అల్లాహ్ ఇచ్చిన గడువుతో భయపడండి!

సోమ, 02/12/2018 - 20:00

అల్లహ్ గడువు ఇస్తున్నాడంటే దాని అర్ధం ఒకటి మీరు పాపములను వీడి ఆ అల్లాహ్ దారిలో జీవించటానికి ఒక అవకాశం, లేదా ఆ అల్లాహ్ ను వీడి మీ ఇష్టానుసారం ఈ జీవితాన్ని పాపల బారిన పడి వృధా చేయటం.

అల్లాహ్ ఇచ్చిన గడువుతో భయపడండి!

ఇమాం అలి[అ.స]ల వారు ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు:
قال علیه السلام:''یابن آدم، اذا رایت ربک سبحانه یتابع علیک نعمه و انت تعصیه''
అనువాదం:ఓ ఆదం[అ.స] తనయుడా!నీ ప్రభువు వరుసగా నీపై తన అనుగ్రహాలను కురిపిస్తూ ఉండటం నువ్వు చూస్తున్నావు దాని తరువాత కూడ నువ్వు అపరాధములు చేస్తూనే ఉన్నావు,ఆ అల్లాహ్ కు భయపడు[లేకపోతే కఠినమైన శిక్ష అనుభవించక తప్పదు].
పాపాత్ములను మూడు వర్గాలుగా విభజించవచ్చు:
1. వారిలో మొదటి వర్గం వారు పాపములు చేస్తారు  దానితో పాటు మంచిపనులను కూడా చేస్తారు కానీ వారు చేసిన పాపములకు శిక్ష కూడా అల్లాహ్ ఈ లోకంలోనే విధిస్తాడు తద్వారా వారు పరిశుధ్ధంగా ఈ లోకాన్ని విడుస్తారు.
2. మరికొందరు ఈ లోకంలో చాల పాపాలకు పాల్పడతారు మరియు ఈ లోకంలో వారు తౌబా(ప్రాయశ్చితం) ద్వారా తమ పాపాలను క్షమింపజేసుకోమని అల్లహ్ ఆజ్ఞాపిస్తున్నాడు,ఒక వేళ వారు ఈ లోకంలో క్షమింపబడకపోతే పరలోకంలో తీవ్రమైన శిక్షకు అర్హులవుతారు.
3. మూడవ వర్గానికి చెందినవారు అవిధేయత మరియు అల్లాహ్ ఆజ్ఞలను దిక్కరించడంలో ఎటువంటి లోటును మిగల్చరు దీని ఫలితంగా అల్లాహ్ వారిని ఈ లోకంలోనే క్రమక్రమంగా శిక్షిస్తాడు ఎలాగంటే వారు అల్లాహ్ దయ,కరుణను కోల్పోతారు,అలాహ్ వారికి చాలా అవకాశాలను కల్పిస్తాడు,వారు కొరిన ప్రతీ వస్తువును ప్రసాదిస్తాడు తద్వారా వారిపై పాపముల యొక్క భారం పెరిగి అనుకోకుండా ఆ దేవుని యొక్క దండనం(శిక్ష) వారిని తన గుప్పెటిలో తీసుకుంటుంది[అదే సమయంలో వారు సుఖమైన జీవితాన్ని గడుపుతుంటారు].
దివ్య ఖురాన్ లో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:
وَٱلَّذِينَ كَذَّبُوا۟ بِـَٔايَٰتِنَا سَنَسْتَدْرِجُهُم مِّنْ حَيْثُ لَا يَعْلَمُونَ٭وَأُمْلِى لَهُمْ ۚ إِنَّ كَيْدِى مَتِينٌ٭
మా ఆయతులను అసత్యాలని ధిక్కరించిన వారిని మేము-వారికి తెలియకుండానే క్రమక్రమంగా (మా ఉచ్చులో) బిగిస్తూ పోతాము, వారికి కొంత గడువును ఇస్తున్నాను. నిశ్చయంగా నా వ్యూహం ఎంతో పకడ్బందీగా ఉంటుంది [అల్-ఆరాఫ్/182,183].

రెఫరెన్స్:
నెహ్జుల్ బలాఘా,హిక్మత్ నం:25,పయామె ఇమాం[అ.స] పేజీ నం:161.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16