హుదైబియా సంధి సమయంలో సంభవించిన కొన్ని అంశాలు సహాబీయులందరూ ఉత్తములు కారు అని నిదర్శిస్తున్నాయి, వాటి గురించి సంక్షిప్త వివరణ...

హుదైబీయహ్ సంధి సంఘటన పూర్తిగా తెలిసిన వారి కోసమే ఈ శీర్షిక. అయితే ఇక్కడ కేవలం సంక్షిప్తంగా వివరించడం జరుగుతుంది.
హిజ్రీ యొక్క 6వ సంవత్సరంలో దైవప్రవక్త(స.అ) తమ 14 వందల సహాబీయులతో ఉమ్రా ఉద్దేశంతో మక్కాకు వెళ్లారు. ఖురైషీయులు దైవప్రవక్త(స.అ) వద్దకు ఒక రాయబార సంఘంను “ఈ సంవత్సరం తిరిగి వెళ్ళిపోమని, వచ్చే సంవత్సరం మూడు రోజులు మనశ్శాంతిగా ఉమ్రా చేసుకునేందుకు మక్కాను ఖాళీ చేస్తాము” అని కోరమని పంపారు. దైవప్రవక్త(స.అ) ఇస్లాం శుభహేతువు కోరి వాటిని అంగీకరించారు. కాని సహాబీయులలో కొందరికి దైవప్రవక్త(స.అ) ఈ నిర్ణయం కొంచెం కూడా నచ్చలేదు. ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ ప్రశ్నలకు “చూడండి, నేను అల్లాహ్ ప్రవక్త(స.అ)ను. నేను అల్లాహ్ పట్ల అపరాధానికి పాలుపడలేను ఎందుకంటే అల్లాయే నాకు రక్ష” అని దైవప్రవక్త(స.అ) అన్నారు. అయినా హజ్రత్ ఉమర్ ప్రశ్నించడం ఆపలేదు.
దైవప్రవక్త(స.అ), సంధి పనులను ముగించిన తరువాత తమ సహాబీయులను ఇలా ఆదేశించారు: “మీరందరు వెళ్ళి బలివ్వండి మరియు తల వెంట్రుకలను తీయించుకోండి”. (చరిత్ర కారుడు ఇలా ప్రవచించెను): అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను వాళ్ళలో ఏ ఒక్కరూ కదలలేదు అప్పటికే దైవప్రవక్త(స.అ) మూడు సార్లు ఆదేశించారు. ఎప్పుడైతే ఎవ్వరు కూడా వారి మాట వినలేదో దైవప్రవక్త(స.అ) లేచి తమ డేరాలోకి వెళ్ళిపోయారు. ఆ తరువాత బయటకు వచ్చి ఎవరితో మాట్లాడకుండా తమ తరపు నుండి ఒంటెను బలిచ్చి క్షౌరకుడిని పిలిచి తల వెంట్రుకలు తీయించేశారు. అది చూసి సహాబియులు కూడా వచ్చి బలిచ్చి ఒకరి తల వెంట్రుకలను మరొకరు తీయించుకోవడం మొదలు పెట్టారు. అక్కడ పరిస్థితి ఒకరిని ఒకరు చంపుకుంటారేమోనట్లుగా అయ్యింది.[1]
హుదైబియా సంధి సమయంలో సహాబీయులలో కొందరు దైవప్రవక్త(స.అ) ఆజ్ఞను పాటించలేదు అన్న విషయం తెలిసిందే. దైవప్రవక్త(స.అ) ముందు ఇలాంటి అసభ్య ప్రవర్తన చేస్తున్నారంటే ఈ సహాబీయులు ఎలాంటివారైవుంటారు!!!. ఈ సంఘటన తరువాత ప్రపంచలో బుధ్ధిమంతులెవరైనా సహాబీయులు, దైవప్రవక్త(స.అ) ఆజ్ఞను పాలించడానికి మనసా వాచా అమలు చేయడానికి తయారుగా ఉండేవారని నమ్ముతారా?. ఈ సంఘటన సహాబీయులందరూ ఉత్తములు కారు అని తెలియపరుస్తుంది. వాళ్ళ అసత్యపు ప్రమాణాలను బయట పెడుతుంది. దైవప్రవక్త(స.అ) ముందు ఇలాంటి అసభ్య ప్రవర్తన, మామూలు విషయమా!? లేదా ఇలా తెగించిన వారు క్షమార్హూలా!? లేదా వాళ్ళ తెగింపు అంగీకరింపదగిందా!? అనే విషయాలను బుధ్ధిమంతుడు గ్రహించగలడు. అల్లాహ్ ఇలా ప్రవచించెను: ..కాదు, ముహమ్మద్! నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయనిర్ణేతగా స్వీకరించనంతవరకు, ఇంకా నీవు ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో కూడా ఏమాత్రం సంకోచం లేకుండా దానిని యథాతథంగా శిరసావహించనంతవరకు వారు నిజమైన విశ్వాసులు కాలేరు.(సూరయె నిసా, ఆయత్65)[2]
ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ ఇక్కడ (దైవప్రవక్త(స.అ) నిర్ణయానికి) శిరసావహించారా?. దైవప్రవక్త(స.అ) తీర్పుపై మనసు సంకోచింపలేదా?. లేక దైవప్రవక్త(స.అ) నిర్ణయంలో వారికి అనుమానం కలగలేదా?. ముఖ్యంగా ఇలా అనడం “మీరు నిజమైన దైవప్రవక్త(స.అ) కారా?”. అతి త్వరలో మేము కాబాకు వెళ్ళి ప్రదక్షణాలు చేద్దామని మాతో మీరు చెప్పేవారు కాదా?, దైవప్రవక్త(స.అ) ఇచ్చిన జవాబులను అంగీకరించారా? వాటిని నమ్మి తృప్తి చెందారా?. అస్సల తృప్తి పొందలేదు, తృప్తే పొందుంటే అవే ప్రశ్నలు అబూబక్ర్ వద్దకు వెళ్ళి అడిగి ఉండేవారు కాదు. ఆ తరువాత అబూబక్ర్ జవాబులతో తృప్తి పొందారా?. దైవప్రవక్త(స.అ) మరియు అబూబక్ర్‌ల జవాబుతో సంతృప్తి పొందినట్లైవుంటే “నేను దాని కోసం చాలా పన్నాగాలు పన్నాను” అని ఎందుకు చెప్పినట్లు. ఉమర్ పన్నిన ఆ పన్నాగాలేమిటో ఆ అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ)కే తెలియాలి. అంతేకాకుండా మిగిలిన వాళ్ళు ఎందుకు ఆజ్ఞను ఆచరించలేదు? దైవప్రవక్త(స.అ) మూడేసి సార్లు “మీరు లేచి బలిచ్చి తల వెంట్రుకలు తీయించుకోండి” అని ఆదేశించినప్పటికీ ఏ ఒక్కరు అమలు చేయలేదు.
ఒకవేళ ఈ సంఘటన కేవలం షియా ముస్లింల పుస్తకాలలో ఉండివుంటే వెంటనే సహాబీయుల పై నింద అని భావించవచ్చు. కాని ఈ సంఘటన ఎంత ప్రఖ్యాతి చెందిన మరియు సరైనది అంటే సున్ని మరియు షియా ముహద్దిసులందరూ వ్రాశారు.
బెఅసత్ నుండి హుదైబియహ్ సంధి వరకు ఇరవై సంవత్సరాలు దైవప్రవక్త(స.అ) వద్ద ఉన్నటువంటి సహాబీయుల తరపు నుండి ఎటువంటి సాకును తీసుకొని రాగలము. వాళ్ళు తమ కళ్ళతో దైవప్రవక్త(స.అ) సృష్టించిన అధ్భుతాలను చూశారు. రాత్రింబవళ్ళు ఖుర్ఆన్, వాళ్ళకు దైవప్రవక్త(స.అ)తో ఎలా వుండాలో, ఎలా మాట్లాడాలో నేర్పించింది. చివరికి అల్లాహ్, “ఒకవేళ మీ కంఠస్వరం దైవప్రవక్త(స.అ) కంఠస్వరానికి మించినట్లైతే మీరు చేసుకున్నదంతా వ్యర్ధమౌతుంది” అని హెచ్చరించాడు.
ఉమర్ ఇబ్నె ఖత్తాబ్, అలా అసభ్యంగా ప్రవర్తించకపోయివుంటే ప్రజల్లో దైవప్రవక్త(స.అ) ఆదేశాన్ని వినీవిన్నట్లుగా వదిలేయడానికి ధైర్యం వచ్చేది కాదు.[3]
ఇది చాలా విలక్షణమైన సంఘటన కాని నిజమైన సంఘటన.
రిఫరెన్స్
1. ఈ సంఘటనను చరిత్రకారులే కాకుండా బుఖారీ తన “సహీ” అను పుస్తకంలో “కితాబుష్షురూతొ ఫిల్ జిహాద్” అను అధ్యాయం, భాగం 8, పేజ్ 122. ముస్లిం తన “సహీ” అను పుస్తకంలో “బాబొ సుల్హె హుదైబియహ్” లో లిఖించారు.
2. فَلَا وَرَبِّكَ لَا يُؤْمِنُونَ حَتَّىٰ يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لَا يَجِدُوا فِي أَنْفُسِهِمْ حَرَجًا مِمَّا قَضَيْتَ وَيُسَلِّمُوا تَسْلِيمًا
3. సీరతుల్ హలబియ్యహ్, బాబొ సుల్హెల్ హుదైబియహ్, భాగం 2, పేజీ 706.
వ్యాఖ్యానించండి