జన్నతుల్ బఖీ చరిత్ర

మంగళ, 12/27/2022 - 01:44

జన్నతుల్ బఖీ స్మశానం యొక్క చరిత్ర, అందులో ఉన్న సమాధుల గురించి మరియు వాటి పై ఉండే గోపురాల గురంచి సంక్షిప్త వివరణ...

జన్నతుల్ బఖీ చరిత్ర

“జన్నతుల్ బఖీ” స్మశానం మదీనహ్ మునవ్వరహ్(సౌదీ అరేబీయ)లో ఉన్న గొప్ప స్మశానం. “బఖీ” కేవలం ఒక స్మశానం కాదు, అది ఒక ఇస్లామీయ చరిత్ర యొక్క నిధి. అందులో నాలుగు పవిత్ర మాసూమ్; హజ్రత్ ఇమామ్ హసన్(అ.స), హజ్రత్ ఇమామ్ జైనుల్ అబెదీన్(అ.స), హజ్రత్ ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) మరియు హజ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స)ల సమాధులున్నాయి. అలాగే ఒక వచనానుసారం దైవప్రవక్త(స.అ) కుమార్తే సమాధి కూడా అందులోనే ఉంది. సహాబీయుల మరియు తాబెయీన్ల భార్యల, కుమారుల మరియు కుమార్తెల సమాధులు మరియు దైవప్రవక్త(స.అ) దగ్గర సంబంధీకుల సమాధులు ఇంచుమించు పది వేల ఇస్లామీయ ప్రముఖులు అక్కడే సమాధి అయి ఉన్నారు. ఉదాహారణకు; దైవప్రవక్త(స.అ) పినతండ్రి అయిన జనబె అబ్బాస్ ఇబ్నె అబ్దుల్ ముతల్లిబ్, దైవప్రవక్త(స.అ) యొక్క పిన్నీ మరియు హజ్రత్ అలీ యొక్త తల్లి అయిన జనబే ఫాతెమా బింతె అసద్, అఖీల్ ఇబ్నె అబీ తాలిబ్, ముహమ్మదె హనఫియ్యహ్, హజ్రత్ అబుల్ ఫజ్లిల్ అబ్బాస్(అ.స) యొక్క తల్లి జనాబె ఉమ్ముల్ బనీన్, ఇస్మాయీల్ ఇబ్నె ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స), అబ్దుల్లాహ్ ఇబ్నె జాఫరె తయ్యార్, వీళ్లందరూ అక్కడే సమాధి చేయబడ్డారు. వీళ్ళ సమాధుల పై రౌజా(గోపురం) ఉండేవి. ఈనాడు కూడా కొందరి వద్ద వాటి చిత్రాలు ఉన్నాయి. ఇంటర్ నెట్ లో కూడా చూడవచ్చు. ఈ గోపురాలు మరియు ఈ రౌజాలు షవ్వాల్ నెల 8వ తేదీ, 1344 హిజ్రీ వరకు ఉండేవి.[1]
బఖీ స్మశానం చరిత్ర ఇస్లాం రాకా ముందు నుండే మొదలవుతుంది కాని ఎప్పటి నుండీ అనేది చరిత్రలో స్పష్టంగా లిఖించబడి లేదు. చరిత్ర గ్రంథాల ప్రకారం మదీనహ్ వాసులు హిజ్రత్ కన్నా ముందు తమ పూర్వీకుల మృతదేహాలను రెండు స్మశానాలు “బనీ హరామ్” లేదా “బనీ సాలిమ్”లో సమాధి చేసేవారు. కొన్ని సమయాలలో తమ సొంత ఇంట్లోనే సమాధి చేసేవారు. కాని మదీనహ్ పట్టణానికి ముస్లిముల హిజ్రత్ తరువాత “బఖీ” కేవలం ముస్లిముల స్మశానంగా మారింది, కాలక్రమేణా మరియు సహాబీయుల, తాబెయీనుల సంబంధీకుల మరియు దైవప్రవక్(స.అ) అహ్లెబైత్(అ.స) సమాధుల ద్వార దానికో ప్రత్యేకత ఏర్పడింది.[2].

జన్నతుల్ బఖీ గోపురాలు
చరిత్ర మరియు దర్శనానికి వెళ్ళిన వారి మాటల ఆదారంగా జన్నతుల్ బఖీలో దైవప్రవక్త(స.అ) యొక్క సమాధుల పై రౌజా మరియు గోపురాలు ఉండేవి. అంతేకాకుండా హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) యొక్క జ్ఞాపకార్థం అయిన “బైతుల్ హుజ్న్” కూడా ఉండేది. వలసరాజ్య కుట్ర ఫలితంగా పుట్టుకొచ్చిన సౌదీ అధికారం వహాబీ వర్గ నమ్మకాలను అనుసరిస్తూ ఈ పవిత్ర దర్బారులను, బార్గాహ్ లను నాశనం చేశారు. ఈ చర్య రెండు సార్లు జరిగింది. మొదటి సారి హిజ్రీ యొక్క 1220వ సంవత్సరంలో మరియు రెండవ సారి 1344లో. మొదటి సారి నాశనం చేసిన తరువాత 1234లో ఉస్మానీ అధికారం యొక్క రాజు సుల్తాన్ మహ్మూద్ సాని ఉత్తర్వులనుసారం వాటిలో కొన్నింటిని మరలా కట్టారు.[3]

జన్నతుల్ బఖీ ధ్వంసం
వలస రాజ్య బలగాలు తమ అపవిత్ర లక్ష్యాలను చేరుకోవటం కోసం ఎల్లప్పుడూ ముస్లిముల మధ్య విరుద్ధ మంటను రేపి వారి మధ్య ద్వేషాలను వ్యాపించటంలో మరియు వారిలో వ్యతిరేకత సృష్టించడానికి కొత్త కొత్త నమ్మకాలను మరియు అభిప్రాయలను ప్రయోగిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఇబ్నె తైమియహ్ యొక్క అభిప్రాయాల ఆధారంగా, వహాబీయత్ రూపంలో ఒక కొత్త వర్గాన్ని సృష్టించారు. మొహమ్మద్ ఇబ్నె అబ్దుల్ వహాబ్ అనబడే ఒక యువకుడిని తమ ఈ మిషన్ ను విజయవంతం చేయడానికి ఉపయోగించుకున్నారు. ప్రజల పాలకుడిని అచటి పూర్తి ప్రాంతం పై అధికారం ఆశను చూపించి ఇబ్నె అబ్దుల్ వహ్హాబ్ అనుచరుడ్ని చేశారు. అలా ముస్లిలలో చాలాకాలం వరకు వివాదాలు ఏర్పర్చారు. మొదట్లో ప్రపంచ ముస్లిములందరూ ఈ ఇస్లాంకు ఎటువంటి సంబంధం లేని ఈ అన్యాయ చర్య పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేశారు, ఆ తరువాత మొల్ల మొల్లగా అదికారం ఆధారంగా వహాబీయత్ ను వ్యాపిస్తూ ప్రపంచమంతటా తమ వంటివారిని తయారు చేసుకున్నారు. న్యాయవర్తులైన ముస్లిములు అంతేకాదు ముస్లిం కాని వారు కూడా ఈనాటి వరకు వారు చేసిన ఈ అపవిత్ర చర్యను ఖండిస్తున్నారు.
వహాబీయుల తాయిఫ్, జద్దా, మక్కా మరియు మదీనా యొక్క పవిత్ర ప్రదేశాలే కాకుండా కర్బలా మరియు నజఫ్ లలో కూడా ఇలాంటి చర్యలకు ప్రయత్నాలు చేశారు కాని అచటి అహ్లెబైత్(అ.స)ను ఇష్టపడేవారి ధైర్యం మరియు వారి ఎదురు దాడి ముందు నిలబడలేకపోయారు.[4]

రిఫరెన్స్
1. రమీదుల్ హసన్, ఇన్హెదామె జన్నతుల్ బఖీ; ఎక్ తారీఖీ అలమియ, అర్ష్ అసోసియేషన్, లఖ్నౌ, జులాయి2017.
2. ముహమ్మద్ సాదిఖ్ నజఫీ, తారీఖు హరమె అయిమ్మతిల్ బఖీ, పేజీ61, ముఅస్ససయే ఫర్హంగీ వ ఇత్తెలా రసానీయే తిబ్యాన్, ఖుమ్, 1387.
3. రమీదుల్ హసన్, ఇన్హెదామె జన్నతుల్ బఖీ; ఎక్ తారీఖీ అలమియ, పేజీ12, అర్ష్ అసోసియేషన్, లఖ్నౌ, జులాయి2017.
4. రమీదుల్ హసన్, ఇన్హెదామె జన్నతుల్ బఖీ, ఎక్ తారీఖీ అలమియ, పేజీ14, అర్ష్ అసోసియేషన్, లఖ్నౌ, జులాయి2017.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6