స్త్రీల కోసం ఉత్తమ నమూనా-2

శని, 12/10/2022 - 14:54

హజ్రత్ జహ్రా(స.అ) జీవితం స్ర్తీలకు ఉత్తమ నమూనా అని నిదర్శిస్తున్న హదీసులు మరియు చరిత్ర...

స్ర్తీల కోసం ఉత్తమ నమూనా-2

 

పిల్లల పట్ల ప్రేమ చూపించడం
శిక్షణ విజ్ఞానానికి సంబంధించిన నిపుణుల ప్రకారం: బాల్యం దశలలో పిల్లల పట్ల ప్రేమానురాగాలు వ్యక్తం చేయడం చాలా అవసరం. పిల్లలు తన తల్లిదండ్రులు వాళ్లని ఇష్టపడాలి అనీ మరియు పిల్లల పట్ల వారి ప్రేమను వ్యక్తం చేయాలని ఉంటుంది. పిల్లలు బట్టలూ, తిండీ మరియు ఎక్కడ నివసిస్తున్నాము అన్న విషయాలను అంతగా పట్టించుకోరు కాని వారిని ఇష్టపడుతున్నారా లేదా? అన్న విషయాన్ని మాత్రం గ్రహిస్తూ ఉంటారు.

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఇంట్లో ఈ విషయం పట్ల సంపూర్ణ అనుచరణ కనిపిస్తుంది. ఆమె దైవప్రవక్త(స.అ) లాంటి కారుణ్య సముద్రం ఒడిలో పెరిగినవారు. ఆమె తన ప్రేమను నిత్యం తన భర్త మరియు పిల్లల పట్ల వ్యక్తం చేసేవారు.

సల్మానె మొహమ్మదీ ఇలా ఉల్లేఖించెను: ఒకరోజు నేను హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ను తిరగలిని త్రిప్పుతూ ఉండగా చూశాను. ఆమె కుమారుడు హుసైన్(స.అ) ఏడ్పు మొదలు పెట్టారు. నేను తిరగలిని త్రిప్పడంలో సహాయం చేయాలా లేక పిల్లాడ్ని ఎత్తుకోవాలా? అని ప్రశ్నించాను. అందుకువారు నేను పిల్లాడ్ని శాంతిపజేయడమే మేలు. నీవు తిరగలిని త్రిప్పు అని సమాధానమిచ్చారు.[1]

భర్త పట్ల బాధ్యత
ఒక స్త్రీ యొక్క గొప్ప విజయం మరియు విలువ; జీవితంలో వచ్చే వివిధ సందర్భాలలో భర్త సంతోషంగా ఉండేటట్లు ఉండడం మరియు భర్తకు కష్టపెట్టే పనుల నుండి దూరంగా ఉండడం. హజ్రత్ అలీ(స.అ) ఇలా ఉపదేశించెను: “స్ర్తీ యొక్క జిహాద్, భర్త పట్ల బాధ్యతగా ఉండడం” స్ర్తీ తన ఈ జిహాద్ లో విజయం పొందాలంటే అన్ని విధాలుగా ప్రయత్నించాలి దాంతో ఆ ఇల్లు మగాడి కోసం శాంతి నిలయం అవుతుంది.

భర్త పట్ల తన బాధ్యతల నిర్వర్తన విషయంలో హజ్రత్ ఫాతెమా(స.అ)కు ముస్లిం స్ర్తీలకు ఉత్తమ నమూనా అని చెప్పవచ్చు. భర్త పట్ల వారి ప్రవర్తన ఉత్తమ ప్రవర్తనం మరియు పవిత్ర ప్రేమకు నిదర్శనం. ఆమె తన భర్తను ఎప్పుడూ బాధపెట్టకపోవడమే కాకుండా అతనికి ప్రేమతో సహాయం అందించేవారు.

హజ్రత్ అలీ(స.అ) ఉల్లేఖనం: “అల్లాహ్ సాక్షిగా, నేను జహ్రా(స.అ) ను అల్లాహ్ తన వద్దకు తీసుకొని పోనంత వరకు, ఆగ్రహానికి గురి చేయలేదు మరియు ఆమెను కష్టపెట్టే పని చేయలేదు. ఆమె కూడా ఎప్పుడూ నన్ను కోపం తెప్పించలేదు మరియు ఆమె నన్ను కష్టపెట్టే పని చేయలేదు”.[2] ఇలా భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం వలనే జరుగుతుంది.

మరో చోట ఇలా ఉల్లేఖించారు: “ఎప్పుడు ఆమె ముఖాన్ని చూసినా నా అన్ని దుఖాలు దూరమయ్యేయి”[3]

ఇతరుల గురించి ఆలోచించడం
హజ్రత్ ఫాతమా జహ్రా(స.అ) పెద్దకుమారుడు ఇమామ్ హసన్[అ.స] ఇలా ఉల్లేఖననుసారం: “ఒక రోజు నేను అమ్మను రాత్రంతా అల్లాహ్‌ను ప్రార్ధింస్తూ, ప్రజల కోసం దుఆ చేస్తుండగా చూశాను. చివరికి సుర్యోదయం అయ్యింది. నేను అమ్మ వద్దకు వెళ్ళి “అమ్మా! నువ్వూ, నీ కోసం ఎందుకు దుఆ చేసుకో లేదు?” అని ప్రశ్నించాను. ఆమె ఇలా అన్నారు: నా ప్రియ కుమారా! ముందు పొరుగు వారు ఆ తరువాత ఇంట్లో వారు.[4]

విజ్ఞానం పట్ల పిల్లలకు ప్రోత్సాహం
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) తన పిల్లలను చిన్నప్పటి నుండే అల్లాహ్ ఆరాధన పట్ల శిక్షణ ఇచ్చారు. వారిలో ఏకేశ్వరరాధన స్వభావంతో పెంచారు. మొదట్నుంచే శిక్షణ వైపు మరియు విధ్యాభ్యాసం విషయంలో ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఉదాహారణకు తన కుమారుడు ఏడు సంవత్సరముల వయసులో ఇలా అనేవారు: “మస్జిదుకు వెళ్లి, దైవప్రవక్త(స.అ) నుండి విన్న మాటలు గుర్తు పెట్టుకో, నా వద్దకు వచ్చి వాటిని నాకోసం అప్పజెప్పు”[5]

రిఫరెన్స్

1. హుసైనీ షాహ్రూదీ, సయ్యద్ మొహమ్మద్, ఉల్గూహాయె రఫ్తారీయె హజ్రతె జహ్రా(స.అ), తర్బియతె ఫర్జన్ద్, పేజీ14.
2. హుసైనీ షాహ్రూదీ, సయ్యద్ మొహమ్మద్, ఉల్గూహాయె రఫ్తారీయె హజ్రతె జహ్రా(స.అ), తర్బియతె ఫర్జన్ద్, పేజీ16.
3. హుసైనీ, సయ్యద్ అలీ, కరామాత్ వ మఖామాతె ఇర్ఫానీయె హజ్రత్ జహ్రా(స.అ), పేజీ44.
4. దాస్తానె రాస్తాన్, షహీద్ ముతహ్హరీ, భాగం1, పేజీ88.
5. మొహమ్మదీ ఇష్తిహార్దీ, మొహమ్మద్, నిగాహీ బర్ జిందగీ హజ్రత్ ఫాతెమా(స.అ), పేజీ64.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8