కోరు, చెడు స్వభావి, చెడ్డవాడు.. అంతే కాకుండా నిసాయీ(సహీ నిసాయి గ్రంథ రచయిత) మరియు దారుఖుత్నీలు కూడా ..అతడి హదీస్ నమ్మదగినది కాదు దానిని వదిలేయాలి” అని అన్నారు.[2]
B) ఈ హదీస్(రావీయుల క్రమం)లో అలీ ఇబ్నె జమీల్ అనే రావీ ఉన్నాడు. ఇబ్నె జౌజీ ఈ హదీస్ ను రద్దు చేస్తూ ఇలా అన్నారు: «هذا باطل موضوع» ఈ హదీస్ మిథ్యమైనది మరియు నకిలీ(తయారు చేయబడ్డ) హదీస్, ఎందుకంటే ఈ హదీస్(రావీయుల క్రమం)లో అలీ ఇబ్నె జమీల్ అనే రావీ ఉన్నాడు. ఇతడు నకిలీ హదీసులను తయారు చేసేవాడు.[3]
C) ఈ హదీసు (రావీయుల క్రమం)లో “అబూబక్ర్ అల్ సూఫీ” మరియు “మొహమ్మద్ ఇబ్నె ముజీబ్”లు ఉన్నారు వారిద్దరూ అబద్దాలకోరులు అందుకు ఈ హదీస్ సరైనది కాదు. ఇదే విషయాన్ని యహ్యా ఇబ్నె ముయీన్ కూడా అన్నారు.[4]

రెండవ సాక్ష్యం:
అహ్లె సున్నత్ ప్రముఖ ముహద్దిస్ అయిన “హైసమీ” పైన సూచించ బడిన రివాయత్ ను ఉల్లేఖించిన తరువాత ఇలా రచించారు: رواه الطبرانی و فیه على بن جمیل الرقى و هو ضعیف “ఈ రివాయత్ ను ఇబ్నె తబరీ ఉల్లేఖించి ఈ రివాయత్ లో అలీ ఇబ్నె జమీల్ రిఖ్ఖీ ఉన్నాడు అతడు జయీఫ్ రావీ” అని అన్నారు.[5]

మూడవ సాక్ష్యం:
అహ్లె సున్నత్ ప్రముఖ ముహద్దిస్ “ముత్తఖీయె హిందీ” కూడా ఈ రివాయత్ ఉల్లేఖించిన తరువాత ఇలా అన్నారు: وفیه محمد بن عامر کذّاب “ఆ రివాయత్ యొక్క సనద్ లో మొహమ్మద్ ఇబ్నె ఆమిర్ ఉన్నాడు, ఈ వ్యక్తి అబద్ధాలకోరు”[6]

నాలుగోవ సాక్ష్యం:
అహ్లె సున్నత్ ప్రముఖ ఆలిమ్ అయిన “ఇబ్నె హబ్బాన్” హజ్రత్ అబూబక్ర్(ర.అ) ను సిద్దీఖ్ మరియు హజ్రత్ ఉమర్(ర.అ) ను ఫారూఖ్ అని ఉల్లేఖించబడిన రివాయతులను ప్రదర్శించిన తరువాత ఇలా రచించారు: «وهذان خبران باطلان موضوعان لا شکّ فیه، وله مثل هذا، أشیاء کثیرة یطول الکتاب بذکرها “ఈ రెండు రివాయతులు మిథ్యమైనవి(అబద్ధమైనవి) మరియు నకిలీ హదీసులు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇలాంటి (హజ్రత్ అబూబక్ర్ మరియు హజ్రత్ ఉమర్ ల గురించి) నకిలీ హదీసులు చాలా ఉన్నాయి, ఇక్కడ సంక్షిప్తాన్ని దృష్టిలో ఉంచి వాటిని చెప్పటం లేదు”[7]

ఐదవ సాక్ష్యం:
ఇబ్నె హజర్ అస్ఖలానీ మరియు జహబీ లు కూడా – హజ్రత్ అబూబక్ర్(ర.అ) ను సిద్దీఖ్ మరియు హజ్రత్ ఉమర్(ర.అ) ను ఫారూఖ్ అని ఉల్లేఖించబడిన రివాయతులను- ఉల్లేఖించి ఇలా అన్నారు: “ఈ రివాయత్ తప్పుడు రివాయత్”.[8]

నోట్: అహ్లె సున్నత్ ప్రముఖ ఆలిమ్ అయిన “జలాలుద్దీన్ సీవ్తీ”[9]లో హజ్రత్ అలీ(ర.అ)ను సుద్దీఖ్ అని మరియు సహాయె సిత్తాలో ఒక గ్రంథం అయిన “ఇబ్నె మాజా”, అల్ ముస్తద్రక్, తారీఖె తబరీ, అల్ కామిల్ ఇబ్నె అసీర్, ఫరాయిద్ అల్ సింతైన్, తజ్కిరతుల్ ఖవాస్ గ్రంథాలలో హజ్రత్ అలీ(ర.అ) ను సిద్దీఖ్ మరియు ఫారూఖ్ అని అన్నారు.[10]

ఇబ్నె కసీర్ దమిష్ఖీ వచనానుసారం;  అహ్లె కితాబ్(యూధులు మరియు క్రైస్తవులు) మరియు మతోన్మాధులైన సున్నీయులు ఈ బిరుదులను హజ్రత్ అబూబక్ర్(ర.అ) మరియు హజ్రత్ ఉమర్(ర.అ)కు అంటకట్టారు మరియు వారిని సంభోదించారు.[11]                

పరిశోధన ఫలితం:
అహ్లె సున్నత్ గ్రంథాలలో ఉన్న చాలా హదీసుల మరియు ఉల్లేఖనల ప్రకారం సిద్దీఖ్ మరియ ఫారూఖ్ ఈ రెండు బిరుదులు కేవలం హజ్రత్ అలీ(ర.అ)కు ప్రత్యేకించబడినవి.

రిఫరెన్స్
1. ఇబ్నె జౌజీ, అల్ మౌజూఆత్, భాగం1, పేజీ327.
2. ఇబ్నె జౌజీ, అల్ మౌజూఆత్, భాగం1, పేజీ327.
3. అల్ మౌజూఆత్, ఇబ్నె జౌజీ, భాగం1, పేజీ336.
4. అల్ మౌజూఆత్, ఇబ్నె జౌజీ, భాగం1, పేజీ337.
5. ముజ్మూఅల్ జవాయిద్, హైసమీ, భాగం9, పేజీ58.
6. కన్జుల్ ఉమ్మాల్, ముత్తఖీయె హిందీ, భాగం13, పేజీ236.
7. కితాబుల్ మజ్రూహీన్, భాగం2, పేజీ116.
8. మీజానుల్ ఏతెదాల్, జహబీ, భాగం1, పేజీ540; లిసానుల్ మీజాన్, ఇబ్నె హజర్, భాగం2, పేజీ295
9. అల్ జామిఅ అల్ సగీర్, భాగం2, పేజీ115.
10. సుననే ఇబ్నె మాజా, భాగం1, పేజీ44.
11. అల్ బిదాయహ్ వన్నిహాయహ్, ఇబ్నె కసీర్, భాగం7, పేజీ150.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8