హజ్రత్ జహ్రా(స.అ) జీవితం స్ర్తీలకు ఉత్తమ నమూనా అని నిదర్శిస్తున్న హదీసులు మరియు చరిత్ర...
త్యాగం మరియు పరోపకార గుణం
షియా మరియు అహ్లె సున్నత్ ల ఉల్లేఖలనుసారం, హజ్రత్ అలీ(స.అ) హజ్రత్ ఫాతెమా(స.అ), ఇమామ్ హసన్(అ.స), ఇమామ్ హుసైన్(అ.స) మరియు హజ్రత్ ఫిజ్జా, తమ ప్రతిజ్ఞ ప్రకారం మూడు రోజులు ఉపవాస దీక్షలు నిర్వర్తించారు. మొదటి రోజు ఉపవాసం దీక్షను విరమించుకునే సమయంలో ఒక పెదవాడు తలుపు తట్టి తినడాన్ని ఏదైనా ఉంటే పెట్టమని కోరాడు, హజ్రత్ అలీ(స.అ) తన భాగాన్ని అతడికి ఇచ్చేశారు. మిగతవారు కూడా వారిని అనుచరిస్తూ తమ రొట్టెలను ఆ పెదవాడికి ఇచ్చి నీళ్లతో ఉపవాస దీక్షను విరమించుకున్నారు. రెండవ రోజు రాత్రి ఒక అనాధ వచ్చాడు అతడికి ఆ రోజు భోజనాన్ని ఇచ్చేశారు మరి మూడవ రోజు ఒక బాటసారి వచ్చి సహాయం చేయమని కోరగా అతడికి సహాయం చేశారు.
అప్పుడు అల్లాహ్ తరపు నుండి సూరయె దహ్ర్[1] అవతరించబడింది, ఈ సూరహ్ లో అల్లాహ్ و یطعمون الطعام علی حبه مسکینا و یتیما و اسیرا ఇలా అని వారి త్యాగాన్ని వెల్లడించెను.[2]
ఈ సంఘటన గురించి షియా మరియు అహ్లె సున్నత్ ల ఖుర్ఆన్ వ్యాఖ్యానం గ్రంథాలు “కష్షాఫె జమఖ్షరీ” మొదలగు వాటిలో చూడవచ్చు.
జీవిత భాగస్వామితో ఇంటి పనులను పంచుకోవడం
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: “....అలీ(అ.స) నీళ్లు మరియు కట్టెలు తీసుకొచ్చేవారు మరియు హజ్రత్ ఫాతెమా(స.అ) (గోదుమలను) పిండి చేసి దానితో రొట్టెలు తయారు చేసేవారు...”[3]
దైవప్రవక్త(స.అ) హజ్రత్ ఫాతెమా(స.అ)కు సహయం చేయడం
దైవప్రవక్త(స.అ) హజ్రత్ అలీ(అ.స) ఇంటికి వచ్చారు, హజ్రత్ అలీ(అ.స) ఫాతెమా జహ్రా(స.అ)తో కలిసి పిండి రుబ్బుతున్నారు, దైవప్రవక్త(స.అ) మీలో ఎవరు ఎక్కువగా అలిసిపోయి ఉన్నారు? అని ప్రశ్నించారు.
హజ్రత్ అలీ(స.అ) “ఫాతెమా(స.అ), దైవప్రవక్తా(స.అ)!” అన్నారు.
దైవప్రవక్త(స.అ) హజ్రత్ ఫాతెమా(స.అ) తో “అమ్మా నువ్వు లెగు” అన్నారు. ఫాతెమా(స.అ) అక్కడి నుండి లేచారు, ఆమె చోట్లో దైవప్రవక్త(స.అ) కూర్చోని హజ్రత్ అలీ(స.అ) తో పాటు గింజలను రుబ్బడం మొదలు పెట్టారు.[4]
దైవప్రవక్త(స.అ) ప్రత్యేక బోధన
హజ్రత్ ఫాతెమ జహ్రా(స.అ) ఉల్లేఖనం: దైవప్రవక్త(స.అ) నా వద్దకు వచ్చినప్పుడు నేను (పడుకోవడానికై) పరుపును నేల పై పరుస్తున్నాను, ఆ సమయంలో దైవప్రవక్త(స.అ) నాకు ఇలా సెలవిచ్చారు: ..ఓ ఫాతెమా! ఈ నాలుగు పనులు చేయనంత వరకు నిద్రపోవద్దు: 1. ఖుర్ఆన్ ను పూర్తి చేయనంత వరకు 2. దైవప్రవక్తలను షఫీ (మధ్యవర్తి) గా నిర్థారించుకోనంత వరకు 3. నీ ద్వారా విశ్వాసులను సంతోష పరచనంత వరకు 4. హజ్జ్ మరియు ఉమ్రా లను నిర్వర్తించనంత వరకు.
ఈ విధంగా చెప్పి వారు నమాజ్ చదవడంలో నిమగ్నమయ్యారు. నేను వారి నమాజు పూర్తి అయ్యే వరకు వేచి ఉండి, పూర్తయిన తరువాత ఓ దైవప్రవక్త(స.అ)! మీరు చెప్పిన నాలుగు చర్యలు ఇంత తక్కువ సమయంలో చేసే సమర్థత నాకు లేదు.. అన్నాను. అప్పుడు దైవప్రవక్త(స.అ) చిరునవ్వు నవ్వుతూ ఈ విధంగా సెలవిచ్చారు: “నువ్వు తౌహీద్ సూరహ్ ను మూడు సార్లు పఠిస్తే పూర్తి ఖుర్ఆన్ పఠించినట్లు; నాపై మరియు నా మునుపటి ప్రవక్తలపై సలవాతును పంపితే, మేము ప్రళయ దినాన నీ సిఫార్సు చేసే వారమవుతాము; ఇతర విశ్వాసుల గురించి దేవుని సన్నిధిలో క్షమాపణ కోరితే వారు నీ పట్ల సంతోషం కలిగి ఉంటారు; మరియు “సుబ్ హానల్లాహి వల్ హందు లిల్లాహి వ లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్” అని పఠించినప్పుడు నువ్వు హజ్జ్ మరియు ఉమ్రా చేసినట్లు.[5]
హజ్రత్ ఫాతెమా(స.అ) జీవత కాలం 18 సంవత్సరాలు అందులో 9 సంవత్సరాలు తండ్రి వద్ద మరియు 9 సంవత్సరాలు వారి భర్త హజ్రత్ అలీ(అ.స) వద్ద గడిచాయి. ఆ 18 సంవత్సరాల కాలంలో ఆడది ఒక కూతురు, ఒకభార్య మరియు ఒక తల్లిగా ఎలా ఉండాలో ప్రపంచానికి చాటి చేప్పారు.
చివరి మాట.. ఈ విధంగా హజ్రత్ జహ్రా(స.అ) తన భర్త పట్ల గౌరవం, భర్త పట్ల ఆమె బాధ్యత మరియు ఇష్టం అలాగే పిల్లల పట్ల ప్రేమ మరియు వారి శిక్షణ బాధ్యత, ఇరుగు పొరుగు వారి బాధ్యతల పట్ల నిర్వర్తన చేస్తూ ఇంటిని ఒక పాఠశాలగా, మస్జిదుగా, ఖుర్ఆన్ శిక్షణాశాలగా, సద్గుణాలకు కేంద్రముగా మార్చేశారు.
అల్లాహ్ మనందరికీ ఆమె ను అనుసరించి మన ఇళ్లను ఇస్లామీయ గృహములుగా మార్చుకునే అనుగ్రహాన్ని ప్రసాదించుగాక...
రిఫ్రెన్స్
1. సదూఖ్, అమాలీ సదూఖ్, పేజీ212 మరియు 216.
2. మనాఖిబె షహ్రె ఆషూబ్, భాగం3, పేజీ147, 148.
3. కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబె కులైనీ, రౌజతుల్ కాఫీ, చాపె ఇస్లామియహ్, తెహ్రాన్, పేజీ165.
4. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం43, పేజీ51.
5. ఖులాసయె అజ్కార్,మఫాతీహుల్ జినాన్,పేజీ961.
వ్యాఖ్యానించండి