హజ్రత్ మాసూమహ్(స.అ)

సోమ, 11/07/2022 - 17:17

హజ్రత్ ఇమామ్ అలీ రిజా(అ.స) యొక్క సోదరి అయిన హజ్రత్ మాసూమహ్(స.అ) గురించి సంక్షిప్త వివరణ...

హజ్రత్ మాసూమహ్(స.అ)

పేరు: ఫాతెమా కుబ్రా
పవిత్ర బిరుదు: మఅసూమహ్[స.అ]
తండ్రి: హజ్రత్ మూస ఇబ్నె జాఫర్[అ.స]
తల్లి: హజ్రత్ నజ్మా ఖాతూన్
జన్మదినం: జీఖఅదహ్ మొదటి తేదీ, హిజ్రీ యొక్క 173వ సంవత్సరం
జన్మస్థలం: మదీనహ్ మునవ్వరహ్
ఖుమ్ ప్రవేశం: రబీవుల్ అవ్వల్ 23వ లేదీ, హిజ్రీ యొక్క 201వ సంవత్సరం
ప్రయాళం యొక్క లక్ష్యం: ఖురాసాన్ పట్టణంలో ఉన్న సోదరుడు ఇమామ్ రిజా[అ.స]తో కలుసుకోవడం
మరణం: రబీవుల్ అవ్వల్ 10వ తేదీ, హిజ్రీ యొక్క 201వ సంవత్సరంలో(సరైన ఉల్లేఖనం ప్రకారం)
వయసు: 28 సంవత్సరాలు
ఖుమ్ లో వారి ప్రార్థనాస్థలం: బైతున్ నూర్
వారి సమాధి దర్శనం యొక్క పుణ్యం: స్వర్గం[1]

హజ్రత్ మాసూమహ్(అ.స) ఇమామ్ సాదిఖ్(అ.స) మాటల్లో

ఇరాన్ లో ఉన్న రయ్ పట్టణానికి చెందిన కొందరు ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) వద్దకు వచ్చారు. ఇమామ్ వారిని ఉద్దేశించి ఇలా అన్నారు: శెభాష్! ఖుమ్ వాసులైన మా సోదరులారా. వారు ఇలా అన్నారు: “మేము రయ్ పట్టణానికి చెందిన వారు”(ఖుమ్ వాసులం కాదు). ఇమామ్ మరలా అదే విధంగా వారిని పలకరించారు, వారు చాలా సార్లు “మేము ఖుమ్ వాసులం కాము” అని అన్నారు. ఇమామ్ కూడా ఎన్నో సార్లు “ఖుమ్ వాసులైన మా సోదరులారా రండీ!” అని ఆహ్వానించారు. ఆ తరువాత ఇలా అన్నారు: “అల్లాహ్ కు హరమ్ ఉంది, అది మక్కా. దైవప్రవక్త(స.అ) కూ ఒక హరమ్ ఉంది, అది మదీనా. అమీరుల్ మొమినీన్(అ.స) కు మరో హరమ్ ఉంది, అది కూఫా. మా అహ్లెబైత్(అ.స) కు హరమ్ ఉంది, అది ఖుమ్ పట్టణం, త్వరలోనే నా సంతానం నుండి ఒక పుణ్యస్త్రీ ఆ భూమి పై సమాధి చేయబడుతుంది ఆమె పేరు ఫాతెమా. అయితే ఎవరైతే వారి దర్శనానికి వెళతారో వారికి స్వర్గం తప్పకుండా చెందుతొంది.
రావీ ఇలా అనెను: ఈ మాటలు ఇమామ్ జాఫరె సాదిఖ్ హజ్రత్ ఫాతెమా మాసూమహ్(అ.స) జన్మించక ముందు చెప్పినవి.[2]

హజ్రత్ మాసూమా(అ.స) దర్శన పుణ్యం

దైవప్రవక్త(స.అ) యొక్క 7వ ఉత్తరాధికారి అయిన ఇమామ్ మూసా కాజిమ్(అ.స) యొక్క కుమార్తే మరియు 8వ ఉత్తరాధికారి అయిన ఇమామ్ రిజా(అ.స) యొక్క సొదరి అయిన హజ్రత్ మాసుమా(అ.స) సమాధి దర్శనం యొక్క ప్రతిష్టత మరియు ప్రాముఖ్యత గురించి పవిత్ర మాసుములు పలు రివాయత్ లు ఉల్లేఖించారు.
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ప్రవచించారు.. అల్లాహ్ కు ఒక హరం ఉంది, అది మక్కా. దైవప్రవక్త[స.అ]కు ఒక హరం ఉంది అది మదీనహ్. మరి మా అహ్లె బైత్(అ.స) కు హరం ఉంది, అది ఖుమ్.[3]. మరో రివాయత్ లో ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ప్రవచించారు: “సంతానం నుండి మూసా ఇబ్నె జాఫర్ కుమార్తె ఖుమ్(పట్టణం)లో మరణిస్తుంది, ఆమె షిఫాఅత్ దయ తోనే మా షియాలందరూ స్వర్గానికి వెళతారు” ఇంకో రివాయత్ ప్రకారం ఆమె జియారత్ దర్శనం యొక్క పుణ్యఫలం స్వర్గం[4] ఇమామ్ అలీ రిజా(అ.స) ఉల్లేఖనం ప్రకారం: “మాసూమహ్ ను దర్శించుకున్న వారు నన్ను దర్శించుకున్నట్లే” ఇంకో రివాయత్ ప్రకారం “స్వర్గం అతనిదౌతుంది”. ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స) ఇలా ప్రవచించారు: “ఖుమ్ లో పూర్తి శ్రద్ధతో మరియు ఆమె గురించి తెలుసుకొని ఎరుకతో నా మేనత్త(సమాధి)ని దర్శించుకుంటే వారు స్వర్గార్హులౌతారు”.[5].

హజ్రత్ మాసూమా(అ.స) షిఫాఅత్

హజ్రత్ మాసూమహ్(అ.స) వారి తండ్రి మరణాంతరం హిజ్రీ యొక్క 179వ సంవత్సరంలో వారి అన్నయ్య హజ్రత్ ఇమామ్ రిజా(అ.స) వారి పోషణాబాధ్యతలు తీసుకున్నారు. హిజ్రీ యొక్క 200వ సంవత్సరం వరకు అనగా 21 సంవత్సరాలు వారి అన్నయ్య యొక్క ప్రత్యేక అధ్యాత్మిక జ్ఞాన, సుగుణ సన్నిధిలో గడిపారు.
ఆమె షిఫాఅత్ గురించి ఇమామ్ జాఫర్ సాదిఖ్(అ.స) ఉల్లేఖించిన ఈ హదీస్ చాలు: “గుర్తుంచుకోండి, స్వర్గానికి 8 ద్వారాలు ఉన్నాయి వాటి నుండి 3 ద్వారాలు ఖుమ్ వైపుకు ఉన్నాయి. నా సంతానం నుండి ఒక (గొప్ప) స్త్రీ అక్కడ మరణిస్తుంది, ఆమె పేరు ఫాతెమహ్ బింతె మూసా. మా షియాలందరూ ఆమె షిఫాఅత్ ద్వార స్వర్గంలో ప్రవేసిస్తారు”[6].
ఇమామ్ అలీ రిజా[అ.స] ద్వార ఉల్లేఖించబడ్డ ఆమె యొక్క జియారత్ పత్రంలో ఇలా ఉంది: “ఓ ఫాతెమహ్ నన్ను స్వర్గంలో షిఫాఅత్ చేయి, ఎందుకంటే అల్లాహ్ దగ్గర మీ స్థానం చాల గొప్పస్థానం”[7].

రిఫ్రెన్స్
1. సయ్యద్ తఖీ తబాతబాయి ఖుమ్మీ, మఅసూమయె ఖుమ్, పేజీ48, 1365ష.

2. నూరీ, హుసైన్, ముస్తద్రికుల్ వసాయిల్, భాగం10, పేజీ368.
3. ఇబ్నె ఖూలవై ఎ ఖుమ్మీ, కామిలుజ్జియారాత్, పేజీ 536.
4. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం102, పేజీ219, దారు ఇహ్యాయి అల్ తురాస్ అల్ అరబీ, బీరూత్, 1403.
5. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం102, పేజీ266, దారు ఇహ్యాయి అల్ తురాస్ అల్ అరబీ, బీరూత్, 1403.  
6. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం57, పేజీ288, దారు ఇహ్యాయి అల్ తురాస్ అల్ అరబీ, బీరూత్, 1403.
7. షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, బాబె జియారాత్.     

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 14 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15