గృహనిర్మాణంలో ఖిబ్లా ప్రాముఖ్యత-2

మంగళ, 12/06/2022 - 17:27

గృహనిర్మాణంలో ఖిబ్లా ప్రాముఖ్యత గురించి వివరిస్తున్న మరి కొన్ని కొన్ని హదీసులు...

గృహనిర్మాణంలో ఖిబ్లా ప్రాముఖ్యత-2

2. ఖిబ్లాకు అభిముఖంగా షింక్ ఉండడం

ఉజూ, నమాజ్ కు ముందు వాజిబ్ మరియు ఇతర సమయంలో ముస్తహబ్ గా ఇస్లాం చెబుతుంది. ఉజూ చేయడం విశ్వాస యొక్క భాగం మరియు అల్లాహ్ యొక్క హద్దుల నుండి ఒక హద్దు అని రివాయతులు వివరిస్తున్నాయి:

దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “పళ్లు తోముకోవడం ఉజూ యొక్క సగభాగం, ఉజూ విశ్వాసానికి సగభాగం”[1]

కొన్ని రివాయతుల ప్రకారం ఖిబ్లాకు అభిముఖంగా చేయడం మంచిది ముఖ్యంగా ఉజూ చేయడం అని ఉంది. దైవప్రవక్త(స.అ) ఇలా ఉపదేశించారు: “మనిషి యొక్క అత్యుత్తమ స్థతి ఖిబ్లాకు అభిముఖంగా ఉండడం”[2]

ఫిఖా పరంగా కూడా ఉజూ సమయంలో ఖిబ్లా అభిముఖంగా ఉండడం ముస్తహబ్ గా ఆదేశించబడి ఉంది. అందుకని ఇంటి డిజైన్ లో ఉజూ చేసే టప్పుడు ముఖం ఖిబ్లా దిశకు ఉన్నట్లు షింక్ అమర్చుకోవాలి.

3. తల్లిదండ్రుల మంచం ఖిబ్లా వైపు ఉండడం
తల్లిదండ్రులు కుటుంబానికి రెండు మూల స్థంభాలు. పిల్లల భవిష్యత్తు వారి శిక్షణను బట్టి ఉంటుంది. స్వయంగా వారు కూడా ఆథ్యాత్మిక పరంగా ఉండడం అవసరం. దాని ప్రభావం కూడా పిల్లల పై పడతుంది.

హదీసులనుసారం సహజీవనం, వారి మధ్య పరస్పర ప్రేమ కూడా ఆరాధనగా పరిగణించబడినది. దైవప్రవక్త(స.అ) ఇలా ఉపదేశించెను: “ఒక విశ్వాసి తన జీవిత భాగస్వామి చేయిని తన చేయి తీసుకున్నప్పుడు అల్లాహ్ వారి కోసం పది పుణ్యములను వ్రాస్తాడు మరియు పది పాపములను క్షమిస్తాడు. తన జీవిత భాగస్వామిని ముద్దు పెట్టుకున్నప్పుడు అల్లాహ్ వారి కోసం వంద పుణ్యములను వ్రాస్తాడు మరియు వంద పాపములను క్షమిస్తాడు. సంభోగించినప్పుడు అల్లాహ్ వారి కోసం వెయ్యి పుణ్యములను వ్రాస్తాడు మరియు వెయ్యి పాపములను క్షమిస్తాడు మరియు దైవదూతలు హాజరవుతాయి. వారిద్దరు గుస్ల్ స్నానం చేసినప్పుడు నీళ్లు తాకిన వారి శరీర వెంట్రుకలకు సమానంగా వారి ప్రభువు వారికి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు మరియు పాపములను క్షమిస్తాడు.[3]

సంభోగం సమయం లో పాటించ వలసిన అంశాలలో ఒకటి; వాళ్ల తల లేదా కాళ్లు ఖిబ్లా దిశ వైపు ఉండకూడదు. రివాయతులలో దీనిని నిషేదించడం జరిగింది. ఇమామ్ రిజా(అ.స) ఇలా ఉపదేశించారు: “మీ జీవిత భాగ స్వామితో ఖిబ్లాకు ఎదురుగా గాని వెనక స్థితిలో గాని సంభోగంలో పాలుకోకండి”[4]

అందుకని భార్య భర్తల లేద తల్లిదండ్రుల పడక గదిలో ఉన్న మంచం లేదా సంభోగానికి ఉపయోగపడే మంచం ఖిబ్లా దిశకు ఉండకుండా చూసుకోవడం అవసరం.

4. నిప్పుకు సంబంధిత వస్తువులు ఖిబ్లా దిశకు ఉండకూడదు
ప్రపంచ సృష్టిని ఉనికి ప్రసాదించే నాలుగు మూల అంశాలలో ఒకటి నిప్పు అని పూర్వ విజ్ఞానులలో చాలా మంది నమ్మేవారు[5] అజ్ఞానం కారణంగా కొంత మంది నిప్పును భగవంతుడిగా నిశ్చయించి దాన్ని పూజిస్తూ ఉంటారు, ఇప్పటి కూడా ఈ అజ్ఞానపు చర్యలు కనిపిస్తూ ఉంటాయి.

ఇస్లాం ఆదేశాలనుసారం విశ్వాసులు అవిశ్వాసుల మాధిరి చర్యలు చేయకూడదు, ఇస్లాం దీనిని ఖండిస్తుంది. ఖుర్ఆన్ ఇలా ఉపదేశిస్తుంది: “చూడండి! ఎట్టి పరిస్థితిలోనూ దుర్మార్గుల పక్షాన మొగ్గకండి. మొగ్గారో మీక్కూడా నిప్పు (నరకాగ్ని) అంటుకుంటుంది. మరి అల్లాహ్ తప్ప మిమ్మల్ని ఆదుకునే వాడెవడూ ఉండడు. మీకు సహాయమూ అందదు.[సూరయె హూద్ ఆయత్113] నిప్పు వైపు నమాజ్ చదవడం చూడడానికి అవిశ్వాసుల చర్యగా కనిపిస్తుంది. అయితే ఆ నమాజ్ చదివేవాడి ఉద్దేశం అది కాకపోవచ్చు కాని ఈ చర్య మక్రూహ్ అని సూచించెను. అలీ ఇబ్నె జాఫర్ ఉల్లేఖనం ప్రకారం, నా సోదరుడు ఇమామ్ కాజిమ్(అ.స) ను ప్రశ్నించాను: “ఒక వ్యక్తి నమాజ్ చదువుతున్నాడు, అతడి ముందు ఖిబ్లా దిశకు దీపం వెలుగూ ఉంది? ఇమామ్ ఇలా సమాధానిమిచ్చారు: నిప్పు వైపు నమాజ్ చదవడం సరైన విషయం కాదు.”[6] నిప్పు వున్న చోట నమాజ్ చదవ కూడదు ఉదాహారణకు వంటగది ఎందుకంటే ఈ పని అవిశ్వాసుల పనికి పోలిన పని మరి ఇలాంటి చర్యలను ఇస్లాం ఖండిస్తుంది.[7]

గృహ నిర్మాణం సమయంలో నిప్పుకు సంబంధించిన వస్తువులు ఖిబ్లా వైపుకు లేకుండా చూసుకోవడం మంచిది. అనుకోకుండా లేదా మరిచి పోయి కూడ మనం ఒక అమలు చేసినప్పుడు ఆ అమలుకు మన ఇంటి నిర్మాణం మక్రూహ్ లేదా హరామ్ కు దారి తీయకుండా చూసుకోవడం వివేకం.

రిఫరెన్స్
1. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, భాగం73, పేజీ140.
2. హుర్రె ఆములీ, మొహమ్మద్ ఇబ్నె హసన్, వసాయిల్ అల్ షియా, భాగం12, పేజీ109.
3. قال: فَإِنَّ اَلْعَبْدَ اَلْمُؤْمِنَ إِذَا اِتَّخَذَ بِيَدِ زَوْجَتِهِ كَتَبَ اَللَّهُ لَهُ عَزَّ وَ جَلَّ عَشْرَ حَسَنَاتٍ وَ مَحَا عَنْهُ عَشْرَ سَيِّئَاتٍ فَإِنْ قَبَّلَهَا كَتَبَ اَللَّهُ لَهُ مِائَةَ حَسَنَةٍ وَ مَحَا عَنْهُ مِائَةَ سَيِّئَةٍ فَإِنْ أَلَمَّ بِهَا كَتَبَ اَللَّهُ لَهُ أَلْفَ حَسَنَةٍ وَ مَحَا عَنْهُ أَلْفَ سَيِّئَةٍ وَ حَضَرَتْهُمَا اَلْمَلاَئِكَةُ وَ إِذَا اِغْتَسَلاَ لَمْ يَمُرَّ اَلْمَاءُ عَلَى شَعْرَةٍ مِنْ كُلِّ وَاحِدٍ مِنْهُمَا إِلاَّ كَتَبَ اَللَّهُ لَهُمَا حَسَنَةً وَ مَحَا عَنْهُمَا سَيِّئَةً فَإِنْ كَانَ ذَلِكَ فِي لَيْلَةٍ بَارِدَةٍ قَالَ اَللَّهُ تَعَالَى لِلْمَلاَئِكَةِ اُنْظُرُوا إِلَى عَبْدَيَّ هَذَيْنِ اِغْتَسَلاَ فِي هَذِهِ اَللَّيْلَةِ اَلْبَارِدَةِ عِلْماً مِنْهُمَا أَنِّي رَبُّهُمَا أُشْهِدُكُمْ أَنِّي قَدْ غَفَرْتُ لَهُمَا.బురుజర్దీ, హుసైన్, జామివుల్ అహాదీస్, భాగం25, పేజీ85.
4. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, భాగం81, పేజీ98.
5. చూ. మకారిమ్ షీరాజీ, నాసిర్, తఫ్సీరె నమూనహ్, భాగం14, పేజీ45.
6. కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, అల్ కాఫీ, భాగం3, పేజీ391.
7. చూ. ఫర్హంగె ఫిఖ్ ముతాబిఖె మజాహిబె అహ్లె బైత్(అ.స), భాగం2, పేజీ486.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 35