ఇమామ్ రిజా(అ.స) ఖురాసాన్ కు ప్రయాణం

మంగళ, 06/06/2023 - 19:28

మామూన్, ఇమామ్ రిజా(అ.స)ను ఖురాసాన్ కు రమ్మని ఆహ్వానించడానికి గల కారణాలు ఏమిటి అన్న విషయంపై సంక్షిప్త వివరణ...

ఇమామ్ రిజా(అ.స) ఖురాసాన్ కు ప్రయాణం

హారూన్ రషీద్ మరియు అమీన్ మరణానంతరం మామూన్ అధికారంలో వచ్చిన తరువాత, ఇమామ్ రిజా(అ.స) జీవిత పుస్తకంలో కొత్త పేజీలు తెరుచుకున్నాయి. ఈ పేజీలలో ఇమామ్ రిజా(అ.స) చాలా కష్టాలు మరియు ఆపదలను ఎదురుకున్నారు.

ఖిలాఫత్ పదవిని తన సొంతం అని భావించే ప్రతీ ఖలీఫా -వాడు బనీ ఉమయ్యాకు చెందినవాడు అయినా లేదా బనీఅబ్బాస్ కు చెందినవాడు అయినా- హజ్రత్ అలీ(అ.స) సంతానం పట్ల భయాందోళనలు కలిగివుండేవాడు. అందుకని అధికారులు నిత్యం ఇమాములను కష్టాలకు గురిచేసేవారు, వారిపై ఒత్తిడి వేసేవారు. కాని మామూన్ అప్పుడప్పుడు షియా వర్గం పట్ల ఇష్టాన్ని వ్యక్తం చేసేవాడు. అతడి అధికారంలో ఇరాన్ దేశస్తులు ఎక్కువగా ఉండేవారు, ఇరాన్ దేశస్తులు అలీ(అ.స) సంతానం పట్ల ప్రత్యేక ఇష్టం కలిగివుండేవారు. అతడి పూర్వీకుల హారూన్ మరియు మన్సూర్ మాదిరి ఇమామ్‌ను కారాగారంలో బంధించి, చిత్రహింసలు పెట్టే అవకాశం లేకపోయింది. అందుకని కొత్త రకమైన పద్ధతిని ఎంచుకున్నాడు. ఇమామ్‌ను తన వద్దకు ఆహ్వానించి వారి పట్ల ప్రేమను, ఇష్టాన్ని చూపించినట్లు చేసి అతడి విజ్ఞాన మరియు సామాజిక పలుకుబడిని ఉపయోగించుకోవచ్చు మరియు వారి పై నిఘా పెట్టి ఉంచవచ్చు అని అనుకున్నాడు.

ఖురాసాన్‌కు ఆహ్వానం
మామూన్ మొదట్లో గౌరవంగా ఇమామ్‌ను హజ్రత్ అలీ(అ.స) సంతానం నుండి పెద్దవారి ద్వార ఖురాసాన్‌కు రమ్మని ఆహ్వానం పంపాడు. ఇమామ్, మామూన్ యొక్క ఆహ్మానాన్ని అంగీకరించలేదు, కాని మామూన్ పట్టుబట్టి, గట్టి ప్రయత్నం చేసి, ఎన్నో ఉత్తరాలు వ్రాశాడు. చివరికి అబూతాలిబ్ సంతానం నుంచి కొంతమందితో పాటు కలిసి ఇమామ్ “మర్వ్” పట్టణానికి బయలుదేరారు.[1]
ఇమామ్ రిజా(అ.స) తనకు ఈ ప్రయాణం ఇష్టంలేదు అని ప్రజల ముందు వ్యక్తం చేశారు. మదీనహ్ నుంచి బయలు దేరేటప్పడు తమ కుటుంబ సభ్యులను పిలిచి తన పై ఏడవమని కోరి ఇలా అన్నారు: “నేను ఇక తిరిగి నా కుటుంబ సభ్యుల వద్దకు రాను”[2]

ఇమామ్‌(అ.స)కు ఖిలాఫత్ ప్రతిపాదన
ఇమామ్ “మర్వ్”కు వచ్చిన కొన్ని రోజుల తరువాత, ఇమామ్ మరియు మామూన్ మధ్య చర్చలు మొదలయ్యాయి. మామూన్ ఇమామ్‌ను ఖిలాఫత్ పదివిని స్వీకరించమని కోరాడు. కాని ఇమామ్ ఏమాత్రం ఒప్పుకోలేదు.
బహుశా మామూన్‌కు ఇమామ్ తిరస్కరిస్తారనే ఆలోచన ముందు నుంచే ఉంది అందుకని నిరాకరించిన వెంటనే ఇలా అన్నాడు: “అయితే మీరు ఉత్తరాధికారాన్ని అంగీకరించండి!” ఇమామ్, ఇది కూడా నాకొద్దు అని అన్నారు.
మామూన్ ఇమామ్(అ.స) మాటను అంగీకరించలేదు. అప్పుడతను బెదిరించడానికి ఒక మాట అన్నాడు; “ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ ఈలోకాన్ని విడిచే సమయంలో సలహా మండలిలో ఆరుగురుని నియమించారు, వారిలో ఒకరు అలీ ఇబ్నె అబీ తాలిబ్(అ.స) ఉన్నారు. ఎవరైనా వ్యతిరేకిస్తే వారి తల నరికేయబడు తుంది అని కూడా అన్నారు!.... మీరు నా మాట వినాల్సిందే, ఎందుకంటే నాకు ఇది తప్ప వేరే దారిలేదు!”[3]

ఇంత కన్నా స్పష్టంగా బెదిరించాడు: “అల్లాహ్ సాక్షిగా నామాటను గౌరవించి నా ఉత్తరాధికారాన్ని స్వీకరించకపోతే, బలవంతంగా అంగీకరించేటట్లూ చేస్తాను, అయినా ఒప్పుకోకపోతే మీ ప్రాణాలు తీస్తాను!!”[4]

ఇమామ్ కు మరో దారి లేక మామూన్ మాటను ఒప్పుకొని ఇలా అన్నారు: “నేను నీ విలాయత్ అహదీ(ఉత్తరాధికారాన్ని) ఒక షరత్తుపై అంగీకరిస్తాను; అధికార వ్యవహారములలో నేను రాను, ఖిలాఫత్ కు సంబంధించిన చర్యలు ఉదా; పదవుల నుంచి తొలగించే మరియు సంస్తాపించే విషయాలలో, ఫత్వా ఇవ్వడంలో నా జోక్యం ఉండకూడదు”[5]

ఇమామ్ యొక్క ఉత్తరాధికారం, వారిని ఇష్టపడేవారికి సంతోషానికి కారణమయ్యింది. కాని స్వయంగా ఇమామ్‌కు ఈ పదవి నిరాశకు గురి చేసింది. ఒక వ్యక్తిని చాలా సంతోషపడడాన్ని చూసి అతడి వద్దకు వెళ్లి ఇమామ్ ఇలా అన్నారు: “దీనిపై ఎక్కువ ఆశలు పెట్టుకోకు, ఎక్కువగా సంతోషపడకు, ఇది చాలా కాలం ఉండదు”[6]

ఇస్లామీయ చరిత్ర గ్రంథాలలో మామూన్ ఎందుకు ఖిలాఫత్ అధికారాన్ని ఇవ్వాలనుకున్నాడు, దాన్ని స్వీకరించకపోతే కనీసం ఉత్తరాధికారిగా ఎందుకు బలవంతంగా నిశ్చయించాడు అన్న విషయాలపై చాలా నిదర్శనలు ఉన్నాయి. వాటిని ఇక్కడ ప్రదర్శించడం సుధీర్ఘతకు కారణమౌతుంది. ఒక వాక్యంలో చెప్పాలంటే మామూన్ తాను చేసిన తప్పులు కప్పిపెట్టడానికి ఈ నాటకం ఆడాడు. ఇమామ్ తన సహచరుల మరియు విధేయుల రక్షణ కోసం ఆ పదవిని స్వీకరించారు.

రిఫరెన్స్
1. కష్ఫుల్ గుమ్మహ్, అలీ ఇబ్నె ఈసా అల్ ఇర్బలీ, భాగం3, పేజీ65; అల్ ఇర్షాద్, షేఖ్ ముఫీద్, పేజీ309.
2. బిహారుల్ అన్వార్, మజ్లిసీ, భాగం49, పేజీ117.
3. అల్ ఇర్షాద్, షేఖ్ ముఫీద్, పేజీ 310; కష్ఫుల్ గుమ్మహ్, అలీ ఇబ్నె ఈసా అల్ ఇర్బలీ, భాగం3, పేజీ65.
4. ఇలల్ అల్ షరాయే, సదూఖ్, భాగం1, పేజీ226.
5. ఎఅలాముల్ వరా, తబర్సి, పేజీ334; అల్ ఇర్షాద్, షేఖ్ ముఫీద్, పేజీ310.
6. అల్ ఇర్షాద్, షేఖ్ ముఫీద్, పేజీ 312; కష్ఫుల్ గుమ్మహ్, అలీ ఇబ్నె ఈసా అల్ ఇర్బలీ, భాగం3, పేజీ67.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4