జనాబె ఖాసిమ్ ఇబ్నె హసన్[అ.స]

సోమ, 04/23/2018 - 17:56

దైవప్రవక్త[అ.స] రెండవ ఉత్తరాధికారి మరియు ఇమామ్ అలీ[అ.స] యొక్క రెండవ కుమారుడు అయిన ఇమామ్ హసన్[అ.స] యొక్క కుమారడు "ఖాసిమ్[అ.స]" 

జనాబె ఖాసిమ్ ఇబ్నె హసన్[అ.స]

కర్బలాలో ఆషూరా రోజు జరిగిన యుద్ధంలో వీరమరణ చెందిన యువకులలో ఒకరు దైవప్రవక్త[అ.స] రెండవ ఉత్తరాధికారి మరియు ఇమామ్ అలీ[అ.స] యొక్క పెద్ద కుమారుడు అయిన ఇమామ్ హసన్[అ.స] యొక్క కుమారడు "ఖాసిమ్[అ.స]". రేపు ఆషూరా అనగా ఆ రోజు రాత్రి "మృత్యువు తేనే కన్న తీయనిది" అని చెప్పింది ఆ యువజ్ఞానియే. ఈ ఒక వాక్యం చాలు "ఖాసిమ్[అ.స]" యొక్క ప్రతిష్టత తెలుసుకోవడానికి. కర్బలా యుద్ధం సమయంలో అతను 12, 13 సంవత్సరాల బాలుడు. ఇమామ్ హుసైన్[అ.స] వద్దకు వచ్చి యుద్ధానికి వెళ్లేందుకు అనుమతి కోరినప్పుడు ఇమామ్ అతనిని దగ్గర తీసుకొని, ఏడ్చి ఆ తరువాత అనుమతి ఇచ్చారు. ఖాసిమ్[అ.స] చూడడానికి చాలా అందంగా ఉండేవారు. అతను గుర్రం పై ఎక్కి యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేసి చివరికి వీరమరణం పొందారు. గుర్రం పైనుండి క్రిందికి పడినప్పుడు ఇమామ్ హుసైన్[అ.స] పరుగెత్తుకొని వారి వద్దకు వచ్చారు కాని అప్పటికే వారు తన ప్రాణాలు విడిచారు.
జనాబె ఖాసిం[అ.స] గుర్రం పైనుండి క్రిందకు వచ్చినప్పుడు ఇమామ్ హుసైన్[అ.స] అతని వద్దకు వెళ్ళిన విధానాన్ని మన పన్నెండవ ఇమామ్, ఇమామ్ మహ్దీ[అ.స] జియారతే నాహియాలో చెప్పిన విధానం మనసును కలచివేస్తుంది.[ఫర్హంగె ఆషూరా, పేజీ351]

రిఫ్రెన్స్
జవాదె ముహద్దిసీ, ఫర్హంగె ఆషూరా, నష్రె మారూఫ్, ఖుమ్, 1374.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 24