జిల్‌హిజ్ నెల మొదటి తేదీ

ఆది, 06/18/2023 - 20:35

జిల్‌హిజ్ నెల మొదటి తేదీన ఇస్లామీయ చరిత్రలో సంభవించిన రెండు సంఘటనల వివరణ...

జిల్‌హిజ్ నెల మొదటి తేదీ

జిల్‌హిజ్ నెల మొదటి తేదీన రెండు ముఖ్యమైన సంఘటనలు సంభవించాయి. ఒక హిజ్రీ యొక్క 2వ సంవత్సరంలో రెండవది హిజ్రీ యొక్క 9వ సంవత్సరంలో.

హిజ్రీ యొక్క 2వ సంవత్సరంలో
వివరణ: ఇమామ్ అలీ[అ.స] మరియు హజ్రత్ ఫాతెమా[స.అ] వివాహం జరిగింది. హజ్రత్ అలీ(అ.స) మరియు హజ్రత్ ఫాతెమా(స.అ) వివాహంలో మనం నేర్చుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి. ఈ దైవాదేశ వివాహంలో జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం, వివాహ వేడుక మరియు మంచి కుటుంబానికి సంపూర్ణ నమూనాలు ఉన్నాయి. ఇక్కడ మేము ఆ వివాహానికి సంబంధించిన, చరిత్ర గ్రంథాలలో రచించబడ్డ హదీసుల ద్వార కొన్ని విషయాలు తెలియపరచాలనుకుంటున్నాము.
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) కు చాలా సంబంధాలు వచ్చాయి, మంచి మంచి డబ్బున్నావాళ్లు, గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నవారు. వచ్చిన వాళ్లు మంచి ఇంటిలో అన్ని వసతులను ఆమెకు అనుకూలంగా ఉంచుతాము అని అన్నారు. కాని దైవప్రవక్త(స.అ) వాళ్లలో ఏ ఒక్కరికీ సమ్మతించలేదు. దైవప్రవక్త(స.అ) వాళ్లతో ఇలా అనేవారు: నా కుమార్తె వివాహం అల్లాహ్ చేతుల్లో ఉంది ఆయన ఆదేశం కొరకు వేచి ఉన్నాను[1]

హజ్రత్ అలీ(స.అ) దైవప్రవక్త(స.అ) వద్దకు వెళ్లారు కాని సిగ్గు వల్ల తన కోరికను చెప్పలేకపోయారు. అలా మూడవ సారికి వారు తన కోరికను చెప్పి, హజ్రత్ జహ్రా(స.అ) సంబంధాన్ని ఆమె తండ్రితో అడిగారు. హజ్రత్ ఫాతెమా ను పన్నెండున్నర(12.50) బంగారపు నాణ్యాల మెహ్ర్ తో హజ్రత్ అలీ(అ.స)కు ఇచ్చి వివాహం చేశారు[2] సంబంధం అడిగిన వెంటనే దైవప్రవక్త(స.అ) వివాహ ఖుత్బా చదివారు(ఒక రకంగా చెప్పాలంటే వివాహ మంత్రాలు).

హిజ్రీ యొక్క 9వ సంవత్సరంలో
“బరాఅత్” ఆయత్లను ఇచ్చి పంపేందుకు అబూబక్ర్ కు బదులు ఇమామ్ అలీ[అ.స]ను ఎన్నుకోవడం జరిగింది. హదీస్: “عَلِيٌ‏ مِنِّي‏ وَ أَنَا مِنْ‏ عَلِيٍ‏ وَ لَا يُؤَدِّي‏ عَنِّي‏ إِلَّا أَنَا أَوْ عَلِي‏”[3](అలీయున్ మిన్ని వ అనా మిన్ అలీ వలా యుఅద్దీ అన్నీ ఇల్లా అనా ఔ అలీ).
ఈ హదీసు కూడా దైవప్రవక్త(స.అ) తన సందేశాన్ని చేర్చేందుకు ఎన్నుకున్న ఆ ఓకానొక మనిషి అలీ ఇబ్నె అబీతాలిబే(అ.స) అని స్పష్టంగా ప్రకటిస్తుంది. ఈ మాట బరాఅత్ సూరా ప్రచారం కోసం అబూబక్ర్‌ను తొలగించి హజ్రత్ అలీ(అ.స)ని పంపినప్పుడు చెప్పారు. తిరిగి వచ్చి హజ్రత్ అబూబక్ర్ నా గురించి అల్లాహ్ తరపు నుండి ఏదైన విషయం అవతరింపబడిందా? అని దర్యాప్తు చేయగా దైవప్రవక్త(స.అ) ఇలా అన్నారు: “అల్లాహ్, ఈ సందేశ ప్రచారాన్ని నేను చేయాలి లేదా అలీ(అ.స) అని ఆదేశించాడు”.
దైవప్రవక్త(స.అ) యొక్క ఈ ప్రస్తావన, దైవప్రవక్త(స.అ), వేరే సందర్భంలో చేసినటువంటి అలీ(అ.స) ప్రతిష్టతల ప్రస్తావన మాదిరిగా ఉంది: “ఓ అలీ(అ.స) నీవు నా ఉమ్మత్ యొక్క బేధములలో సత్యాన్ని పలికే వానివి”.[4]

దైవప్రవక్త(స.అ) సందేశ ప్రచారం అలీ(అ.స) తప్ప ఇంకెవ్వరూ చెయ్యలేరు మరియు అతనే ప్రతీ భేదంలో ఉన్న యధార్థాన్ని చెప్పగలవారు. అలాంటప్పుడు “అబ్బా” మరియు “కలాలహ్” పదాలకు అర్థం కూడా తెలియని వాళ్ళను అతనిపై ఎలా ప్రాధాన్యత ఇవ్వగలరు!?.
ఈ ఆపద, పూర్తి ఉమ్మత్‌ను చిక్కులో పడేసిన ఆపద. మరియు దానికి ఫలితంగా అల్లాహ్, ఉమ్మత్‌కు అప్పగించిన కర్తవ్యాన్ని అమలు పరచలేక పోయింది. సత్యాన్ని వికృతించిన మరియు సంఘటలను మార్చేసిన వాళ్ళకు అల్లాహ్ తరపు నుండి తగిన శాస్తి జరుగుతుంది. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను:

وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا إِلَىٰ مَا أَنْزَلَ اللَّهُ وَإِلَى الرَّسُولِ قَالُوا حَسْبُنَا مَا وَجَدْنَا عَلَيْهِ آبَاءَنَا ۚ أَوَلَوْ كَانَ آبَاؤُهُمْ لَا يَعْلَمُونَ شَيْئًا وَلَا يَهْتَدُونَ
“అల్లాహ్ అవతరింపజేసిన శాసనం వైపునకు రండి, ప్రవక్త(స.అ) వైపునకు రండి” అని వారితో చెప్పినప్పుడు, వారు “మాకొరకు మా తాతముత్తాతలు అవలంబిస్తూ ఉండగా మేము చూసిన విధానమే చాలు” అని జవాబు చెబుతారు. ఏమిటి! వారికి ఏమీ తెలియనప్పటికీ, ఋజుమార్గజ్ఞానమే వారికి లేకపోయినప్పటికీ, వారు తమ తాతముత్తాతలనే అనుసరిస్తూ పోతారా?[సూరయె మాయిదహ్, ఆయత్:104.]

రిఫరెన్స్
1. అల్లామా ఖజ్వీనీ, ఫాతెమా జహ్రా అజ్ విలాదత్ తా షహాదత్, పేజీ191.
2. తారీఖె తహ్ఖీఖీ-ఎ-ఇస్లాం, మొహమ్మద్ యూసుఫీ గరవీ, భాగం2, పేజీ251.
3. సుననే ఇబ్నె మాజా, భాగం 1, పేజీ 24. ఖసాయిసే నిసాయీ, పేజీ 20. తిర్మిజీ, భాగం 5, పేజీ 300.
4. తారీఖె దమిష్కె ఇబ్నె అసాకిర్, భాగం2, పేజీ 488. కునూజుల్ హఖాయఖె మునాది, పేజీ 203. కన్జుల్ ఉమ్మాల్, భాగం 5, పేజీ 33.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 2