ఇస్లాం అనాధుల గురించి చాలా తాకీదు చేస్తుంది, ఈ విషయంలో కొరత లేక నిర్లక్ష్యం చేస్తే అల్లాహ్ ఆగ్రహంతో పాటు పరలోక భయంకర శిక్ష కు గురి అయ్యే అవకాశం ఉంది...

ఇస్లాం అనాధుల గురించి చాలా తాకీదు చేస్తుంది, ఈ విషయంలో కొరత లేక నిర్లక్ష్యం చేస్తే అల్లాహ్ ఆగ్రహంతో పాటు పరలోక భయంకర శిక్ష కు గురి అయ్యే అవకాశం ఉంది.
ఇస్లాంలో అనాథాశ్రయం:
ప్రతీ మనిషి ఇతరుల నుండి గౌరవించబడాలని, ప్రేమించబడాలని భావిస్తాడు, ఇది మానవ స్వభావం. ఈ స్వభావం మనిషి యొక్క చిన్నతనంలో ఎక్కువగా ఉంటుంది, అదే చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుంటే అలాంటి పిల్లలలో ఈ స్వభావం ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఇస్లాం ఇలాంటి పిల్లల పట్ల మన బాధ్యతలను వివరించింది: “మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు. సదాచరణ అంటే వాస్తవానికి అల్లాహ్ ను, అంతిమ దినాన్నీ, దైవ దూతలనూ, దైవ గ్రంథాన్నీ, దైవ ప్రవక్తలనూ విశ్వసించటం. ధన ప్రీతి ఉన్నప్పటికీ సమీప బంధువులకు, అనాధలకు, అగత్యపరులకు, బాటసారులకు, యాచించేవారికి (ధనాన్ని) ఇవ్వటం, బానిసలకు విముక్తి నొసగటం, నమాజును నెలకొల్పటం, జకాతును చెల్లిస్తూ ఉండటం, ఇచ్చిన మాటను నిలుపుకోవటం, లేమిలో కష్టకాలంలో, యుద్ధ సమయాలలో సహన స్థయిర్యాలను కనబరచటం – ఇవన్నీ కలిగి వున్నవారే వాస్తవానికి సత్యమూర్తులు. భయభక్తులు కలవారు కూడా వీరే”[సూరయె బఖరహ్, ఆయత్177]
అనాధల పట్ల బాధ్యతారహితం:
అనాధల పట్ల బాధ్యతారహితంగా ఉండేవారి గురించి ఖుర్ఆన్ ఇలా హెచ్చరిస్తొంది: “తీర్పు (దినము)ను ధిక్కరించే వాడిని నీవు చూశావా!?, వీడే అనాధను గెంటివేసేవాడు[సూరయె మాఊన్, ఆయత్1,2]. అనాధల సొమ్ముతో కడుపు నింపుకునే వారి యొక్క పరిణామలను దైవగ్రంధం ఈ విధంగా ప్రస్థావిస్తుంది: “తండ్రిలేని బిడ్డల సొమ్మును అన్యాయంగా తినేవారు తమ పొట్టల్ని అగ్నితో నింపుకుంటున్నారు. త్వరలోనే వారు మండే అగ్నిలోకి ప్రవేశిస్తారు”[సూరయె నిసా, ఆయత్10]
అనాధల పట్ల బాధ్యతగా ఉండడం:
అనాధల పట్ల బాధ్యతగా ఉండేవారి గురించి దైవప్రవక్త ఈ విధంగా ఉల్లేఖించారు: ఎవరైతే అనాధలను పోషించి వారి అవసరాలను తీరుస్తారో నేను మరియు ఆ అనాధ పోషకుడు స్వర్గంలో ఇలా ఉంటాం, “అప్పుడాయన తన చూపుడు వ్రేలిని మరియు మధ్య వ్రేలిని కలిపి ఉంచి చూపించారు”(అంటే స్వర్గంలో ఇద్దరం ఒకే చోట ఉంటాము అని అర్ధం)[1]
రిఫరెన్స్
1. ఖుర్బుల్ అస్నాద్,పేజీ నం:45,సవాబుల్ ఆమాల్,పేజీ నం:237.
వ్యాఖ్యలు
Allahu Akbar
Excellent
వ్యాఖ్యానించండి