తల్లిదండ్రులు

గురు, 01/19/2023 - 03:31

తల్లిదండ్రుల ప్రాముఖ్యత మరియు గొప్పతనాన్ని వివరిస్తున్న కొన్ని ఆయతులు మరియు హదీసుల వివరణ...

తల్లిదండ్రులు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

పరస్పరం ఒకరిని ఒకరు గౌరవించడం మంచి లక్షణం అని అందరికి తెలుసు కాని అందులో తల్లిదండ్రులను గౌరవించడం అతి ముఖ్యమైనది. ఇలా అని మనిషికి తెలుసు అయినప్పటికీ ఖుర్ఆన్ దీనిపై ప్రత్యక దృష్టి చూపించింది.
కొన్ని ఆయతులలో తల్లిదండ్రుల పట్ల గౌరవం యొక్క అంశాన్ని తౌహీద్ అంశం తరువాత సూచించబడి ఉంది.

అలాగే ఈ ప్రపంచంలో జన్మించి, జీవిస్తున్న ప్రతీ మనిషికి ఇతరుల పట్ల కొన్ని హక్కులూ మరియు బాధ్యతలు కలిగి ఉంటాడు.  మానవుల హక్కులలో దైవారాధన తరువాత మొట్టమొదటిది తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత. మనిషి పై ఉన్న బాధ్యతలన్నీంటి కన్నా మిక్కిలి బాధ్యత తన తల్లిదండ్రులకే ఉంటుందని చెప్పవచ్చు దానిని ఖుర్ఆన్ ఈ విధంగా వివరిస్తుంది:
وَقَضَىٰ رَبُّكَ أَلَّا تَعْبُدُوٓا۟ إِلَّآ إِيَّاهُ وَبِٱلْوَٰلِدَيْنِ إِحْسَٰنًا ۚ إِمَّا يَبْلُغَنَّ عِندَكَ ٱلْكِبَرَ أَحَدُهُمَآ أَوْ كِلَاهُمَا فَلَا تَقُل لَّهُمَآ أُفٍّۢ وَلَا تَنْهَرْهُمَا وَقُل لَّهُمَا قَوْلًۭا كَرِيمًۭا 
అనువాదం: నీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు: మీరు ఆయనను తప్ప మరొకరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా వ్యవహరించాలి. నీ సమక్షంలో వారిలో ఒకరుగాని, ఇద్దరుగానీ వృద్ధాప్యానికి చేరుకుని ఉంటే వారి ముందు (విసుగ్గా) “ఊహ్‌”   అని కూడా అనకు. వారిని కసురుకుంటూ మాట్లాడకు. పైగా వారితో మర్యాదగా మాట్లాడు [సూరయె ఇస్రా, ఆయత్23].
వేరే చొట ఈ విధంగా సెలవిస్తున్నాడు:
قُلْ تَعَالَوْا۟ أَتْلُ مَا حَرَّمَ رَبُّكُمْ عَلَيْكُمْ ۖ أَلَّا تُشْرِكُوا۟ بِهِۦ شَيْـًۭٔا ۖ وَبِٱلْوَٰلِدَيْنِ إِحْسَٰنًۭا ۖ وَلَا تَقْتُلُوٓا۟ أَوْلَٰدَكُم مِّنْ إِمْلَٰقٍۢ ۖ نَّحْنُ نَرْزُقُكُمْ وَإِيَّاهُمْ
అనువాదం: (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: ''రండి, మీ ప్రభువు మీపై నిషేధించిన వస్తువులు ఏవో మీకు చదివి వినిపిస్తాను. అవేమంటే; అల్లాహ్‌కు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల యెడల ఉత్తమరీతిలో మెలగండి. పేదరికపు భయంతో మీ సంతానాన్ని హతమార్చకండి. మేము మీకూ ఆహారం ఇస్తున్నాము, వారికీ ఇస్తాము(సూరయె అన్ఆమ్, ఆయత్151)
అల్లాహ్ ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా మెలగాలి.[సూరయె బఖరహ్, ఆయత్83] నీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు: మీరు ఆయనను తప్ప మరొకరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా వ్యవహరించాలి.[సూరయె ఇస్రా, ఆయత్23]
కొన్ని ఆయతులలో తల్లిదండ్రులు అవిశ్వాసులు అయినా వారి యెడల ఉత్తమంగా మెలుగు అని ఆదేశించబడి ఉంది. లుఖ్మాన్ సూరహ్ ఆయత్ 15లో అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “ఒకవేళ ఎవరినైనా నాకు భాగస్వాములుగా నిలబెట్టమని తల్లిదండ్రులు నీపై ఒత్తిడి తీసుకువస్తే మటుకు నువ్వు వారి మాట వినకు. ప్రపంచంలో మాత్రం వారి యెడల ఉత్తమరీతిలో మసలుకో”[సూరయె లుఖ్మాన్, ఆయత్15]
ఖుర్ఆన్ లో అల్లాహ్ తన ఎకేశ్వరవాదం(తౌహీద్) తరవాత తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలో వివరిస్తున్నాడు దీనీ ద్వారా దేవుని దగ్గర వారి యొక్క స్థానం ఎమిటో అర్ధమౌతుంది, ఏ విధంగానైతే దెవుని విధేయత యొక్క హక్కును పూర్తిగా పాటించలేమో అదె విధంగా తల్లిదండ్రుల పట్ల వారి కృతజ్ఙత యొక్క హక్కును ఎప్పటికీ పూర్తి చేయలేము.

తల్లిదండ్రుల ప్రాముఖ్యత మరియు గొప్పతనం మనకు మాసూమీన్(అ.స) యొక్క హదీసులలో కూడా కనిపిస్తాయి.

తల్లిదండ్రుల గొప్పతనం
తల్లిదండ్రుల గొప్పతనాన్ని వివరిస్తూ చాలా హదీసులు వివరించారు కాని ఇక్కడ వాటి నుండి కేవలం మూడు హదీసులను మీ కోసం వివరించడం జరిగింది.  
1. దైవప్రవక్త(స.అ) ఈ విధంగా సెలవిచ్చారు: ఎప్పుడైతే ప్రతీ శిష్టుడైన [మంచివాడైన] కొడుకు ప్రేమతో తన తల్లితండ్రుల వైపు చూస్తాడో, చూసిన ప్రతీ సారి అతనికి ఒక స్వీకరింపడిన పూర్తి హజ్జ్ యొక్క పుణ్యాన్ని ప్రతిఫలంగా ఇవ్వటం జరుగుతుంది.[1].
2. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఈ విధంగా సెలవిస్తున్నారు: "ఎవరైతే తనకు అన్యాయం చేసిన తల్లితండ్రుల వైపు ద్వేషంతో చూస్తారో ఆ అల్లాహ్ సన్నిధిలో అతని నమాజు స్వీకరింపబడదు."[2].
3. తల్లితంద్రుల పట్ల వ్యవహరణ శీలి గురించి ప్రస్థావిస్తూ ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఈ విధంగా ఉల్లేఖించారు: నీ కళ్ళను కేవలం ప్రేమ మరియు దయతో(వారిని చూడటానికి) తప్ప వారిపై నీ కళ్ళను ఎర్రజేయకు, మరియు నీ గొంతు శ్వరాన్ని వారి శ్వరం ముందు పెంచకు, వారికి ముందు నడవ వద్దు.[3].
4. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ద్వార ఉల్లేఖించబడిన హదీస్ లో ఇలా ఉంది: ఒక వ్యక్తి దైవప్రవక్త(స.అ) వద్దకు వచ్చి ఇలా అన్నాడు: నేను జిహాద్ ను ఇష్టపడతాను (కు వెళ్ళాలనుకుంటున్నాను), కాని నా తల్లి ఈ విషయంలో నిరాశ చెందుతుంది. దైవప్రవక్త(స.అ) ఇలా సమాధానమిచ్చారు: తిరిగి వెళ్ళి నీ తల్లితో ఉండు(జిహాద్ కు వెళ్లాల్సినవసరం లేదు) అల్లాహ్ సాక్షిగా ఒక రాత్రి నువ్వు నీ తల్లితో ఉంటే ఒక సంవత్సరం అల్లాహ్ మార్గంలో జిహాద్ కు మించిన పుణ్యాన్ని ప్రసాదిస్తాడు.[4]
5. దైవప్రవక్త(అ.స) ఇలా ఉల్లేఖించారు: తల్లిదండ్రుల ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోండి ఎందుకంటే 50 సంవత్సరాల దూరపు మార్గం వరకు చేరే స్వర్గపు సుగంధం ఎప్పటికీ తల్లిదండ్రుల ఆగ్రహానికి గురి అయినవారి వద్దక చేరదు.[5] అంటే స్వర్గంలో ప్రవేశమే కాదు దాని పరిశరాలకు కూడా చేరుకోలేరు.

రిఫరెన్స్
1. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం74, పేజీ73.
2. కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, ఉసూలే కాఫి, భాగం4, పేజీ50.
3. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం74, పేజీ79.
4. నరాఖీ, మొహమ్మద్ మహ్దీ, జామివుస్సఆదాత్, భాగం2, పేజీ260.
5. నరాఖీ, మొహమ్మద్ మహ్దీ, జామివుస్సఆదాత్, భాగం2, పేజీ257.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12