షేఖ్ ముఫీద్(ర.అ) ఇతర ఉలమాల దృష్టిలో

మంగళ, 05/30/2023 - 18:13

ప్రముఖ ఆలిమ్ షేఖ్ ముఫీద్(ర.అ) గురించి ఇరువర్గాలకు చెందిన ఉలమాల అభిప్రాయాలు సంక్షిప్తంగా...

షేఖ్ ముఫీద్(ర.అ) ఇతర ఉలమాల దృష్టిలో

షేఖ్ ముఫీద్(ర.అ) షియా మరియు ఇస్లాం ప్రపంచం గర్వపడే ప్రముఖ ఉలమాలలో ఒకరు. వారిలో ఉన్న ప్రత్యేకతలు మరియు వారి గురించి ఇతర ఉలమాలు చెప్పిన మాటలు ఇక్కడ తెలుసుకుందాం:

షేఖ్ ముఫీద్(ర.అ) యొక్క శిష్యులలో ఒకరైన షేఖ్ తూసీ(ర.అ) తన గ్రంథం ..ఫెహ్రిస్త్.. లో ఇలా ఉల్లేఖించారు: “మొహమ్మద్ ఇబ్నె మొహమ్మద్ ఇబ్నె నొఅమాన్, వారి కున్నియత్ అబూఅబ్దిల్లాహ్ మరియు ఇబ్నె ముఅల్లిమ్ అని ప్రసిద్ధి చెందినవారు, షియా ముతకల్లిముల నుండి, వారి కాలంలో షియా నాయకత్వం వారికి చెందింది. వారు విజ్ఞానం మరియు కలామ్ జ్ఞానంలో ఇతరులకు మించి ఉండేవారు, ఫిఖాలో ఇతర ఫిఖా జ్ఞానుల పై వారిదే పైచేయి, సమాధానం ఇవ్వడంలో నైపుణ్యం కలిగివున్న వ్యక్తి, వారు దాదాపు 200 పుస్తకాలు రచించారు...”

షేఖ్ ముఫీద్(ర.అ) యొక్క మరో శిష్యులైన నజాషీ ఇలా ఉల్లేఖించెను.. ఫిఖా, కలామ్ మరియు రివాయత్ అలాగే నమ్మకం మరియు విజ్ఞానంలో మన ప్రశంసలకు మించి ప్రవీణ్యత్వం గలవారు. అప్పుడు వారు, వారి 170కి మించి రచనల పేర్లను రచించారు.

అల్లామా హిల్లీ తన గ్రంథం ఖులాసహ్ లో షేఖ్ ముఫీద్(ర.అ) గురించి ఇలా ఉల్లేఖించెను: వారు షియా ఉపాధ్యాయులలో గొప్పవారు, పెద్దవారు మరియు వారి గురువులు; వారి తరువాత వచ్చిన వారందరూ వారి జ్ఞానాన్ని పొందినవారే.

అల్లామా బహ్రుల్ ఉలూమ్ తన గ్రంథం “ఫవాయిదు రిజాలియహ్” లో షేఖ్ ముఫీద్(ర.అ) ప్రశంసల తరువాత ఇలా ఉల్లేఖించెను: “ప్రతిష్టత యొక్క అన్ని కోణాలు వారిలో సంగ్రహించబడి ఉన్నాయి మరియు నిపుణుల అధ్యక్షత వారి పై అంతం అవుతుంది. అందరూ వారి యొక్క విజ్ఞానం, ప్రతిష్టత, న్యాయం, నమ్మకం మరియు గొప్పతం పట్ల సమ్మతం కలిగి ఉన్నారు. వారి ఉత్తమత్వాలు చాలా ఎక్కువ మరియు వారి ప్రతిష్టతలు లెక్కలేనివి. సమాధనం ఇవ్వడంలో నిపుణులు, చాలా రివాయతులు కలిగి ఉన్న వ్యక్తి. కవిత్వం, రివాయత్ మరియు రిజాల్ జ్ఞానంలో నైపుణ్యం మరియు  హదీసులలో అప్పటి వారిలో ఉత్తములు, ఫిఖా మరియు కలామ్ విద్యలో ఎక్కువ జ్ఞానం కలిగివున్నవారు. వారి తరువాత వచ్చినవారు వారి నుండి పొందినవారే.

అల్లామా గౌరవనీయులైన సద్ర్ తన గ్రంథం “తాసీసుష్ షియా” లో ఇలా అన్నారు: “షేఖ్ ముఫీద్ తన కాలంలో ఉన్న విజ్ఞానాలన్నీంటిలో సాటిలేని మరియు ఒక్కరు” మరో చోట వారి గురించి ఇలా ఉంది: “షియాల పెద్ద మరియు షరీఅత్ ను జీవం పోసినవారు అబూ అబ్దిల్లాహ్ మొహమ్మద్ ఇబ్నె మొహమ్మద్ ఇబ్నె నొఅమానీ ముఫీద్”

ఇవి షియా ఉలమాల షేఖ్ ముఫీద్(ర.అ) గురించి చెప్పిన మాటలు ఇక ఇప్పుడు అహ్లె సున్నత్ వర్గానికి చెందిన కొంత మంది ప్రముఖుల ఉల్లేఖనలు చూద్దాం:

ఇబ్నె హజర్ తన గ్రంథం “లిసానుల్ మీజాన్” లో వారి గురించి ఇలా అనెను: “వారు షియా ఆలిమ్, చాలా రచనలు కలిగివున్నవారు దాదాపు 200 గ్రంథాలు... ఉజ్దుద్ దౌలహ్ వల్ల వారికి సదుపాయాలు ఎక్కువగా ఉండేవి. వారు 413వ సంవత్సరంలో మరణించారు మరియు 80 వేల షియాలు వారి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. వారు చాలా సాధారణ జీవి, వినయవిధేయతలు మరియు విధ్యాభ్యాసం పట్ల మక్కువ కలిగి ఉండే వ్యక్తి. చాలా మంది వారి నుండి విద్యను పొందారు. వారు షియా ల మధ్య గొప్ప స్థానం పొందారు, మేము వారికి రుణ పడి ఉన్నాము అని అంటూ ఉండేవారు. ఉజ్దుద్ దౌలా షేఖ్ ముఫీద్ ఇంటికి వచ్చేవారు మరియు అనారోగ్యంతో ఉంటే పరామర్శించడానికి వచ్చేవారు. వారి అల్లుడు అయినా అబూయుఅలా జాఫరీ ఇలా ఉల్లేఖించెను: రాత్రుళ్లు చాలా తక్కువగా పడుకునేవారు, ఆ తరువాత లేచి నమాజ్ చదువుకునే వారు లేదా చదువుకునే వారు లేదా ఖుర్ఆన్ పఠించేవారు.

యాఫెయీ తన గ్రంథం “మరాఅతుల్ జినాన్” లో 413 హిజ్రీలో జరిగిన సంఘటన గురించి ఇలా అన్నారు: ఈ సంవత్సరంలో షియా ఆలిమ్ మరియు రాఫిజా ఇమామ్, ఎన్నో గ్రంథాలు రచించిన వారు, షియా ముస్లిముల పెద్ద, ముఫీద్ మరియు ఇబ్నె ముఅల్లిమ్ అనబడే వ్యక్తి మరణించాడు.

వీళ్లే కాకుండా ఇబ్నె తై, ఇబ్నె కసీర్, మొహమ్మద్ ఇబ్నె అహ్మదె జహబీలు కూడా షేఖ్ ముఫీద్ గురించి మరియు వారి విజ్ఞాన స్థానం గురించి తమ గ్రంథాలలో ఉల్లేఖించారు.

క్లుప్తంగా చెప్పాలంటే షేఖ్ ముఫీద్ ఇరువర్గాలకు చెందిన ప్రముఖుల దృష్టిలో ఉత్తములు, గొప్ప పండితులు మరియు ఇస్లాం వివిధ విద్యలలో నిపుణులు మరియు గొప్ప గుణవంతులు. ఇవి ప్రముఖులు వారి గురించి చెప్పిన మాటల ద్వార తెలుస్తుంది అయితే వారి స్థానం ఇంతకు మించినది అని గ్రంచాల్సినవసరం ఉంది. ఎందుకంటే కేవలం దాదాపు 70 సంవత్సరాల వయసులోపు సౌకర్యాలు లేని కాలంలో 200 లకు పైగా గ్రంథాలు రచించడం మరియు ఆ గ్రంథాలు ఇప్పటికీ వర్గ చర్చలలో ఇమామత్ మరియు షియా వర్గ నిదర్శనలు ఉండడం ఆ గ్రంథాలనే వర్గ ఆధారంగా చాటడం, అవే మూల గ్రంథాలుగా ఉండడం... సోచించదగ్గ విషయం మరియు వారి విజ్ఞానం పై నిదర్శనం.   

రిఫరెన్స్
https://www.noorsoft.org/fa/Mostabser/View/52/زندگی%E2%80%8Cنامه-شیخ-مفید

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 27