అల్లాహ్ పట్ల భయం కలిగివుండడం

ఆది, 12/11/2022 - 17:44

హజ్రత్ జైనుల్ ఆబెదీన్(అ.స) యొక్క అత్యుత్తమ లక్షణాన్ని వివరిస్తున్న ఒక సంఘటన...

అల్లాహ్ పట్ల భయం కలిగివుండడం

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

ప్రజల సన్మార్గం కోసం అల్లాహ్ తరపు నుండి నిశ్చయించబడ్డ దైవప్రవక్త(స.అ) నాలుగొవ ఉత్తరాధికారీ, దైవారాధకుల అలంకణా, కర్బలా వీరుల లక్ష్యం అంతం కాకుండా అన్ని విధాలుగా ప్రయత్నం చేసినవారూ, అతి దుర్మార్గుల సభలో కూడా కర్బలా లక్ష్యాన్ని వివరిస్తూ ఉపన్యాసం ఇచ్చిన మహావీరుడూ, ఇస్లాం రక్షణ కోసం ఎటువంటి కష్టం వచ్చినా వెనుకడుగు వేయకుండా ముందుకు దూసుకొనిపోయేవారూ, కత్తుల ప్రమేయం లేకుండా కేవలం దుఆలతో శత్రువుల ప్రయత్నాలను విఫలం చేసినవారూ, తరువాతి కాలంలో ఇస్లామీయ విశ్వవిధ్యాలయాలు స్థాపించే విధంగా సమాజాన్ని తీర్చిదిద్దిన మాహా మూర్తి అయిన హజ్రత్ జైనుల్ ఆబెదీన్(అ.స) జన్మదిన సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు.
ఇమామ్ జైనుల్ ఆబెదీన్(అ.స) హిజ్రీ యొక్క 37వ సంవత్సరం, షాబాన్ మాసం 4వ తారీఖున మదీనహ్ లో జన్మించారు. కర్బలా యుద్ధం సమాయంలో అతని వయసు 24 సంవత్సరాలు. వారి తండ్రి ఇమామ్ హుసైన్(అ.స) మరణాంతరం 35 సంవత్సరాలు ఇమామత్ బాత్యను నిర్వర్తించి చివరికి దుర్మార్గుల విషప్రయోగం ద్వార మరణించారు.[1]

అల్లాహ్ పట్ల భయం కలిగివుండడం
తావూస్ అనబడే వ్యక్తి ఇలా ఉల్లేఖించెను: “ఒకరోజు మస్జిదుల్ హరామ్ లో ఇమామ్ ను చూశాను, వారు నమాజ్ చదువుకుంటున్నారు, కళ్ళనుండి కన్నీళ్ళు కారుతున్నాయి, దుఆ చేస్తున్నారు. నమాజ్ పూర్తయిన తరువాత వారి వద్దకు వెళ్ళి వారితో ఇలా అన్నాను: యబ్న రసూలిల్లాహ్, మీ విముక్తి కోసం మూడు మార్గాలు ఉన్నప్పటికీ మీరు ఎందుకని రోధిస్తున్నారు? మొదటిది మీరు దైవప్రవక్త(స.అ) కుమారులు, రెండవది మీ పితామహులు ప్రళయదినాన సిఫార్సు చేయువారు మరియు మూడవది అల్లాహ్ దయామయుడు! ఇమామ్ ఇలా సమాధానమిచ్చారు: దైవప్రవక్త(స.అ) కుమారుడు కావడం నాకు ఎటువంటి లాభాన్ని చేకూర్చదు ఎందుకంటే అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించెను: “మరి శంఖం పూరించబడినప్పుడు వారి మధ్యన బంధుత్వాలుగానీ, ఒండొకరిని అడిగి చూడటంగానీ ఆనాడు ఉండదు”(సూరయె మోమినూన్, ఆయత్101) ఇక మా పితామహుల సిఫార్సు గురించి చెప్పాలంటే అది నాకు లాభాన్ని చేకూరుస్తుందా లేదా అనేది తెలియదు ఎందుకంటే ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “సిఫారసు వినటానికి అల్లాహ్ ఇష్టపడినవారి విషయంలో తప్ప వారు ఎవరి గురించి కూడా సిఫారసు చేయరు”(సూరయె అంబియా, ఆయత్28). ఇక అల్లాహ్ కారుణ్యం గురించి చెప్పాలంటే అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సూచించెను: “నిస్సందేహంగా అల్లాహ్ కారుణ్యం సజ్జనులకు చాలా దగ్గరే ఉంది”(సూరయె అఅరాఫ్, ఆయత్56) నేను సజ్జనులలో ఉన్నానో లేదో నాకు తెలియదు.[2]

రిఫరెన్స్
1. జవాదె ముహద్దిసీ, ఫర్హంగె ఆషూరా, పేజీ216, నష్రె మారూఫ్, ఖుమ్, 1374.
2. అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, భాగం46, పేజీ83.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 23