పిల్లల శిక్షణ తల్లిదండ్రుల బాధ్యత

గురు, 01/19/2023 - 05:11

పిల్లల శిక్షణ తల్లిదండ్రుల బాధ్యత అని వివరిస్తున్న హదీసులు మరియు ఎలా పెంచాలి అన్న విషయాల గురించి సంక్షిప్త వివరణ..

పిల్లల శిక్షణ తల్లిదండ్రుల బాధ్యత

పిల్లలను పెంచడం మరియు పొషించడం తల్లితండ్రుల కర్తవ్యం అయితే దానికి మించిన కర్తవ్యం వారికి మంచి అలవాట్లను మరియు మంచి తీరును అలవర్చడం. ఎలగైతే పువ్వుకు అది పూసే సమయంలో దాని రక్షణ ఎంత అవసరమో అలాగే బాల్యంలోనే పిల్లలను చెడు అలవాట్ల బారిన పడకుండా కాపాడుకోవడం కూడా అంతే అవసరం.
ప్రతీ చిన్న విషయంలో శ్రధ్ధ వహించే మానవుడు అతి గారాభంగా మరియు ప్రాణానికి ప్రాణంగా పెంచుకొనే తన పిల్లల విషయంలో అశ్రధ్ధగా లేదా నిర్లక్ష్యంగా ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇస్లాంలో పిల్లల పోషణ, శిక్షణ గురించి చాల ప్రాముఖ్యత ఉంది, మహప్రవక్త ఆ ప్రాముఖ్యతను వివరిస్తూ ఇలా ఉపదేశించారు: “మీ పిల్లలను గౌరవించండి మరియు వారికి మంచి శిక్షణ ఇవ్వండి తద్వార మీరు (దైవ) క్షమాభిక్షకు అర్హులు అవుతారు”[1].
మంచి శిక్షణ అంటే వారిని ఆలోచించే అవకాశం ఇవ్వకుండా ఏదో నాలుగు మంచి మాటలు మరియు నాలుగు ఆచారాలను వారికి అలవాటు చేయడం కాదు వారికి  స్వేచ్చను కలిపించి, వారు అడిగే ప్రతీ ప్రశ్నకు విసుగుకోకుండా సమాధానం చెప్పాలి, దైవప్రవక్త(స.అ) ఇలా ఉపదేశించారు: “జన్మించే ప్రతి సిశువు స్వాభావికంగా ఎకేశ్వరవాదిగా జన్మిస్తాడు కాని వారి తల్లిదండ్రులు వారిని యహూదీగానో మరియు ఒక క్రైస్తవునిగానో మార్చేస్తారు”[2].
ఇమామ్ అలీ(అ.స) ఇలా ఉల్లేఖించెను: “యుక్త వయస్సుకు సమీపించిన పిల్లల హృదయాలు ఖాళీ భూమి (పంటకు సహకరించే భూమి) లాంటివి వాటిలో ఏ విత్తనాన్ని నాటినా దానిని అవి స్వీకరిస్తాయి.”[3].
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స)ఇలా సెలవిచ్చారు: “మీరు మీ పిల్లలకు ఇచ్చే అత్యుత్తమ ఆస్తి మీ డబ్బు లేదా మీ సంపద కాదు! ఎందుకంటే సంపద కొంత కాలం తరువాత నసించిపోతుంది కానీ మంచి శిక్షణ ఎప్పటికీ నిలిచిపోతుంది” [4].

ఇప్పుడు పిల్లల శిక్షణ విషయంలో కొన్ని అంశాలు మీకోసం:

1. నెగెటీవ్ భావోద్వాగాలను లోనవ్వకుండా పెంచడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలు కూడా పెద్దవాళ్ల వలే నెగెటీవ్ భావోద్వాగాలకు గురి అవుతారు. ఉదా: కోపం, ద్వాషం, బిడియం, ఈర్ష్య మొ..., వీటిని కంట్రోల్ లో పెట్టడం మరియు వాటి గురించి తెలియపరచడం తల్లిదండ్రుల బాధ్యత.

2. తల్లిదండ్రులు తమ పిల్లలను జీవితంలో ఎదురు పడే సమస్యలను మరియు కష్టాలను ఎలా ఎదురుకోవాలి అన్న విషయాలు నేర్పాలి.

3. తల్లిదండ్రులు తమ పిల్లలతో సమయం గడపి, పిల్లలతో స్నేహంగా ఉండాలి, దాంతో వాళ్ళు రిలీఫ్ గా ఫీల్ అవుతారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తమ నుండి నేర్చుకొనే అవకాశాన్ని ఇవ్వాలి. పిల్లల నుండి తల్లిదండ్రులు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడప్పుడు పిల్లలుగా మారి వారితో ఆడాలి.

4. తల్లిదండ్రులు నిత్యం తమ పిల్లలకు నువ్వు మా కోసం చాలా ప్రత్యేకమైన మరియు ముఖ్యమైనవాడివి అని గుర్తు చేస్తూ ఉండాలి. పిల్లలకు ఏమి తెలుస్తుంది అని అనుకోవచ్చు కాని వారికి పెద్దవారి కంటే ఎక్కువగా అర్ధం అవుతుంది.

5. పిల్లలకు ఇంటి పనులలో సహాయం చేసేవిధంగా శిక్షణ ఇవ్వాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు చేసే పనులను నేర్పిస్తే, పెద్దవాళ్లు అయినప్పుడు ఒక బాధ్యతగల వ్యక్తిగా మారుతాడు. కాని గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే వారు ఆ పనులతో అలసిపోకూడదు లేదా ఆ పని కష్టంగా ఉండకూడదు.

6. ప్రపంచం గురించి అవగాహన ఇవ్వాలి. పిల్లలు ఈ ప్రపంచం తాను, తన మిత్రులతో కూడి ఉంది అని భావిస్తారు. వారు చిన్నప్పటి నుంచే తెలుసుకోవాలి ఈ ప్రపంచం యొక్క యదార్థమేమిటి, అది ఎంత పెద్దది, మనుషులే కాదు ఈ భూమిపై రకరకాల జంతువులు, పక్షులు వేరే జీవాలు ఉన్నాయి అని తెలియపరచాలి. వాళ్లకు చిత్రాలు, పుస్తకాలు, జ్ఞానం మొదలగు వాటి గురించి తెలియపరిచి వారు ఊహించుకునే ప్రపంచం కన్నా బయట ప్రపంచం చాలా పెద్దదని తెలియజేయాలి.

7.  తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుండే ఆత్మగౌరవం మరియు ఎదుటివారి పట్ల గౌరవం, ఇతరులను నష్టం పరచకూడదు, కష్టం కలిగించకూడదు అన్న విషయాలు నేర్పించాలి. వారికి భావోద్వాగాల మరియు ప్రేమను వ్యక్తం చేసే విషయంలో అతివృష్టి మరియు అనావృష్టికి గురి కాకూడదు అని శిక్షణ ఇవ్వాలి.

8. నిత్యం తల్లిదండ్రులు తమ పిల్లాడ్ని తమతోనే ఉండే విధంగా పెంచ కూడదు, దాంతో పిల్లాడు మీరు లేకుండా ఏ పనీ చేయలేడు. సమాజంతో పాటు కలిసి నడిచేందుకు వాళ్లకు అవకాశం కలిపించాలి. తల్లిదండ్రులు లేకపోయినా సరే జీవిచగలిగే ధైర్యాన్ని ఇవ్వాలి.

9. తల్లిదండ్రులు జీవితం పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. తల్లిదండ్రులు ఇలా ఉండాలి అని చెప్పడం కన్నా పిల్లలు తమ తల్లిదండ్రుల జీవిత విధానాన్ని చూసి పిల్లలు నేర్చుకోవడమే ప్రభావితమైనది.

10. పిల్లలతో తల్లిదండ్రుల వ్యవహారం చాలా సున్నితంగా ఉండాలి, వారికి మనశాంతి కలిగేలా ఉండాలి. తప్పు చేయగానే వెంటనే వ్యతిరేకించకూడదు. వారి పై అరవకూడదు. వారిని కోపగించుకోకూడదు.

11. నిబంధనల మరియు వాటిని అమలు పరిచే విషయంలో నిలకడగా ఉండాలి. మీరు చెప్పిన మాటపై నిలబడకపోయినా లేదా చెప్పింది చెప్పిన విధంగా చేయకపోయినా పిల్లలు కూడా మీ మాటకు విలువ ఇవ్వరు మరియు భరోసా తగ్గుతుంది.

12. తల్లిదండ్రులు తమ పిల్లలతో పనికి రాని మాటలు మాట్లాడకూడదు, వారితో వ్యర్థ సంభాషణ చేయకూడదు.[5]

రిఫరెన్స్
1. మొహమ్మదీ రై షహ్, మొహమ్మద్, మీజానుల్ హిక్మహ్, భాగం1, పేజీ103.
2. ఫల్సఫీ, మొహమ్మద్ తఖీ, అల్-హదీస్, భాగం2, పేజీ377.
3. ఇబ్నె షొఅబహ్ హర్రానీ, తొహ్ఫుల్ ఉఖూల్, పేజీ67.
4. మొహమ్మదీ రై షహ్, మొహమ్మద్, మీజానుల్ హిక్మహ్, భాగం1, పేజీ101.
5. https://btid.org/fa/news/170891 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21