ఉపవాసాల రకాలు

శుక్ర, 04/07/2023 - 19:08

ఇస్లాం షరా పరంగా ఉపవాసాలు నాలుగు రకాలు వాజిబ్, హరామ్, ముస్తహబ్ మరియు మక్రూహ్, వీటి సంక్షిప్త వివరణ...

ఉపవాసాల రకాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

వాజిబ్ ఉపవాసాలు
ఉపవాసాలు నాలుగు రకాలు: 1. వాజిబ్ 2. హరామ్ 3. ముస్తహబ్ 4. మక్రూహ్
ఇక్కడ వాజిబ్ ఉపవాసాల గురించి తెలుసుకుందాం.
1. రమజాన్ మాసం యొక్క ఉపవాసాలు 2. ఖౙా ఉపవాసాలు 3. కఫ్ఫారహ్ ఉపవాసాలు 3. ఇస్తీజారీ ఉపవాసాలు (మరణించినవారి ఖౙా ఉపవాసాలు ఉండడానికి ఒకరి నుండి డబ్బులు తీసుకున్నప్పుడు ఉండాల్సిన ఉపవాసాలు) 4. ఏతేకాఫ్ యొక్క మూడవ రోజు ఉపవాసం 5. హజ్ ఖుర్బానీ కు బదులుగా ఉండవలసిన ఉపవాసం 6. మ్రొక్కు లేక ప్రమాణం వలన విధిగా మారిన ఉపవాసం 7. పెద్దకుమారుడి పై తండ్రి ఖౙా ఉపవాసాలు[1]

ముస్తహబ్ ఉపవాసాలు
ఇక్కడ ముస్తహబ్ ఉపవాసాల గురించి తెలుసుకుందాం.
కొన్ని ప్రత్యేక రోజులు తప్ప సంవత్సరమంతా ముస్తహబ్ ఉపవాసాలు ఉండవచ్చు. కాని కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఉపవాసం ఉండడం పై తాకీదు చేయబడి ఉంది. వాటి నుండి కొన్ని ఇవి:
ప్రతీ వారం: 1. గురువారం 2. శుక్రవారం
ప్రతీ ఖమరీ నెలలలో: 1. మొదటి పది రోజుల తరువాత వచ్చే మొదటి బుధవారం 2. 13, 14 మరియు 15వ తేదీలలో 3. మొదటి మరియు చివరి గురువారం
సంవత్సరం పొడుగునా: 1. ముహర్రం యొక్క 1వ మరియు 3వ తేదీన 2. దైవప్రవక్త[స.అ] జన్మదినాన(రబీవుల్ అవ్వల్ 17వ తేదీ) 3. రజబ్ మరియు షాబాన్ నెలలు 4. మబ్అస్ దినాన(రజబ్ నెల 27వ తేదీ) 5. భూమి పరచబడిన రోజు(జీ ఖఅదహ్ నెల 25వ తేదీ) 6. జిల్ హిజ్ యొక్క మొదటి తేదీ నుండి 9వ తేదీ వరకు 7. అరఫహ్ రోజు ఉపవాసం(ఆ ఉపవాసం ఆ రోజు దుఆ చదవడానికి అడ్డు కాకపోతే) 8. ముబాహలహ్(జిల్ హిజ్ నెల 24వ తేదీ)[2]

హరామ్ ఉపవాసాలు
ఇక్కడ హరామ్ ఉపవాసాల గురించి తెలుసుకుందాం.
ఈ రోజుల్లో ఉపవాసం ఉండకూడదు: 1. ఈదుల్ ఫిత్ర్ రోజు ఉపవాసం(షవ్వాల్ 1వ తేదీ) 2. ఈదె ఖుర్బాన్ రోజు ఉపవాసం(జిల్ హిజ్ నెల 10వ తేదీ) 3. పాపపు మ్రొక్కు యొక్క ఉపవాసం 4. అయ్యామె తష్రీఖ్(జిల్ హిజ్ నెల 11, 12 మరియు 13వ తేదీ) ఉపవాసాలు – మినాలో ఉన్నవారికి ప్రత్యేకించబడినవి 5. మౌన ఉపవాసం 6. విసాల్ ఉపవాసం (అనగా రెండు ఉపవాసాల మధ్య అంతరం లేకుండా ఒకటి తరువాత ఒకటి ఉండడం) 7. షాబాన్ నెల చివరి రోజు రమజాన్ నెల మొదటి రోజుగా నియ్యత్ చేసి ఉండే ఉపవాసం 8. తల్లిదండ్రులను లేదా తాతయ్యను బాధ కలిగించి పిల్లలు ఉండే ముస్తహబ్ ఉపవాసాలు 9. తల్లిదండ్రులను లేదా తాతయ్య వద్దని ఆపిన తరువాత కూడా పిల్లలు ఉండే ముస్తహబ్ ఉపవాసాలు 10. భర్త వద్దని ఆపిన తరువాత కూడా భార్య ఉండే ముస్తహబ్ ఉపవాసాలు 11. భర్త పట్ల భార్య పై ఉన్న బాధ్యతలు నిర్వర్తించలేకపోవడానికి కారణమైన భార్య యొక్క ముస్తహబ్ ఉపవాసాలు[3]

మక్రూహ్ ఉపవాసాలు
ఇక్కడ మక్రూహ్ ఉపవాసాల గురించి తెలుసుకుందాం.
1. గృహస్థుడి అనుమతి లేకుండా అతిథి ఉండే ముస్తహబ్ ఉపవాసం 2. గృహస్థుడు ఆపిన తరువాత కూడా అతిథి ఉండే ముస్తహబ్ ఉపవాసం 3. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఉండే పిల్లల ముస్తహబ్ ఉపవాసం 4. ఆషూరా రోజు ఉపవాసం 5. అరఫహ్ రోజున ఉండే ఉపవాసం ఒకవేళ అది ఆరోజు దుఆలు చదవలేకపోవడానికి కారణమైతే 6. అరఫహ్ లేక ఖుర్బాన్ పండగ దినమా అన్న సందేహం ఉన్నప్పటికీ ఉండే ఉపవాసం.[4]

రిఫరెన్స్
1. ఫలాహ్ జాదే, ఆమూజిషే ఫిఖ్హ్, పేజీ189, ఇంతెషారాతె సర్మాయహ్, దువ్వుమ్, 1395ష.
2. ఫలాహ్ జాదే, ఆమూజిషే ఫిఖ్హ్, పేజీ190, ఇంతెషారాతె సర్మాయహ్, దువ్వుమ్, 1395ష.
3. ఫలాహ్ జాదే, ఆమూజిషే ఫిఖ్హ్, పేజీ189, ఇంతెషారాతె సర్మాయహ్, దువ్వుమ్, 1395ష.
4. ఫలాహ్ జాదే, ఆమూజిషే ఫిఖ్హ్, పేజీ189, ఇంతెషారాతె సర్మాయహ్, దువ్వుమ్, 1395ష.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7