తౌబహ్ సూరహ్

సోమ, 11/06/2017 - 16:34

.ఖుర్ఆన్ యొక్క తొమ్మిదవ సూరహ్ ను “అవుజూ బిల్లాహ్ మిన్ గజబిల్ జబ్బార్” అని మొదలు పెట్టాయి.

తౌబహ్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క తొమ్మిదవ సూరా ఇది. “తౌబహ్” అనగ అస్తగ్ఫార్, క్షమాపణ. ఈ సురాకు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోని 46 వ ఆయత్. ఈ సూరాలో “తౌబహ్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 6 సార్లు వచ్చింది. ఈ సూరాలో 129 ఆయత్‍లు, 2505 పదాలు మరియు 11116 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో అల్లాహ్ పదం 169 సార్లు వచ్చింది. ఈ సూరా మదీనాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “మాయిదహ్” సూరా మరియు దీని తరువాత “నస్‏ర్” సూరా అవతరించబడ్డాయి. ఈ సూరహ్ కు తౌబహ్ కాకుండా మరో నాలుగు పేర్లున్నాయి అవి “బరాఅత్”, “ఫాజిహ”, “మఖ్‏జియా”, “సైఫ్”. దీని పేరు తౌబహ్ అని పెట్టడానికి కారణం ఇందులో తౌబహ్ అంగీకరించబడడానికి గల షరతుల ప్రస్తావన ఉండడం. ఈ సూరహ్ ప్రముఖ్యత ఏమిటంటే ఇది “బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్” లేకుండా అవతరించబడింది. ఈ సూరహ్ ను “అవుజూ బిల్లాహ్ మిన్ గజబిల్ జబ్బార్” అని మొదలు పెడతారు. ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ప్రవచనానుసారం ఎవరైతే ప్రతీ నెల అన్ఫాల్ మరియు తౌబాహ్ సూరహ్‍లను పఠిస్తారో ఎప్పటికి వారి హృదయంలో కపటం ప్రవేసించదు మరియు వారు అమీరుల్ మొమినీన్[అ.స]ను ఇష్టపడే వారిలో లెక్కించబడతారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 27