దైవప్రవక్త(స.అ) వచనానుసారం అహ్లెబైత్(అ.స) తో సహవాసం విముక్తికి కారణం...

దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: నా అహ్లెబైత్ నూహ్ నౌక లాంటివారు; అందులో ఎక్కినవాడు విముక్తి చెందుతాడు మరియు దానిని ధిక్కరించినవాడు నాశనం అవుతాడు.
హజ్రత్ అబుల్ ఫజ్లిల్ అబ్బాస్(అ.స)
అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) కుమారుడూ, సయ్యదుష్షుహదా అయిన ఇమామ్ హుసైన్[అ.స] సొదరుడూ, ఆషూరా రోజు హుసైనీ సైన్యానికి అధిపతీ, ఫాతెమా జహ్రా(అ.స) తన బిడ్డగా భావించేటు వంటి ప్రవీణత గలవారూ, వీరుల వంశానిక చెందిన ఉమ్ముల్ బనీన్ లాంటి పవిత్ర మాతృమూర్తి జన్మనిచ్చినటువంటి వీరుడూ, కర్బలా యుద్ధభూమి పై ఇమామ్ మరియు నాయకుడి పట్ల విధేయతను చాటి చూపిన హజ్రత్ అబుల్ ఫజ్లిల్ అబ్బాస్(అ.స) యొక్క జన్మదిన శుభాకాంక్షలు.
హజ్రత్ జైనుల్ ఆబెదీన్(అ.స)
ప్రజల సన్మార్గం కోసం అల్లాహ్ తరపు నుండి నిశ్చయించబడ్డ దైవప్రవక్త(స.అ) నాలుగొవ ఉత్తరాధికారీ, దైవారాధకుల అలంకణా, కర్బలా వీరుల లక్ష్యం అంతం కాకుండా అన్ని విధాలుగా ప్రయత్నం చేసినవారూ, అతి దుర్మార్గుల సభలో కూడా కర్బలా లక్ష్యాన్ని వివరిస్తూ ఉపన్యాసం ఇచ్చిన మహావీరుడూ, ఇస్లాం రక్షణ కోసం ఎటువంటి కష్టం వచ్చినా వెనుకడుగు వేయకుండా ముందుకు దూసుకొనిపోయేవారూ, కత్తుల ప్రమేయం లేకుండా కేవలం దుఆలతో శత్రువుల ప్రయత్నాలను విఫలం చేసినవారూ, తరువాతి కాలంలో ఇస్లామీయ విశ్వవిధ్యాలయాలు స్థాపించే విధంగా సమాజాన్ని తీర్చిదిద్దిన మాహా మూర్తి అయిన హజ్రత్ జైనుల్ ఆబెదీన్(అ.స) జన్మదిన సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు.
వీరిద్దరి నాయకుడు అయిన హజ్రత్ ఇమామ్ హుసైన్ ఇబ్నె అలీ(అ.స) యొక్క జన్మదిన సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు.
వ్యాఖ్యానించండి