అల్లాహ్ ఆగ్రహం నుంచి దూరంగా ఉండాలంటే ఏమి చేయాలి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

అల్లాహ్ ఆగ్రహం నుంచి దూరంగా ఉండాలంటే మనల్ని మేము పూర్తిగా అల్లాహ్ కు లోబడి ఉండాలి, ఆయన పట్ల విధేయత కలిగి ఉండాలి. దాంతో మేము అల్లాహ్ ఆగ్రహానికి గురి అయ్యే పనులు చేయలేదు కాబట్టి మనశాంతిగా ఉండవచ్చు.
అల్లాహ్ ఆగ్రహానికి కి గురి అయ్యేవారెవరు? అన్న విషయం పై సంక్షిప్త వివరణ:
1. అవిశ్వాసం మరియు కపటం అల్లాహ్ శిక్షకు మూలం
ఖుర్ఆన్: “ఎవరైనా హృదయ పూర్వకంగా తిరస్కార వైఖరికి పాల్పడితే మాత్రం వారిపై దైవాగ్రహం పడుతుంది. అలాంటి వారి కోసమే చాలా పెద్ద శిక్ష ఉంది”[సూరయె నహ్ల్, ఆయత్106]
మరో చోట ఇలా వివరించబడి ఉంది: “అల్లాహ్ విషయంలో చెడుగా అనుమానించే కపట విశ్వాసులైన పురుషులను-కపట విశ్వాసులైన స్ర్తీలను, బహు దైవారాధకులైన పురుషులను – బహుదైవారాధకులైన స్ర్తీలను దండించటానికి (కూడా అల్లాహ్ ముస్లింలకు మనో నిబ్బరాన్ని నూరిపోశాడు). వాస్తవానికి వారి దురనుమానాలు వారిపైనే పడతాయి. అల్లాహ్ వారిపై ఆగ్రహించాడు. వారిని శపించాడు. వారి కోసం నరకాన్ని సిద్ధం చేశాడు. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం”[సూరయె ఫత్హ్, ఆయత్6]
2. హత్య మరియు అల్లాహ్ ఆయతులను నిరాకరించడం
అల్లాహ్ ఆలిఇమ్రాన్ సూరహ్ లో అల్లాహ్ ఆయతులను నిరాకరణ మరియు హత్యను అల్లాహ్ ఆగ్రహానికి కారణాలుగా సూచించెను. “వారు దైవాగ్రహానికి పాత్రులైపోయారు. వారికి దీనావస్థ అంటగట్టబడింది. వారి ఈ స్థితికి కారణమేమిటంటే వారు అల్లాహ ఆయతులను తిరస్కరించేవారు, అన్యాయంగా ప్రవక్తలను చంపివేసేవారు. వారి అవిధేయతకు, అతిక్రమణలకు శాస్తి ఇది!”[సూరయె ఆలిఇమ్రాన్, ఆయత్112]
3. మితిమీరి తినడం మరియు దుబారా చేయడం
మితిమీరి తినడం అల్లాహ్ ఆగ్రహానికి కారణం అని అల్లాహ్ ఖుర్ఆన్ లో సూచించెను: “మేము ప్రసాదించిన పవిత్రమైన ఆహారాన్ని తినండి. అందులో మితి మీరకండి. మితిమీరితే మీపై నా ఆగ్రహం విరుచుకుపడుతుంది. నా ఆగ్రహం ఎవరిపై విరుచుకుపడినా వాడు పతనమైనట్టే”[సూరయె తాహా, ఆయత్81]
వ్యాఖ్యానించండి