అన్యాయం యొక్క పరిణామాలు

మంగళ, 01/10/2023 - 17:19

అన్యాయం మరియు దుర్మార్గం యొక్క పరిణామాలు మరియు దుర్మార్గులకు సహకరించడం గురించి ఇస్లాం సూచనలు...

అన్యాయం యొక్క పరిణామాలు

ఖుర్ఆన్ యొక్క ఆయతులలో దుర్మార్గల మరియు అన్యాయులకు నరకాగ్నికి గురి అవుతారు అని హెచ్చరించబడి ఉంది. చాలా చోట్ల దుర్మార్గుల మరియు వారికి సహాయం చేసేవారి గురించి చెప్పబడి ఉంది. అన్యాయం మరియు దుర్మార్గం నుండి దూరంగా ఉండమని ఇస్లాం చాలా తాకీదు చేస్తుంది. సూరయె కహఫ్ ఆయత్ 29లో ఇలా వివరించబడి ఉన్నాయి: “(అయితే సత్యాన్ని నిరాకరించిన) దుర్మార్గుల కోసం మేము అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. దాని కీలలు వారిని చుట్టుముడతాయి. ఒకవేళ వారు సహాయం (ఉపశమనం, నీళ్లు) అడిగితే నూనె మడ్డిలాంటి నీటితో వారికి సహాయం అందజేయబడుతుంది. అది ముఖాలను మాడ్చివేస్తుంది. అత్యంత అసహ్యకరమైన నీరు అది! అత్యంత దుర్భరమైన నివాసం (నరకం) అది!![సూరయె కహఫ్, ఆయత్29]

సూరయె జిన్ యొక్క 15వ ఆయత్ లో ఇంకా వివరంగా చెప్పబడి ఉంది: “సన్మార్గం నుండి తొలగిపోయి, అపవాదానికి లోనైనవారు నరకానికి ఇంధనం అవుతారు”[సూరయె జిన్, ఆయత్15]

ఖుర్ఆన్ యొక్క ఈ వివరణలను బట్టి తెలిసే విషయమేమిటంటే వారి లోపల నుండి అగ్ని కమ్ముకోని వస్తుంది. ఎలాగైతే ఈ ప్రపంచం ప్రజల పై అన్యాయపు మంటలు కురిపించేవారో అలాగే అక్కడ అది రూపాన్ని దాల్చి వారి ముందుకు వస్తుంది.[1]

కేవలం దుర్మార్గం మరియు అన్యాయం మాత్రమే దుర్మార్గులకు నరకానికి పంపించదు; ఖుర్ఆన్ అనుసారం ఎవరైతే వారి పై నమ్మకం కలిగి ఉంటారో లేదా వారిని సహకరిస్తారో వారు కూడా దుర్మార్గులతో సమానమే. “చూడండి! ఎట్టి పరిస్థితిలోనూ దుర్మార్గుల వక్షాన మొగ్గకండి. మొగ్గారో మీక్కూడా నిప్పు (నరకాగ్ని) అంటుకుంటుంది. మరి అల్లాహ్ తప్ప మిమ్మల్ని ఆదుకునే వాడెవడూ ఉండడు. మీకు సహాయమూ అందదు”[సూరయె హూద్, ఆయత్113]

పై ఆయత్ లో “తర్కనూ” అనే పదం ఉంది. దాని అర్ధం భరోసా మరియు ఒక విషయం వైపు మక్కువ అది మక్కువ బలానికి కారణమౌతుంది అని నిఘంటువు రచయితలు చెప్పారు; ఎందుకంటే మనిషి బలమైన దానినే నమ్ముతాడు. అందుకే స్థంభాలను “రుక్న్” అంటారు. ఆ స్థంభాల మరియు గొడల పై గృహం నిలబడుతుంది.[2]

పై చెప్పబడిన వివరణ ద్వార దుర్మార్గులను నమ్మే లేదా సంబంధం కలిగి ఉండే వారు కూడా ఆ చర్యలలో భాగం కలిగినవరే అవారు. వారి పరిణామం కూడా అల్లాహ్ శాపమే; అంతేకాకుండా వారికి ఈ ప్రపంచంలో కూడా అభాగ్యం మరియు అపజయం తప్ప ఏదీ లభించదు; ఎందుకేంటే దుర్మార్గుడు బలాన్ని చేజిక్కుంచుకున్న తరువాత వాడి సహచరుల ను కూడా కనికరించడు.

దుర్మార్గుల పై నమ్మకం మరియు భరోసా కలిగి ఉండడమే అభాగ్యానికి కారణం అయినప్పుడు దుర్మార్గులకు సహాయం అందిచండం అంతకు మించి అభాగ్యాన్ని తీసుకోస్తుంది. మనిషిని నరకానికి తీసుకెళ్తుంది అందుకే ఖుర్ఆన్ స్పష్టంగా పాపం మరియు దుర్మార్గానికి సహకరించడాన్ని ఖండించింది. “పాపకార్యములలో, దౌర్జన్యపు పనుల్లో ఎవరితోనూ సహకరించకండి”.[సూరయె మాయిదహ్, ఆయత్02]

రివాయతులలో కూడా దుర్మార్గులను సహకరించే వారి కోసం కఠినమైన శిక్షలు ఉన్నాయి అని వివరించబడి ఉంది. చివరికి ఒక దుర్మార్గపు ఉత్తర్వులు లిఖించడానికి ఖలం లేదా సిరా ను దుర్మార్గుడికి అందజేయడం గురించి కూడా చెప్పబడి ఉంది.[3]  

ఇస్లాం దృష్టిలో దుర్మార్గం మరియు దౌర్జన్యం ఖండిచబడినవి. దుర్మార్గులకు ప్రళయం దినాన కఠిన శిక్ష ఉంటుంది అని ఖుర్ఆన్ సూచిస్తుంది, కేవలం వాళ్లకు మాత్రమే కాడదు వాళ్లని సహకరించినవారికి కూడా శిక్ష పడుతుంది ఆ సహాయం చిన్నదైనా సరే పెద్దదైనా సరే శిక్షించబడడం ఖచ్చితం; ఎందుకంటే ఈ సహచరుల వలనే దుర్మార్గులకు దౌర్జన్యపు పనులు చేయడానికి ధైర్యం వస్తుంది మరియు బలం ఏర్పడుతుంది.

అల్లాహ్ మనందరిని ఈ చెడు చర్య నుండి కాపాడుగాక!

రిఫరెన్స్
1. ఇలాంటి అంశాలను వివరిస్తున్న ఆయతులు: సూరయె సబా, ఆయత్42; సూరయె జుఖ్రుఫ్, ఆయత్65; సూరయె ఆలె ఇమ్రాన్, ఆయత్151; సూరయె ఇబ్రాహీమ్, ఆయత్22; సూరయె మర్యమ్, ఆయత్72; సూరయె అఅరాఫ్, ఆయత్41; సూరయే అంబియా, ఆయత్29; సూరయె షూరా, ఆయత్45.
2. అల్ మిస్బాహుల్ మునీర్ ఫీ గరీబిష్షర్హిల్ కబీర్ లిర్రాఫియీ, దారుల్ హిజ్రహ్, ఖుమ్, బీతా, చాప్2, పేజీ237.
3. మకారిమ్ షీరాజీ, నాసిర్, పయామె ఖుర్ఆన్, భాగం6, పేజీ285, తహయ్యె వ తన్జీమ్: జమ్యీ అజ్ ఫుజలాయె దారుల్ కుతుబ్ అల్ ఇస్లామియహ్, తహ్రాన్, 1386ష, చాప్9.

https://makarem.ir/main.aspx?typeinfo=42&lid=0&catid=27406&mid=417939

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8