హజ్రత్ ఫాతెమా(స.అ) ప్రతిష్టత

ఆది, 12/11/2022 - 16:46

పవిత్ర మాసూములు హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ప్రతిష్ట గురించి చెప్పిన మాటలు...

హజ్రత్ ఫాతెమా(స.అ) పవిత్ర మాసూముల మాటల్లో-1

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

పవిత్ర మాసూములు హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ప్రతిష్టను వివరించిన కొన్ని హదీసులను ఇక్కడ చూద్దాం..

ఇమామ్ అలీ(అ.స) దృష్టిలో
హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: “నేను దైవప్రవక్త(స.అ), ఫాతెమా మరియు వారి పిల్లల పై గర్వపడతాను”[1] మరోచోటు ముఆవియహ్ కు వ్రాసిన ఉత్తరానికి జవాబుగా వ్రాసిన ఉత్తరంలో హజ్రత్ అలీ(అ.స) ఇలా వ్రాశారు: “...స్వర్గ యువకుల నాయకులుద్దరు మా నుండి నరకవాసులు మీ నుండి. జగత్తు ఉత్తమ స్ర్తీ (హజ్రత్ ఫాతెమా) మా నుండి నరకవాసుల కోసం కట్టెలు ప్రోగు చేసేవారు మీ నుండి...”[2]

ఇమామ్ హసన్(అ.స) దృష్టిలో
ఇమామ్ హసన్(అ.స) చాలా సందర్భాలలో తన తల్లి గొప్పతనం గురించి మాట్లాడారు; వాటి నుండి ఒకటి ప్రసిద్ధి చెందిన అర్ధరాత్రి తల్లిని నమాజ్ మరియు మునాజాత్ లో మునిగి ఉండి ఇతరుల కోసం దుఆ చేయడం మరియు ఎందుకని ఇతరుల కోసం దుఆ చేస్తున్నావు అని అడిగినప్పుడు హజ్రత్ ఫాతెమా ఇలా సెలవిచ్చారు: “ముందు పొరుగువారు ఆ తరువాత ఇంట్లోవారు”[3]

ఇమామ్ హుసైన్(అ.స) ఉల్లేఖనం: దైవప్రవక్త(స.అ) ఉమ్మె సల్మా ఇంట్లో ఉండగా సర్సాయీల్ – దైవదూతల నుండి ఒకడు – దైవప్రవక్త(స.అ) వద్దకు వచ్చి “నూర్(కాంతి) ను నూర్ కిచ్చి వివాహం చేయి” అని అన్నాడు. దైవప్రవక్త(స.అ) ఎవర్ని ఎవరికిచ్చి వివాహం చేయాలి అని ప్రశ్నించారు. నీ కుమార్తె ఫాతెమా(స.అ) ను అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) కిచ్చి అని అన్నాడు. ఆ తరువాత జిబ్రయీల్, మీకాయీల్ మరియు సర్సాయీల్ ఆధ్వర్యంలో ఫాతెమా(స.అ) వివాహం అలీ(అ.స) తో జరిగింది.[5]

ఇమామ్ సజ్జాద్(స.అ) దృష్టిలో
ఇమామ్ సజ్జాద్(స.అ) ఉల్లేఖనం: ప్రళయదినం సంభవించినప్పుడు, ఫాతెమా(స.అ) మహ్షర్ మైదానంలో ప్రవేశిస్తారు అప్పుడు ఇలా చెప్పబడుతుంది: “దైవాదేశాలను(ఆయతులను) విశ్వసించినవారు, అహ్లెబైత్ ను ఇష్టపడే ముస్లిములు తప్ప అందరూ తమ తలలను క్రిందికి దించండి” అప్పుడు ఇలా ప్రకటించబడుతుంది: ఈమె ఫాతెమా బింతె ముహమ్మద్(స.అ). ఆమె తన సహవాసులతో పాటు కలిసి స్వర్గం వైపుకు వెళ్తున్నారు. అల్లాహ్ ఒక దూతను ఆమె వద్దకు పంపి కోరికలు నన్ను కోరుకో! అని అనెను. ప్రభూ! నాకోరిక; నన్నూ మరియు నా సంతానాన్ని సహాయపడినవారికి నీ క్షమాపణ చెందేవిధంగా చేయి.[6]

ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) దృష్టలో
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ఉల్లేఖనం: ప్రళయదినం సంభవించినప్పుడు జిబ్రయీల్ ఇలా ప్రకటిస్తారు: ఖదీజహ్ బింతె ఖువైలద్ ఎక్కడా? మర్యమ్ బింతె ఇమ్రాన్, ఆసియా బింతె ముజాహిమ్ మరియు హజ్రత్ మూసా(అ.స) సోదరి ఉమ్మె కుల్సూమ్ ఎక్కడా? వారందరూ లెచినిలబడతారు.... అప్పుడు ఇలా ప్రకటించబడుతుంది; మహ్షర్ వాసులారా ఈ రోజు నేను గౌరవ ప్రతిష్టతలను ముహమ్మద్, అలీ, హసన్, హుసైన్ మరియు ఫాతెమా(అలైహిముస్సలామ్) కోసం నిశ్చయించాను. తలలను క్రిందికి దించండి మరియు కళ్లను మూసుకోండి, ఫాతెమా స్వర్గంలో ప్రవేశిస్తున్నారు. ఆ తరువాత జిబ్రయీల్ స్వర్గపు ఒంటెను తీసుకొస్తారు మరియు ఆమెను స్వర్గానికి తీసుకొని వెళ్తారు కాని వారు స్వర్గ ప్రవేశానికి ఆలస్యం చేస్తారు. అల్లాహ్ ఆమెను ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా సమాధానమిస్తుంది: ఓ ప్రభూ! ఈ రోజు నా స్థాయిని తెలుసుకోవాలనుకుంటున్నాను. అల్లాహ్ ఇలా అనెను: “నా హబీబ్ యొక్క కుమార్తే! తిరిగి చూడు నీ అహ్లెబైత్ పట్ల ఇష్టం ఉన్న వారిని స్వర్గంలో ప్రవేశపెట్టు” ఇమామ్ బాఖిర్(అ.స) ఇలా ఉల్లేఖించెను: “అల్లాహ్ సాక్షిగా! ఆ రోజు హజ్రత్ ఫాతెమా(స.అ) షియా మరియ వారిని ఇష్టపడేవారిని పక్షి చెడు గింజల నుండి మంచి గింజలను వేరు చేసేటట్లు ఆ జన సమూహం నుండి వేరు చేస్తారు.[7]

రిఫరెన్స్
1. దీవానె ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స), మొహమ్మద్ అబ్దుర్రహ్మాన్ ఇవజ్, పేజీ65.
2. నెహ్జుల్ బలాగహ్, నామా28.
4. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం43, పేజీ81, 82.
5. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం43, పేజీ123.
6. అవాలిముల్ ఉలూమ్, భాగం2, పేజీ178.
7. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం43, పేజీ64.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Rajjab Basha on

Jazakallah
Kya Shan hai shahzadiye kounain as ka

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13