.అల్లాహ్ హజ్రత్ ముహమ్మద్[స.అ]ను నింగి పై ఆహ్వానించిన విషయం సంక్షిప్తంగా.

అల్లాహ్ హజ్రత్ ముహమ్మద్[స.అ]ను మేరాజ్‌పై ఆహ్వానించెను, మేరాజ్ గురించి సూరయె బనీఇస్రాయీల్ మొదటి ఆయత్‌లో అల్లాహ్ ఇలా అనెను: سُبۡحَٰنَ ٱلَّذِيٓ أَسۡرَىٰ بِعَبۡدِهِۦ لَيۡلٗا مِّنَ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِ إِلَى ٱلۡمَسۡجِدِ ٱلۡأَقۡصَا ٱلَّذِي بَٰرَكۡنَا حَوۡلَهُۥ لِنُرِيَهُۥ مِنۡ ءَايَٰتِنَآۚ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلۡبَصِيرُ
అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్[స.అ]ను ఒకరోజు రాత్రి మక్కా నుండి మస్‌జిదే అఖ్‌సా మరియు అక్కడ నుండి నింగి వరకు, సిద్రతుల్ ముంతహా(దేవ దూత సహితం చేరలేని ప్రదేశం) మరియు అర్‌షె ఆలా మీద విహారింప జేసెను. ప్రవక్త ముహమ్మద్[స.అ]కు అక్కడ వున్న అన్ని విచిత్రాలు తెలుయపరిచెను. అంతే కాకుండా వారి తరువాత వారి యొక్క ఖలీఫాల గురించి కూడా తెలియపరిచెను.
హజ్రత్ ఇమామ్ జాఫరే సాదిఖ్[అ.స] దైవప్రవక్త[స.అ] మేరాజ్ గురించి ఇలా అనెను: “అల్లా ప్రవక్త ముహమ్మద్[స.అ]కు 120 సార్లు మేరాజ్ పై ఆహ్వాన పరిచెను”. ఆహ్వాన పరిచిన ప్రతీ సారి హజ్రత్ అలీ[అ.స] మరియు అతని కుమారుల ఖిలాఫత్ గురించి తాకీదు చేసెను. [ముంతహల్ ఆమాల్, దైవప్రవక్[అ.స] తకు సంబంధించిన అధ్యాయంలో]
రిఫ్రెన్స్
షేక్ అబ్బాస్ ఖుమ్మి, ముంతహల్ ఆమాల్, దైవప్రవక్[అ.స]తకు సంబంధించిన అధ్యాయంలో
వ్యాఖ్యలు
Mashaallah....good info
salaam, jazakallah. shukriya.
వ్యాఖ్యానించండి