జీఖఅదహ్ మాసం సంఘటనలు

గురు, 05/25/2023 - 16:14

జీఖఅదహ్ మాసంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలు మరియు వాటి సంక్షిప్త వివరణ...

జీఖఅదహ్ మాసం సంఘటనలు

1వ తారీఖు హజ్రత్ మాసూమహ్[అ.స] జన్మదినం
దైవప్రవక్త(స.అ) 7వ ఉత్తరాధికారి అయిన హజ్రత్ మూస ఇబ్నె జాఫర్(అ.స) యొక్క కుమార్తె మరియు హజ్రత్ ఇమామ్ రిజా(అ.స) యొక్క సహోదరి అయిన హజ్రత్ మాసూమ-ఎ-ఖుమ్(అ.స) హిజ్రీ యొక్క 173వ సంవత్సరంలో హజ్రత్ మాసూమహ్(అ.స) జన్మించారు. ఆమె పేరు ఫాతెమా కుబ్రా, బిరుదు మఅసూమహ్, హజ్రత్ నజ్మా ఖాతూన్. ఆమె మదీనహ్ మునవ్వరహ్ లో జన్మించారు. రబీవుల్ అవ్వల్ 23వ లేదీ, హిజ్రీ యొక్క 201వ సంవత్సరంలో ఇరాన్ దేశం యొక్క ఖుమ్ పట్టణానికి చేరుకున్నారు. ఆమె మదీనహ్ నుండి ఇరాన్ కు ప్రయాణం చేయడానికి కారణం ఖురాసాన్ పట్టణంలో ఉన్న ఆమె సోదరుడు ఇమామ్ రిజా(అ.స)తో కలుసుకోవడం. 28 ఏళ్ల వయసులో రబీవుల్ అవ్వల్ 10వ తేదీ, హిజ్రీ యొక్క 201వ సంవత్సరంలో మరణించారు.

11వ తారీఖు
1. హజ్రత్ ఇమామ్ అలీ రిౙా(అ.స) జన్మదినం.

హజ్రత్ ఇమామ్ అలీ ఇబ్నె మూసా అల్ రిౙా(అ.స), దైవప్రవక్త(స.అ) యొక్క 8వ ఉత్తరాధికారి. వారు జీఖఅదహ్ మాసం 11వ తేదీ హిజ్రీ యొక్క 148వ సంవత్సరంలో జన్మించారు. తండ్రి ఇమామ్ మూసా కాజిమ్(అ.స), తల్లి “తుక్‌తమ్”. ఇమామ్ రిజా(అ.స)ను జన్మనిచ్చిన తరువాత ఇమామ్ కాజిమ్(అ.స) తరపు నుంచి ఆమె “తాహెరా” అను పిలవబడ్డారు. ఇమామ్ రిజా(అ.స) కున్నియత్ “అబుల్ హసన్”, బిరుదు “రిజా”. వారి తండ్రి బగ్దాద్ పట్టణ కారాగారంలో విషం ద్వార చంపబడిన తరువాత 35 సంవత్సరాల వయసులో ఇమామత్ పదవి స్వీకరణ చేశారు.

2. హిజ్రీ యొక్క 336వ సంవత్సరంలో షేఖ్ ముఫీద్[ర.అ] జన్మించారు.
షైఖ్ ముఫీద్ గా పిలవబడే "ముహమ్మద్ బిన్ ముహమ్మద్ బిన్ నొమాన్" నాలుగు మరియు ఐదవ శతాబ్దాలలో ప్రశిద్ధి చెందిన ఫఖీహ్ మరియు వేదాంతవేత్త. వారు 336 లేదా 338వ హిజ్రి లో బగ్దాద్ కు సమీపంలో గల ఉక్బరి అనే ప్రదేశంలో జన్మించారు. షైఖ్ ముఫీద్ ల వారు తన తండ్రి గారి వద్దే ఖుర్ఆను మరియు ప్రాధమిక విధ్యలను నేర్చుకుని ఆ తరువాత ఉన్నత విద్యల నిమిత్తం బఘ్దాద్ వెళ్ళారు. షైఖ్ ముఫీద్ ఎంతో మంది విద్యార్ధులకు మతపరమైన శిక్షననిచ్చి వారిని పండితులుగా తీర్చి దిద్దారు. వారు హిజ్రి యొక్క 413వ ఏట మరణించారు. వారిని కాజిమైన్ లో ఇమామ్ కాజిమ్(అ.స) మరియు ఇమామ్ జవాద్(అ.స) వారి సమాధులకు సమీపాన ఖననం చేయటం జరిగింది.[1]

17వ తారీఖు
హిజ్రీ యొక్క 179వ సంవత్సరంలో హజ్రత్ మూసా కాజిమ్(అ.స)ను మదీనహ్ నుండి ఇరాక్ కు దేశబహిష్కరణ చేశారు.

24వ తారీఖు
హిజ్రీ యొక్క 200వ సంవత్సరంలో హజ్రత్ ఇమామ్ అలీ రిౙా(అ.స) మదీనహ్ నుండి మష్హద్(ఇరాన్)ను బయలుదేరారు.

25వ తారీఖు
దహ్వుల్ అర్జ్(భూమి పరచబడిన రోజు). “దహ్‌వుల్ అర్జ్” నీటి నుంచి మెల్లమెల్లగా భూమి బయటకు వచ్చి విర్తరించ మొదలయిన విషయాన్ని సూచిస్తుంది.[2] ఎందుకంటే మొదట్లో భూమండలం నీటితో నిండి ఉండేది, మెల్లమెల్లగా నీరు భూమి యొక్క గొతుల్లో జారుకుంది, భూమి బయటకు వచ్చి విస్తరించింది, దీనినే “దహ్‌వుల్ అర్జ్” అంటారు.[3]

26వ తారీఖు
హిజ్రీ యొక్క 10వ సంవత్సరంలో దైవప్రవక్త(స.అ) తమ చివరి హజ్ (హజ్జతుల్ విదా) చేసేందుకు మదీనహ్ నుండి మక్కా వైపుకు ప్రయాణించిన రోజు.

28వ తారీఖు హుదైబియహ్ సంధి
హిజ్రీ యొక్క 6వ సంవత్సరంలో “హుదైబియహ్” సంధి జరిగిన రోజు. హిజ్రీ శకం 6వ సం॥లో దైవప్రవక్త(స.అ) తమ 14 వందల సహాబీయులతో ఉమ్రా ఉద్దేశంతో మదీనా నుండి బయలుదేరారు. అందరికి తమ ఖడ్గాలను వాటి ఒరలోనే ఉంచమని ఆదేశించారు. కేవలం ఉమ్రా చేసుకునేందుకు మాత్రమే వచ్చాము ఎట్టిపరిస్థితిలో యుధ్ధం చేసే ఉద్దేశమే లేదు అని ఖురైషియులకు అర్ధమైయ్యే విధంగా “జుల్ హలీపహ్”(మక్కా పట్టణానికి అతి దగ్గర ప్రదేశం) లో అందరు ఎహ్రామ్(హజ్జ్ చేసే సమయంలో ధరించే ప్రత్యేక దుస్తులు) ధరించి మరియు తఖ్లీద్(అల్లాహ్ మొక్కుబడికి సూచనగా మొడలలో వేసే పట్టెడలు) తో బలిచ్చే జంతువులను తీసుకొని బయలుదేరారు అయినప్పటికీ ఖురైషియులకు ముహమ్మద్(స.అ) తమ శక్తి సామర్ధ్యాలతో మక్కాలో ఖురైషియుల ఆడంబరాన్ని, ప్రతిష్టను మరియు దర్జాను మట్టి కరిపించారని అరేబీయులు ఎక్కడ అనుకుంటారో అని భయం పుట్టుకొచ్చింది. అందుకు “సుహైల్ బిన్ అమ్ర్ బిన్ అబ్దెవద్ అల్ ఆములి” ఆథిపత్యంలో ముహమ్మద్(స.అ) వద్దకు ఒక రాయబార సంఘాన్ని దైవప్రవక్త(స.అ)తో “ఈ సంవత్సరం తిరిగి వెళ్ళిపోమని, వచ్చే సంవత్సరం మూడు రోజులు మనశ్శాంతిగా ఉమ్రా చేసుకునేందుకు మక్కాను ఖాళీ చేస్తాము” అని కోరమని పంపారు. దాంతో పాటు కొన్ని కఠిన షరత్తులు కూడా పెట్టారు. అయినా దైవప్రవక్త(స.అ) ఇస్లాం శుభహేతువు కోరి వాటిని అంగీకరించారు. వారి మధ్య జరిగిన సంధినే హుదైబియహ్ సంధి అంటారు.[4]

29వ తారీఖు
హిజ్రీ యొక్క 220వ సంవత్సరంలో హజ్రత్ ముహమ్మద్ తఖీ(అ.స) మరణించిన రోజు.[5]

రిఫరెన్స్
1. రిజాలె నజాషి, పేజీ నం:399, తారీఖె ఫిఖ్ వ ఫుఖహా,గర్జీ, పేజీ నం:143.
2. పయామె ఇమామె అమీరుల్ మొమినీన్(అ.స), భాగం3, పేజీ177.
3. మకారిమ్ షీరాజీ, లుగాత్ దర్ తఫ్సీరె నమూనహ్, పేజీ354.
4. సహీ బుఖరీ, బుఖారీ, కితాబుష్షురూతొ ఫిల్ జిహాద్, భాగం 8, పేజ్ 122.
5. షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, మతర్జిమ్ ఇలాహీ ఖుమ్షెయి, ఇంతెషారాతె ఉస్వహ్, 1379.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
15 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8