అల్లాహ్ స్మరణ ప్రభావాలు

మంగళ, 05/09/2023 - 16:44

విశ్వసించిన వారి హృదయాలు అల్లాహ్ స్మరణ ద్వారా తృప్తి చెందుతాయి. తెలుసుకోండి! అల్లాహ్ స్మరణ ద్వారానే హృదయాలు నెమ్మదిస్తాయి.....

అల్లాహ్ స్మరణ ప్రభావాలు

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించెను: “విశ్వసించిన వారి హృదయాలు అల్లాహ్ స్మరణ ద్వారా తృప్తి చెందుతాయి. తెలుసుకోండి! అల్లాహ్ స్మరణ ద్వారానే హృదయాలు నెమ్మదిస్తాయి”[సూరయె రఅద్, ఆయత్28] అలాగే మరో చోట ఇలా ఉంది: “ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను అత్యధికంగా స్మరించండి. ఉదయం, సాయంకాలం ఆయన పవిత్రతను కొనియాడండి”[సూరయె అహ్జాబ్, ఆయత్1,42]
అల్లాహ్ స్మరణ ప్రభావాలు ఖుర్ఆన్ మరియు హదీసులనుసారం:
1. అల్లాహ్ దృష్టిలో పడడం: ఖుర్ఆన్: “మీరు నన్ను స్మరించండి, నేను మిమ్మల్ని జ్ఞాపకముంచుకుంటాను. నాకు కృతజ్ఞులై ఉండండి. కృతఘ్నతకు పాల్పడకండి”[సూరయె బఖరహ్, ఆయత్152]
2. అల్లాహ్ యొక్క ప్రేమ: రివాయత్ లో ఇలా ఉంది: “అల్లాహ్ ను నిత్యం స్మరించేవాడి హృదయంలో అల్లాహ్ యొక్క ప్రేమ అధికారం చెలాయిస్తుంది”[1]
3. విముక్తి, సాఫల్యం: ఖుర్ఆన్: “ఎక్కువగా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు”[సూరయె జుముఅహ్, ఆయత్10]
4. షైతాన్ నుండి దూరం: ఖుర్ఆన్: “నిశ్చయంగా అల్లాహ్ భీతిపరులు(ముత్తఖీన్) తమకు ఎప్పుడైనా షైతాన్ తరపు నుంచి చెడు ఆలోచన తట్టినప్పుడు వారు (తమ ప్రభువు యొక్క ఔన్నత్య) స్మరణలో నిమగ్నులై పోతారు. దాంతో వెంటనే వారికి కనువిప్పు కలుగుతుంది”[సూరయె అఅరాఫ్, ఆయత్201]
అల్లాహ్ స్మరణకు దూరమైతే కలిగే ప్రభావాలు:
1. స్వియ పరాధ్యానం: మనిషి తనను తానే మరిచిపోతాడు. ఖుర్ఆన్: “మీరు అల్లాహ్ ను మరచిపోయిన వారి మాదిరిగా అయిపోకండి. (వారి ఈ విస్మరణ కారణంగా) అల్లాహ్ కూడా వారిని తమ ఆత్మలనే మరచిపోయిన వారిగా చేసేశాడు. ఇలాంటి వారే పరమ అవిధేయులు”[సూరయె హష్ర్, ఆయత్19]
2. షైతాన్ సహవాసం: ఖుర్ఆన్: “కరుణామయుని స్మరణ పట్ల గుడ్డిగా వ్యవహరించే వ్యక్తి పై మేము షైతానును నియమిస్తాము. ఇక వాడే అతనికి సహవాసిగా ఉంటాడు”[సూరయె జుఖ్రుఫ్, ఆయత్36]
3. ఇహలోకంలో కష్టాలు పరలోకంలో గుడ్డితనం: ఖుర్ఆన్: “అయితే నా ధ్యానం పట్ల విముఖత చూపినవాడి బ్రతుకు దుర్భరమైపోతుంది. ప్రళయదినాన మేమతన్ని గుడ్డివానిగా చేసి లేపుతాము”[సూరయె తాహా, ఆయత్124]

రిఫరెన్స్

1. బిహారుల్ అన్వార్, (తా-బీరూత్), భాగం63, పేజీ325, హదీస్11.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20