ఇమామ్ హసన్(స.అ)

శుక్ర, 04/07/2023 - 18:28

ఇమామ్ హసన్(స.అ) యొక్క ఇమామత్ పదవీ మరియు వారి ప్రతిష్టత ఇరు వర్గాల వారి హదీసులనుసారం...

ఇమామ్ హసన్(స.అ)

అల్లాహ్ తరపు నుండి నియమించబడ్డ దైవప్రవక్త(స.అ) యొక్క రెండవ ఉత్తరాధికారియే ఇమామ్ హసన్(అ.స). తండ్రి ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) తల్లి ఫాతిమ బింతె ముహమ్మద్(స.అ). పవిత్ర మాసం రమజాన్ 15వ తారీఖు, హిజ్రీ యొక్క 3వ ఏట మదీనహ్ లో జన్మించారు. అతని పేరు దైవప్రవక్త[స.అ], అల్లాహ్ ఆదేశం ప్రకారం “హసన్” అని పెట్టారు. తౌరైత్(యూదుల పవిత్ర గ్రంధం)లో వారి పేరు “షబ్బర్”. హసన్ మరియు షబ్బర్ పదాలు వేరైనా అర్ధం ఒక్కటే.
వారి తండ్రి హజ్రత్ అలీ(అ.స) మరణాంతరం అనగా రమజాన్ నెల హిజ్రత్ యొక్క 40వ సంవత్సరం నుండి సఫర్ నెల 50వ హిజ్రీ వరకు వారి ఇమామత్ పదవీ కాలం, అనగా 10 సంవత్సరాలు.[1]

వారి ఇమామత్ పదవి
దైవప్రవక్త(స.అ) తమ చివరి హజ్ సమయంలో హజ్రత్ అలీ(అ.స)ను తమ తరువాత తమ ఖలీఫాగా నియమించిన విషయం ఎంత సత్యమో, హజ్రత్ ఇమామ్ హసన్(అ.స)ను తమ రెండవ ఖలీగా వెల్లడించడం కూడా అంతే సత్యం. కాని ఏ విధంగా ఖిలాఫత్
ను ఇమామ్ అలీ(అ.స) నుండి చేదించారో అదే విధంగా ఇమామ్ అలీ(అ.స) పెద్ద కుమారుడైన ఇమామ్ హసన్(అ.స) నుండి కూడా ఆ ఖిలాఫత్‌ను చేదించి ముఆవియా అను ఒక వ్యక్తిని ఖలీఫాగా ఎన్నుకున్నారు.
ఇమామ్ హసన్(అ.స) తమ అనుచరుల సలహాల ద్వార ముఆవియాతో యుద్ధానికి సిధ్ధమైయ్యారు. కాని వారిని ముఆవియా ధన ఆశ చూపించి తన వైపు మళ్ళించుకున్న విషయాన్ని పసిగట్టిన ఇమామ్ హసన్(అ.స) యుద్ధానికి బదులు సంధి చెయ్యడానికి తయ్యారయ్యారు. ఆ సంధి కోసం ఒక పత్రము మీద కొన్ని షరతులు వ్రాసి ముఆవియాకు ఇవ్వడం జరిగింది, ముఆవియా ఆ పత్రములో వున్న షరతులకు అంగీకరిస్తు సంతకము చేయడం జరిగింది. కాని ముఆవియా వాటి పై అమలు చేయలేదు.[2]

ఇమామ్ హసన్(అ.స) సంధీ పత్ర ముఖ్యాంశం
ఇమామ్ హసన్(అ.స) హక్కును బలవంతంగా తీసుకున్న ముఆవియాతో యుద్దానికి సిధ్ధమైన ఇమామ్ హసన్(అ.స) అతని అనుచరులను ముఆవియా ధన ఆశ చూపించి తన వైపు మళ్ళించు కున్నాడు అని గ్రహించి యుద్దానికి బదులు కొన్ని షరత్తులతో సంధి చెయ్యడానికి తయ్యారయ్యారు.
ఆ పత్రములో ఏన్నో ముఖ్యమైన షరతులు వ్రాయబడ్డాయి కాని ఇక్కడ ఒకేఒక్క షరతును వ్రాయదలుచుకున్నాము. అదేమిటంటే “ముఆవియా మరణాంతరం ఖిలాఫత్(పదవి), ఇమామ్ అలీ(అ.స) యొక్క వారసులకే చెందెను”.
కాని ఇమామ్ హసన్(అ.స) హిజ్రీ యొక్క 50వ ఏట అంటే ముఆవియా కంటే పది సంవత్సరాలు ముందే మరణించారు. ఈ విధంగా చూసినట్లైతే 60వ ఏట ముఆవియా చనిపోయిన తరువాత ఆ ఖిలాఫత్ పదవి ఇమామ్ హసన్(అ.స) సోదరుడు, ఇమామ్ హుసైన్(అ.స)కు దక్కాలి, కాని ముఆవియా తన కుమారుడు యజీద్
ను తన తరువాత ఖలీఫాగా నియమించాడు.(3)

ఇమామ్ హసన్(అ.స) ప్రతిష్టత ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) మాటల్లో
ఇమామ్ సాదిఖ్(అ.స), ఇమామ్ హసన్(అ.స) యొక్క కొన్ని ప్రతిష్టతల వివరణలో ఇలా ప్రవచించారు:
"...أن الحسن بن علي بن أبي طالب (عليه السلام) كان أعبد الناس في زمانه، وأزهدهم وأفضلهم، و"
అనువాదం: నిస్సందేహముగా అలీ ఇబ్నె అలీతాలిబ్(అ.స) కుమారుడు హసన్(అ.స) తమ కాలంలో అందరికన్న ఎక్కువగా భక్తిప్రార్థనలు చేసేవారు, ధర్మనిష్ఠగలవారు మరియు ఉత్తములు. మరియు వారు హజ్ చేయడం కోసం కాలినడకతో వెళ్ళేవారు, అప్పుడప్పుడు చెప్పులు లేకుండా నడిచేవారు. ఎల్లప్పుడూ అల్లాహ్ ను స్మరిస్తూ ఉండేవారు. ప్రతీ పని అల్లాహ్ కోసమే చేసేవారు. వారు అల్లాహ్ గ్రంథంలో "يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا" (ఓ విశ్వాసులారా!) అని చదివినప్పుడల్లా ఇలా అనే వారు.. "لبّيك اللّهم لبّيك"  (లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్)[4]

ఇమామ్ హసన్(అ.స) ప్రతిష్టత అహ్లె సున్నత్ గ్రంథాలలో
సహీ బుఖారీలో అబూబక్ర్ ఉల్లేఖనం ఇలా ఉంది:
رايت النبي صلي الله عليه و آله علي المنبر والحسن بن علي معه وهو يقبل علي الناس مرة و ينظر اليه مرة و يقول ابني هذا سيد 
అనువాదం: నేను దైవప్రవక్త(స.అ)ను చూశాను, అప్పుడతను పీఠం పై ఉన్నారు, మరి హసన్ ఇబ్నె అలీ[అ.స] కూడా వారి ఒళ్ళో ఉన్నారు, వారు ఒకసారి ప్రజలవైపు మరో సారి హసన్(అ.స) వైపు చూస్తూ ఇలా అనే వారు: నా ఈ కుమారుడు నాయకుడు, అధిపతి.[5].
సీవ్తీ తన చరిత్ర గ్రంథంలో ఇలా వ్రాశారు:

 كان الحسن رضي الله عنه له مناقب كثيرة، سيدا حليما، ذا سكينة و وقار و حشمة، جوادا، ممدوحا 
అనువాదం: హసన్ ఇబ్నె అలీ(అ.స) చాలా సద్గుణాలు కలిగి ఉండేవారు. వారు గొప్పమనిషి, సహనశీలి, శుద్ధమైనవారు, ధర్మాత్ములు. ప్రతీ మంతి గుణానికి క్రేంద్రంగా ఉండేవారు.[6]
ఇది ముమ్మాటికి నిజం దైవప్రవక్త(స.అ) యొక్క పెద్ద మనవడు ఇలాగే ఉండాలిమరి. ఎందుకంటే ధర్మనిష్ఠగలవారు మంచి సద్గుణాలు కలిగి ఉంటారు. ఇమామ్ అలీ(అ.స) ఇలా ప్రవచించారు: فالمتقون هم اهل الفضائل 
అనువాదం: ధర్మనిష్ఠగల వారే సద్గుణాలు కలిగి ఉన్నవారు.[7].

రిఫరెన్స్
1.షేఖ్ అబ్బాసె ఖుమ్మి, ముంతహల్ ఆమాల్, ఇమామ హసన్(అ.స)కు సంబంధించిన అధ్యాయం.
2. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం44, పేజీ147, తహ్రాన్, అల్ మక్తబతుల్ ఇస్లామియాహ్, 1393 హిజ్రీ.
3. ఎఅలాముల్ వరా బిఅఅలామిల్ హుదా, భాగం1, పేజీ414.
4. అమాలీ, షేఖ్ సదూఖ్, తహ్ఖీకు ఖిస్మి అల్ దిరాసాత్ అల్ ఇస్లామియహ్, భాగం1, పేజీ244, ముఅస్ససతుల్ బెఅసహ్.
5. మొహమ్మద్ ఇబ్నె ఇస్మాయీల్ బుఖారీ, అల్ జామె అల్ సహీ, భాగం5, పేజీ31 బీరూత్, దారు ఎహ్యాయిత్తురాస్ అల్ అరబీ.
6. సీవ్తీ, తారీఖుల్ ఖులఫా, పేజీ189, బగ్దాద్, మక్తబతుల్ మస్నా, 1383హిజ్రీ.
7. నెహ్జుల్ బలాగహ్, ఖుత్బహ్193.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18