హజ్రతె అబ్బాస్ యొక్క ఉత్తమ స్థానం

బుధ, 02/22/2023 - 12:01

హజ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం ద్వార హజ్రత్ అబుల్ ఫజ్లిల్ అబ్బాస్(అ.స) యొక్క ఉత్తమ స్థానాలు...

హజ్రతె అబ్బాస్ యొక్క ఉత్తమ స్థానాలు

అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) కుమారుడూ, సయ్యదుష్షుహదా అయిన ఇమామ్ హుసైన్[అ.స] సొదరుడూ, ఆషూరా రోజు హుసైనీ సైన్యానికి అధిపతీ, ఫాతెమా జహ్రా(అ.స) తన బిడ్డగా భావించేటు వంటి ప్రవీణత గలవారూ, వీరుల వంశానిక చెందిన ఉమ్ముల్ బనీన్ లాంటి పవిత్ర మాతృమూర్తి జన్మనిచ్చినటువంటి వీరుడూ, కర్బలా యుద్ధభూమి పై ఇమామ్ మరియు నాయకుడి పట్ల విధేయతను చాటి చూపిన హజ్రత్ అబుల్ ఫజ్లిల్ అబ్బాస్(అ.స) యొక్క జన్మదిన శుభాకాంక్షలు.
“అబ్బాస్” అనగా ఇతర సింహాలు చూసి భయపడేటువంటి సింహం. ఫాతెమా జహ్రా(అ.స) మరణాంతరం ఇమామ్ అలీ(అ.స) ఉమ్ముల్ బనీన్(అ.స) తో వివాహం చేసుకున్నారు. ఆ దంపతుల మొదటి సంతానమే హజ్రత్ అబ్బాస్(అ.స). ఇతను హిజ్రత్ యొక్క 26వ సంవత్సరం, షాబాన్ మాసం 4వ తారీఖున మదీనలో జన్మించారు. ఇతనికి ముగ్గురు సొదరులు, అందరూ కర్బలా యుద్ధంలో ఇస్లాం మరియు మానవత్వ విలువల రక్షణకై తమ ప్రాణాలను అర్పించుకున్నారు. తండ్రి అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) మరణించినప్పుడు హజ్రత్ అబ్బాస్(అ.స) వయసు 14 సంవత్సరాలు, మరియు కర్బాలలో 34 సంవత్సరాలు. ఇతను కర్బలా యుద్ధంలో ఇమామ్ ఆజ్ఞను అనుచరిస్తూ ఇస్లాం రక్షణకై తన ప్రాణాలు అర్పించారు.[1].

హజ్రత్ అబుల్ ఫజ్లిల్ అబ్బాస్(అ.స) కలిగి ఉన్న గొప్ప స్థానం గురించి తెలుసుకోవాలంటే వారిని ఉద్దేశించి హజ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) నుండి ఉల్లేఖించబడ్డ ఈ ఒక్క వాక్యం చాలు: “నేను సాక్ష్యమిస్తున్నాను; మీ(హజ్రతె అబ్బాస్) సమర్పణ, మీ నిర్ధారణ, మీ నిబద్ధత మరియు మీ స్వచ్చత పట్ల, దైవప్రవక్త(స.అ) స్మారక చిహ్నం కోసం”[2] ఈ వాక్యం ద్వార జనాబె అబ్బాస్(అ.స) యొక్క నాలుగు గొప్ప ప్రత్యేక స్థానాలు తెలుస్తున్నాయి:
1. వారి సమర్పణ స్థానం
అమీరుల్ మొమినీన్(అ.స) వచనానుసారం “ప్రపంచం కష్టాలతో ముడిపడి ఉంటుంది”[3] కష్టాలు వచ్చినపుడు వాటిని ఎదురుకోవడానికి కొన్ని అధ్యాత్మిక చర్యలు ఉన్నాయి ఉదాహారణకు తవక్కుల్(అల్లాహ్ పై నమ్మకం), సబ్ర్(సహనం), రిజా(అంగీకారం) మరియు తస్లీమ్(సమర్పణ). వీటిలో తస్లీమ్ యొక్క స్థానం మిగతావాటికి మించినది.
తవక్కుల్ అనగా మనిషి యొక్క శక్తి అల్లాహ్ శక్తిలో కలిసిపోవడం. రిజా అనగా మనిషి యొక్క ఇష్టం అల్లాహ్ ఇష్టంలో కలిసిపోవడం. తస్లీమ్ అనగా మనిషి యొక్క జ్ఞానం అల్లాహ్ జ్ఞానంలో కలిసిపోవడం.[4] మరో విధంగా చెప్పాలంటే; తవక్కుల్ స్థానంలో మనిషి తన శక్తిని మరియు ఇష్టాన్ని తనవి అని భావిస్తాడు, కాని ఆ శక్తి మరియు ఇష్టాన్ని తన ప్రతినిధికి(వకీలుకు) అర్పిస్తాడు(అనగా అల్లాహ్ ను తన వకీలును చేసి అంతా ఆయన మీద వదిలేస్తాడు).
రిజా స్థానంలో, మనిషి శక్తిని మరియు ఇష్టాన్ని తనవి అని భావించడు, అల్లాహ్ తరపు నుండి ఏది సంభవిస్తే దానిని సంతోషంగా స్వీకరిస్తాడు, ఏమాత్రం అఇష్టతను స్మరించడు, అంతేకాకుండా సంతోషంగా పూర్తి అంగీకారంతో వాటిని భరిస్తాడు.
సబ్ర్ మరియు రిజా స్థానాలలో గల బేధం ఏమిటంటే సబ్ర్ స్థానంలో మనిషి చేదును గ్రహిస్తాడు కాని పుణ్యం కోసం దానిని భరిస్తాడు. కాని రిజా స్థానంలో మనిషి ఎటువంటి చేదును అనుభూతించడు, కష్టాలను అల్లాహ్ యొక్క దయగా భావిస్తాడు, దాన్ని అతడి పట్ల అల్లాహ్ యొక్క ప్రేమగా భావిస్తాడు. 
తస్లీమ్ యొక్క స్థానం, రిజా యొక్క స్థానానికి మించినది, ఎందుకంటే రిజా స్థానంలో అల్లాహ్ ఏదైతే నిర్ధారించాడో ప్రకృతికీ స్వభావానికి అనుకూలంగా ఉంటుంది. కాని తస్లీమ్ స్థానంలో మనిషి తన కోసం స్వభావం యొక్క అనుకూలత మరియు వ్యతిరేకతను చూసుకోడు, అంటే స్వయాన్ని చూసుకోడు, నా ఇష్టం అల్లాహ్ ఇష్టం అని చెప్పడానికి, అతడి వద్ద ఉన్నదంతా అల్లాహ్ కు సమర్పిస్తాడు. హజ్రత్ అబుల్ ఫజ్లిల్ అబ్బాస్అ(స.అ) తస్లీమ్ స్థానం కలిగి ఉన్నవారు.
2. వారి నిర్ధారణ స్థానం:
సమర్పణ తరువాత వచ్చే స్థానం తస్దీఖ్(నిర్ధారణ) స్థానం. మనిషి ఎప్పుడైతే సమర్పణ స్థానానికి చేరుకుంటాడో అతడు అనుమతిగల వ్యక్తి అవుతాడు. అప్పుడతను విలాయత్ కలిగివున్నవారి(ఇమామ్) నిర్ధారణ మరియు యదార్థాన్ని గ్రహించే దశకు చేరుకుంటాడు. ఆషూరా సంఘటనలో, కొందరు ఇమామ్ హుసైన్(అ.స) యొక్క విప్లవాన్ని ఉద్దేశించి తమ ఆలోచనలను మరియు అభ్యంతరాలను వ్యక్తం చేశారు[5] కాని ఏ ఒక్క గ్రంథంలో కూడా హజ్రత్ అబ్బాస్(అ.స) ఇమామ్ కు వ్యతిరేకంగా నోరు విప్పి ఏదైనా చెప్పినట్లు లిఖించబడి లేదు. దీనినే తస్దీఖ్ స్థానం అని అంటారు, అనగా ఇమామ్ ఏది చెబితే అది నిజం అని భావించడం.
3. వారి నిబద్ధత స్థానం
హజ్రత్ అబుల్ ఫజ్లిల్ అబ్బాస్(అ.స) చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండడంలో, చేసిన బైఅత్ కు న్యాయం చేయడంలో అగ్రస్థానం కలిగివున్నవారు. కర్బలాలో శత్రుసైన్యం తరపు నుండి రెండు సార్లు రక్షణాపత్రం వచ్చినప్పటికీ,[6] రెండు సార్లూ నిర్ణయాత్మకంగా రద్దు చేశారు. అలాగే ఆషూరా ముందు రాత్రి ఇమామ్ హుసైన్(అ.స) తన బైఅత్ ను తమ సహచరుల పైనుండి ఎత్తుకున్న తరువాత అందరి కన్నా ముందు తన నిబద్ధతను “మీకు సహాయం చేయకుండా వెళ్ళిపోయి మీ తరువాత ఎలా ప్రాణాలతో ఉండగలము? అల్లాహ్ మీ తరువాత మమ్మల్ని ప్రాణాలతో చూడదలుచుకోడు”[7]
4. వారి స్వచ్ఛత స్థానం:
జియారత్ లో వచ్చిన పదం నుస్హ్(نُصح) అనగా ఖులూస్(స్వచ్ఛత, చేసే చర్య కేవలం అల్లాహ్ కోసం అయి ఉండడం)[8]. హజ్రత్ అబ్బాస్(అ.స) తన ఇమామ్ యొక్క ఆజ్ఞను పాటించడంలో స్వచ్చత కలిగి ఉండేవారు. ఆషూరా రోజు నీరు తీసుకొని రమ్మని ఆదేశించినపుడు హజ్రతె అబ్బాస్(అ.స) అనుకుంటే నీరు తీసుకొని రాకపోవడానికి చాలా విధాలుగా సమర్థతలను ప్రదర్శించగలరు కాని ఇమామ్ ఆజ్ఞను పాటించడానికై పూర్తి బలాన్ని ఉపయోగించారు.
ఈ తస్లీమ్, తస్దీఖ్, వఫా మరియు ఇఖ్లాస్ స్థానముల వల్ల హజ్రత్ అబ్బాస్(అ.సో) యొక్క స్థానం ఇతర వీరుల స్థానానికి మించింది. వారి గురించి ఇమామ్ సజ్జాద్ ఇలా అన్నారు: “అల్లాహ్ వద్ద అబ్బాస్(అ.స) యొక్క స్థానాన్ని ప్రళయదినాన ఇతర వీరులు చూసి అసూయ చెందుతారు”[9]

రిఫరెన్స్
1. జవాదె ముహద్దిసీ, ఫర్హంగె ఆషూరా, పేజీ294, నష్రె మారూఫ్, ఖుమ్, 1374.
2. షేఖ్ సదూఖ్, కామిల్ అల్ జియారాత్, పేజీ256, దారుల్ ముర్తజవియహ్, నజఫ్, 1356ష.
3. తమీమీ ఆముదీ, గురరుల్ హికమ్, పేజీ104, దారుల కితాబిల్ ఇస్లామీ, ఖుమ్, 1410ఖ.
4. ఖాజా నసీరుద్దీనె తూసీ, ఆగాజ్ వ అంజామ్, పేజీ63-64, విజారతె ఇర్షాద్, తహ్రాన్, 1374ష.
5. అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, భాగం44, పేజీ364, దారు ఇహ్యాయి అల్ తురాసిల్ అరబీ, బీరూత్1403ఖ.
6. అబూ మఖ్నఫ్, వాఖెఅతుత్తప్, పేజీ189, జామిఅహ్ ముదర్రిసీన్, ఖుమ్, 1417ఖ.
7. షేఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, భాగం2, పేజీ91, ముహఖ్ఖిఖ్; ముఅస్ససయే ఆలుల్ బైత్ అ.స, కొంగురయె షేఖ్ ముఫీద్, ఖుమ్, 1413ఖ.
8. ఖరషీ బన్నాయి అలీ అక్బర్, ఖామూసె ఖుర్ఆన్, భాగం7, పేజీ71, దారుల్ కుతుబిల్ ఇస్లామియ, తహ్రాన్, 1412ఖ.
9. షేఖ్ సదూఖ్, అమాలీ, పేజీ463, కితాబ్చీ, తహ్రాన్, 1376ష.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20