షైఖ్ ముఫీద్(ర.అ) జీవిత చరిత్ర

సోమ, 05/29/2023 - 12:40

షియా వర్గానికి చెందిన ప్రముఖ ఫఖీహ్ మరియు ధర్మవేధి అయిన షైఖ్ ముఫీద్(ర.అ) జీవిత చరిత్ర సంక్షిప్తంగా...

షైఖ్ ముఫీద్(ర.అ) జీవిత చరిత్ర

షైఖ్ ముఫీద్ గా పిలవబడే "ముహమ్మద్ బిన్ ముహమ్మద్ బిన్ నొమాన్" నాలుగు మరియు ఐదవ శతాబ్దాలలో ప్రశిద్ధి చెందిన ఫఖీహ్ మరియు వేదాంతవేత్త. వారు 336 లేదా 338వ హిజ్రి లో బగ్దాద్ కు సమీపంలో గల ఉక్బరి ప్రదేశానికి చెందిన సవీఖహ్ ఇబ్నె బసరీ అనే గ్రామంలో ఒక షియా ఇంట జన్మించారు. వారి తండ్రి వృత్తి రీత్యా ఉపాధ్యాయులు కావడం వలన వారిని “ఇబ్నుల్ ముఅల్లిం”(పండిత పుత్రుడు) అని కూడా పిలిచేవారు. మోతజలి పండితుడైన అలి బిన్ ఈసా రుమ్మాని పై ఒక చర్చలో పైచేయి సాధించటం వలన వారికి “ముఫీద్” అనే పేరు వచ్చింది.  

విధ్యాభ్యాసం
విజ్ఞానం పట్ల మక్కువ, చదువు పట్ల ధ్యాస చివరికి ఐదేళ్ల వయసులోనే ఇబ్నె అబీ ఇల్యాస్ నుండి రివాయత్ ఉల్లఖన అనుమతిని పొందేట్లు చేశాయి. ఏడు సంవత్సరాల వయసులో ఇబ్నె సమాక్ నుండి రివాయత్ ను ఉల్లేఖించారు. వాటి పట్టుదల మరియు ప్రయత్నం గుణం వల్ల వారు పన్నెండు సంవత్సరాలకు చేరకుండానే ముహద్దిసీనుల నుండి రివాయతులు తీసుకోవడం మొదలు పెట్టారు, వారు ఇరవై సంవత్సరాలు పూర్తి కాకుండానే షేఖ్ సదూఖ్(ర.అ) నుండి హదీస్ ను విన్నారు.
ప్రముఖ ముహద్దిస్, హాజ్ మీర్జా హుసైన్ నూరీ తన ప్రసిద్ధ గ్రంథం “ఖాతిమతు ముస్తద్రిక్ అల్ వసాయిల్” లో యాబ్భై ఉపాధ్యాయుల పేర్లలలో షేఖ్ ముఫీద్ పేరును కూడా వ్రాశారు.

వారి ఉపాధ్యాయులు
షైఖ్ ముఫీద్ ల వారు తన తండ్రి గారి వద్దే ఖుర్ఆన్ మరియు ప్రాధమిక విధ్యలను నేర్చుకుని ఆ తరువాత ఉన్నత విద్యల నిమిత్తం బగ్దాద్ వెళ్ళారు. అచట ప్రఖ్యాతి చెందిన షీయా మరియు సున్ని ఉలమాల వద్ద విద్యను అభ్యసించటం జరిగింది. వారి శిక్షకులలో ముఖ్యమైన వారు: 1. షైఖ్ సదూఖ్, 2. ఇబ్నె ఖౌలవియ, 3. ఇబ్నె వలీద్ ఖుమ్మీ, 4. అబు గాలిబె జురారీ, 5. ఇబ్నె జునైదె ఇస్కాఫీ, 6. అబూఅలీ సౌలీ బసరీ, 7. అబూ అబ్దిల్లాహ్ సఫ్వానీ 8. షేఖ్ అలీ ఇబ్నె ఈసా రుమ్మానీ, 9. మొహమ్మద్ ఇబ్నె ఇమ్రాన్ మర్జబానీ, 10. అబూ బక్ర్ ముహమ్మద్ బిన్ సాలిమ్(హాఫిజె జఆబీ) మొదలైన వారు. అబ్బాసీ ఖలీఫాల సమక్షంలో జరిగిన ఎన్నో శాస్త్రీయ చర్చలలో పాల్గొని షీయా మతంపై వచ్చే ఎన్నో విమర్శలకు సమాధానమిచ్చేవారు.

శిష్యులు
షైఖ్ ముఫీద్(ర.అ) ఎంతో మంది విద్యార్ధులకు మతపరమైన శిక్షననిచ్చి వారిని పండితులుగా తీర్చి దిద్దారు. వారిలో ఎంతో మంది షీయా మతం యొక్క ప్రసిద్ధ పండితులు కూడా ఉన్నారు. వారి వద్ద విద్యను అభ్యసించిన వారిలో  1. సయ్యద్ ముర్తజా, 2. సయ్యద్ రజీ, 3. షైఖ్ తూసి, 4. అబుల్ ఫత్‌హ్ కరాజకి, 5. నజాషి, 6. అబూ యాలి ముహమ్మద్ బిన్ హసన్ జాఫరీ లు ముఖ్యమైన వారు.

రచనలు
షేఖ్ ముఫీద్ యొక్క ప్రముఖ శిష్యులైన షేఖ్ తూసీ(ర.అ) ఉల్లేఖనం ప్రకారం, వారు దాదాపు 200 గ్రంథాలు రచించారు[1] వాటిలో కొన్ని: 1. అల్ ముఖ్నఅహ్, 2. అల్ ఇర్షాద్, 3. అహ్కామున్నిసా, 4. అల్ అమాలీ, 5. అల్ మస్హు అలర్ రిజ్లైన్, 6. అల్ జమల్, 7. అవాయిలుల్ మిఖాలాత్, 8. అల్ మసాయిలస్ సాగానియహ్, 9. అల్ ఇఫ్సాహ్, 10. అల్ ఇఖ్తిసాస్, 11. అల్ ఈమాను అబీతాలిబ్, 12. తస్ హీహు ఏతెఖాదాత్ అల్ ఇమామియహ్, 13. రిసాలతు హౌలి హదీసి నహ్నూ మఆషిరల్ అంబియా లా నువర్రిస్, 14. అల్ కాఫిఅతు ఫీ ఇబ్తాలి తౌబతిల్ ఖాతిఅహ్, 15. అర్బఅ రిసాలాతిన్ ఫిల్ గైబతి, 16. తహ్రీము జబాయిహి అహ్లిల్ కితాబ్, 17. తఫ్ జీలు అమీరిల్ మొమినీన్, 18. రిసాలతు హౌలి ఖబరి మారియహ్, 19. షర్హుల్ మనామ్, 20. అదము సహ్విన్నబీ, 21. అల్ ఫుసూలుల్ ముఖ్తారి, 22. మసారిష్ షీఅహ్ ఫీ ముఖ్తసరి తవారిఖిష్ షరీఅహ్, 23. అల్ ఫుసూలుల్ అష్రతు ఫిల్ గైబతి, 24. అల్ మజార్.

మరణం  
ఇస్లాంకు మరియు షీయా మతానికి ఎన్నో సేవలందించిన ఈ ప్రసిధ్ధ పండితుడు హిజ్రి యొక్క 413వ ఏట మరణించారు. షేఖ్ తూసీ వారి అంతిమ యాత్రలో హాజరయ్యారు. షేఖ్ తూసీ(ర.అ) ఇలా అన్నారు: “వారు మరణించిన రోజు వారి (జనాజా) నమాజ్ చదవాడినికి మరియు వారి పై రోధించడానికి వచ్చిన షియా మరియు సున్నీయుల సంఖ్య సాటిలేని సంఖ్య”[2] 80 వేల మంది షియాలు వారి అంతిమయాత్రలో పాల్గొన్నారు. సయ్యద్ ముర్తజా అలముల్ హుదా(ర.అ) జనాజా నమాజ్ ను చదివించారు.
వారిని కాజిమైన్ లో ఇమాం కాజిమ్(అ.స) మరియు ఇమామ్ జవాద్(అ.స) ల వారి సమాధులకు సమీపాన ఖననం చేయటం జరిగింది.[3]

రెఫరెన్స్
1. షేఖ్ తూసీ, పేజీ238.
2. షేఖ్ తూసీ, పేజీ239.
3. రిజాలె నజాషి, పేజీ399, తారీఖె ఫిఖ్ వ ఫుఖహా, గర్జీ, పేజీ143.

https://www.noorsoft.org/fa/Mostabser/View/52/زندگی%E2%80%8Cنامه-شیخ-مفید

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 36