మనిషి పై పాపముల ప్రభావం

బుధ, 05/03/2023 - 18:27

ఇస్లాం దృష్టిలో పాపాములు మనిషిని అవమానాలకు గురి చేస్తాయి అనే విషయాన్ని తెలుసుకోవడం అవసరం...

మనిషి పై పాపముల ప్రభావం

ఇస్లాం దృష్టిలో పాపాములు మనిషిని అవమానాలకు గురి చేస్తాయి అనే విషయాన్ని తెలుసుకోవడం అవసరం. ఈ అవమానం కేవలం ఈలోకానికే పరిమితం కాదు ఇది పరలోకంలో కూడా అవమానానికి గురిచేస్తుంది. అందుకనే ఇస్లాం పాపములకు మరియు అల్లాహ్ పట్ల అవిధేయతకు దూరంగా ఉండాలని ఉపదేశిస్తుంది. ఖుర్ఆన్ పాపపరిణామాల గురించి ఇలా ఉపదేశిస్తుంది: “నిస్సందేహంగా – ఎవడు పాపకార్యాలకు ఒడిగట్టాడో, అతని పాపలు అతన్ని చుట్టుముట్టాయో అలాంటివారే నరకవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు”[సూరయె బఖరహ్, ఆయత్81]
మనిషి పాపకార్యాలకు ఒడిగట్టాడానికి కారణమయ్యే అసలయిన విషయాలు:
ఇస్లామీయ ఉలమాలు మరియు నైతిక జ్ఞాన నిపుణులు, మనిషి పాపకార్యాలకు ఒడిగట్టడానికి అసలైన కారణం, అతడిలో ఉండే మూడు శక్తులు అని చెబుతున్నారు:
1. ఆశ యొక్క శక్తి, దీనిని అరబీ భాషలో “ఖువ్వయె షహ్‌వియహ్” అంటారు.
2. కోపం యొక్క శక్తి, దీనిని అరబీ భాషలో “ఖువ్వయె గజబియహ్” అంటారు.
3. భ్రమ యొక్క శక్తి, దీనిని అరబీ భాషలో “ఖువ్వయె వహ్‌మియహ్” అంటారు.
ఆశ యొక్క శక్తి, మనిషిని మనోవాంఛల వైపు లాగుతుంది, దాంతో మనిషి పాపములకు గురి అవుతాడు.
కోపం యొక్క శక్తి, ఇది మనిషిని అన్యాయం, దౌర్జన్యం, ఘాతకం మరియు ఎదుటి వారిని వేధించడానికై పురికొల్పుతుంది.
భ్రమ యొక్క శక్తి, ఇది మనిషిలో ఆధిపత్యం, స్వార్థం, నేను మాత్రమే, నాకు మాత్రమే, లాంటి వాటిని ప్రాణం పోస్తుంది. దాని ద్వార మనిషి పాపములు చేయడానికి సిద్ధమవుతాడు.[1]
కొంచెం దృష్టి పెట్టి చూసినట్లైతే చాలా పాపములు(ఒక విధంగా చూసుకుంటే పాపములన్నీ) ఈ మూడు శక్తుల ద్వారానే సంభవిస్తాయి అని తెలుస్తుంది. అలా అని ఇందులో షైతాన్ ప్రమేయం లేదు అని అనుకోకూడదు. ఈ మూడు శక్తులు మనిషికి అవసరం, కాని వాటిని కంట్రోల్ లో పెట్టకపోతే అవి క్రూర మృగాలుగా మారి మనిషిని పాపములకు గురి చేస్తాయి.[2]
మనిషి జీవితంలో పాపముల ఇహపరలోక పరిణామాలు:
ఖుర్ఆన్ మరియు హదీసులనుసారం పాపముల ఇహపరలోక పరిణామాలు ఈ విధంగా సూచించబడి ఉన్నాయి.
ఖుర్ఆన్ లో పాపాత్ముల పరిణామాలు:
1. ఇహలోకంలో భయంకరమైన శిక్షలు: “మేము కూడా ఆ దుర్మార్గులపై వారి (దుర్మార్గం), ధిక్కార వైఖరికి శాస్తిగా ఆకాశం నుంచి శిక్షను అవతరింబజేశాము”[సూరయె బఖరహ్, ఆయత్59] అలాగే సూరయె మాయిదహ్ లో ఇలా ఉంది: “ఒకవేళ వారు విముఖత చూపితే, వారు ఒడిగట్టిన కొన్ని పాపాలకుగాను వారికి శిక్ష విధించాలన్నదే అల్లాహ్ సంకల్పం అని తెలుసుకో”[సూరయె మాయిదహ్, ఆయత్49] అల్లాహ్ సూరయె అన్ఆమ్ లో కొన్ని సమూహముల నాశనానికి కారణం వారు చేసిన పాపములు అని వివరించెను: “... కాని వారి పాపాల మూలంగా మేము వారిని తుదముట్టించాము. వారి తరువాత ఇతర సముదాయాలను ప్రభవింపజేశాము”[సూరయె అన్ఆమ్, ఆయత్06] సమూద్ జాతి గురించి అల్లాహ్ ఇలా సూచించెను: “కాని వారు మాత్రం తమ ప్రవక్త (మాటల)ను త్రోసిపుచ్చి, దాని గిట్టెలను నరికి(చంపేశారు). అంతే! వారి ప్రభువు వారి దురాగతాల కారణంగా వారిపై వినాశాన్ని పంపాడు. వారందరినీ సమానం (నేలమట్టం) చేశాడు”[సూరయె షమ్స్, ఆయత్14].
2. పరలోక శిక్షలు: అల్లాహ్, పాపాత్ముల యొక్క భయంకరమైన శిక్ష గురించి ఇలా సూచించెను: “మరెవరయితే చెడును తీసుకువస్తారో వారు బోర్లాగా అగ్నిలో పడవేయబడతారు. మీరు చేసుకున్న కర్మలకు తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతుంది (అని వారితో అనబడుతుంది)”[సూరయె నమ్ల్, ఆయత్90] మరో ఆయత్ లో ఇలా ఉంది: “వారి ముఖాలను అగ్ని మాడ్చివేస్తూ ఉంటుంది. అందువల్ల వారు కడు అంద వికారంగా మారిపోతారు”[సూరయె మొ’మినూన్, ఆయత్104]
రివాయతులలో పాపాత్ముల పరిణామాలు:
1. కఠోర హృదయం: హజ్రత్ అమీరుల్ మొమినీన్ అలీ(అ.స) ఉల్లేఖనం: కళ్ల నుండి కన్నీరు ఎండిపోవు కసాయి మనస్కులకు తప్ప, హృదయాలు కసాయి హృదయాలుగా మారవు మిక్కిలి పాపకార్యములు వల్ల, తప్ప.[3] (అనగా పాపాల వల్ల మనిషి కసాయి మనస్కుడిగా మారతాడు).
2. అనుగ్రహాలు కోల్పోవడం: హజ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: మా నాన్నగారు నిత్యం చెబుతూ ఉండేవారు: “పాపానికి ఒడిగట్టడం వల్ల శిక్షకు అర్హుడు అయిన దాసుడికి తప్ప దాసుడికి ఇవ్వబడ్డ అనుగ్రహం తిరగి తీసుకోకూడదు అని అల్లాహ్ గట్టి నిర్ణయం”[4]
3. దుఆలు స్వీకరించబడకపోవడం: ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ఉల్లేఖనం: నిస్సందేహముగా అల్లాహ్ దుఆలను ఒక్కోసారి త్వరగానో లేదా కొంత కాలం తర్వాతనో స్వీకరిస్తాడు, దుఆ చేసిన తరువాత దాసుడు పాపమునకు పాల్పడితే అల్లాహ్ తన దూతతో ఇలా ఆదేశించెను: “అతడి కోరికను తీర్చకు, అతడిని దాని నుండి దూరం చేయి ఎందుకంటే అతడు నా ఆగ్రహానికి గురి అయ్యాడు, అతడి కోరికను తీర్చకపోవడమే అతడికి సరి”[5]

తరువాత అంశాలు: ఓ అల్లాహ్! శిక్షకు గురి చేయకు:
రమజాన్ మాసం, 6వ రోజు దుఆ యొక్క చివరి వాక్యములలో మేము అల్లాహ్ ను మమ్మల్ని ఆయన ఆగ్రహం మరియు శిక్షకు గురి చేయకు అని వేడుకుంటున్నాము; స్పష్టమైన విషమేమిటంటే అల్లాహ్ ఆగ్రహానికి గురి చేసేవాటిలో అతి ముఖ్యమైన కారణం అల్లాహ్ నిషిద్ధ కార్యమును చేయడం మరియు విధిగా నిర్ధారించబడ్డ చర్యలను అమలు పరచకపోవం (అనగా హరామ్ చర్యలను చేయడం మరియు వాజిబ్ ను అమలు పరచకపోవడం). ఇస్లాం ఆదేశాలను పాటించడం ద్వార అల్లాహ్ ఆగ్రహానికి గురికాకుండా ఉండవచ్చు.

రిఫరెన్స్
1. ఫఖ్రె రాజీ, తఫ్సీర్, భాగం20, పేజీ104
2. మొహ్సిన్ ఖిరాఅతీ, గునాహ్ షినాసీ, పేజీ42
3. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం67, పేజీ 55, హదీస్24
4. కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, అల్ కాఫీ(తా-అల్ ఇస్లామియహ్), భాగం2, పేజీ273, హదీస్22
5. కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, అల్ కాఫీ(తా-అల్ ఇస్లామియహ్), భాగం2, పేజీ271; మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం73, పేజీ329.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19