నమాజ్ చరిత్ర

సోమ, 12/19/2022 - 01:52

నమాజ్ చరిత్ర మరియ నమాజ్ కు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలను వివరిస్తున్న కొన్ని నిదర్శనలు... 

నమాజ్ చరిత్ర

నమాజ్ చరిత్ర

హజ్రత్ ముహమ్మద్(స.అ) కు ముందు హజ్రత్ ఈసా(అ.స) తీసుకొచ్చన ధర్మం లో కూడా నమాజ్ ఉండేది. ఖుర్ఆన్ దీని గురించి ఇలా వివరించెను: “నేను జీవించి ఉన్నంతకాలం నమాజ్, జకాత్ లకు కట్టుబడి ఉండమని ఆయన నాకు ఆదేశించాడు”[ సూరయె మర్యమ్, ఆయత్31] వారికి ముందు హజ్రత్ మూసా(అ.స) సమయంలో కూడా నమాజ్ ఉండేది; అల్లాహ్ హజ్రత్ మూసా(అ.స)తో ఇలా అనెను: “నన్ను జ్ఞాపకం చేయటానికి నమాజును నెలకొల్పు”[ సూరయె తాహా, ఆయత్14] వారికి ముందు హజ్రత్ మూసా(అ.స) మామగారు హజ్రత్ షుఐబ్ కూడా నమాజ్ కలిగి ఉన్నారు; “ఓ షుఐబ్! మేము మా తాతముత్తాతలు పూజిస్తూ వస్తున్న దైవాలను వదలి పెట్టాలనీ, మా సొమ్ములను మా ఇష్టప్రకారం ఖర్చుపెట్టడం మానుకోవాలని నీ నమాజు నీకు ఆజ్ఞాపిస్తోందా? నువ్వు మరీ ఉదాత్త హృదయునిలా, రుజువర్తనునిలా ఉన్నావే?!”[సూరయె హూద్, ఆయత్87] వీళ్లందరికి ముందు హజ్రత్ ఇబ్రాహీమ్(అ.స); వీరు అల్లాహ్ నుండి తన సంతానం కోసం నమాజ్ స్థాపన యోగ్యతను కోరారు “నా ప్రభూ! నన్ను నమాజును నెలకొల్పేవానిగా చెయ్యి. నా సంతతి నుండి కూడా”[సూరయె ఇబ్రాహీమ్, ఆయత్40]

లుఖ్మాన్ తన కుమారునితో ఇలా అన్నారు: “ఓ (ప్రియమైన) కుమారా! నువ్వు నమాజును నెలకొల్పుతూ ఉండు” [సూరయె లుఖ్మాన్, ఆయత్17]

నమాజ్ ప్రచారం
నమాజ్ ప్రచారానికి మించి ఏ ప్రచారం అంతలా జరగదు. ప్రతీ రోజు ఐదు నమాజులు వాజిబ్ గా నిర్థారించబడి ఉందు. ప్రతీ నమాజ్ కోసం అజాన్ మరియు ఇఖామత్ చెప్పడం కోరబడింది. ఈ రెండింట్లో మొత్తంగా:

20 సార్లు “హయ్య అలస్సలాహ్”
20 సార్లు “హయ్య అలల్ ఫలాహ్”
20 సార్లు “హయ్య అలా ఖైరిల్ అమల్”  మరియు
10 సార్లు “ఖద్ ఖామతిస్సలాహ్” చెబుతున్నాము.

అజాన్ మరియు ఇఖామత్ లో “ఫలాహ్” మరియు “ఖైరిల్ అమల్” యొక్క అర్థం నమాజ్ కాబట్టి ప్రతీ ముస్లిము ప్రతీ రోజు 70 సార్లు “హయ్య” పదం ద్వార తనను మరియు ఇతలకు నమాజ్ చదవడానికి త్వరపడండి అని చెబుతున్నాడు. ఇతర ఆరాధానల గురించి ఇంతిలా ప్రోత్సాహం కనబడు. ముఖ్యంగా అజాన్ ను గట్టిగా మరియు మంచి స్వరంతో ఇవ్వమని కోరడం జరిగింది.

అజాన్, మౌనాన్ని భంగం చేస్తుంది.
అజాన్ ఇస్లామీయ ఐడియాలోజి యొక్క కోర్స్.
అజాన్, ఒక విధంగా చిన్న వాక్యాలతో మరియు గొప్ప గొప్ప భావాలతో కూడి ఉన్న జాతియా గీతం.
అజాన్, నిర్లక్ష్యులకు హెచ్చరిక.
అజాన్, మతపరమైన వాతవారణానికి చిహ్నం.
అజాన్, ఆధ్యాత్మిక జీవానికి సంకేతం.

నమాజ్ అగ్రస్థానం
ముఖ్యమైన రోజులలో ఉదాహారణకు షబె ఖద్ర్, ఇస్లామీయ పండగలు, ప్రతీ ప్రత్యేక మరియు ప్రతిష్టాత్మక రోజుల్లో ప్రత్యేక దుఆ మరియు ప్రత్యేక చర్యలు ఉంటాయి ఉదా: బెఅసత్ రాత్రి, మీలాదున్నబీ రాత్రి, షబె జుమా, ప్రత్యేక నమాజులు ఉంటాయి. భహుశ ప్రత్యేక మరియు ముఖ్యమైన రోజు అయి ఉండి అందులో అమలు చేయవలసిన చర్యలలో నమాజ్ ఉండక పోవడం చాలా అరుదు. ప్రతీ ముఖ్యమైన రోజుల అమాల్ లో నమాజ్ తప్పని సరిగా ఉంటుంది.

నమాజ్ అత్యంత వైవిధ్యమైనది
జిహాద్ మరియు హజ్ లాంటి ఆరాధనలు కేవలం కొన్ని రకాలు మాత్రమే ఉన్నాయి కాని నమాజ్ రకాలను చూసుకుంటే వందల రకాల నమాజ్ మనకు కనబడతాయి.
ఒక్కసారి అల్లామా షేఖ్ అబ్బాసె ఖుమ్మీ రచించిన మఫాతీహుల్ జినాన్ లో చూసుకున్నట్లైతే ప్రత్యేక ప్రదేశానికి బట్టి, సమయానికి బట్టి ముస్తహబ్ నమాజులలో ఎన్నో రకాలు కనిపిస్తాయి.

నమాజ్ మరియు హిజ్రత్
హజ్రత్ ఇబ్రాహీమ్ ఇలా ప్రార్థించెను: “మా ప్రభూ! నా సంతానంలో కొందరిని పంటలు పండని కటికలోయలో, నీ పవిత్రగృహం వద్ద వసింపజేశాను. మా ప్రభూ! వార నమాజును నెలకొల్పేందుకే (ఇక్కడ వదిలి పెట్టాను). కనుక ప్రజలలో కొందరి మనసులు వారి వైపుకు మగ్గేలా చేయి”[సూరయె ఇబ్రాహీమ్, సూరయె37].

ఔను, ఇబ్రాహీమ్ నమాజ్ ను స్థాపించడానికి మక్కా కు వచ్చారు, కాబాను నమాజ్ చదివే వారి కోసం ఖిబ్లా దిశగా నిర్ధారించడానికై. ఆ తరువాత ప్రజలకు హజ్ కోసం ఆహ్వానించారు. అంటే కాబా ప్రదక్షణాల కన్నా ముందు కాబా తరపు నమాజ్ చదవడం హజ్రత్ ఇబ్రాహీమ్ దృష్టికొచ్చింది!  

రిఫరెన్స్
ఖిరాఅతీ, మొహ్సిన్, ఎక్ సద్ వ చహార్దహ్ నుక్తె దర్బారె నమాజ్, సితాదె ఇఖామయె నమాజ్, పేజీ5-7.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17