“జిల్‌హిజ్” మాసం యొక్క ప్రతిష్టత మరియు మొదటి పది రోజుల ముఖ్యమైన ఆమాల్ గురించి సంక్షిప్త వివరణ...
“జిల్‌హిజ్” మాసం, ఆరాధన మరియు ప్రార్ధనల మాసం, ఈ మాసం యొక్క మొదటి పది రోజులు మరియు అరఫా రోజే కాదు నిజానికి పూర్తి మాసం, ప్రార్థనల మాసం మరియు స్వియాభివృద్ధి మాసం.
“జిల్‌హిజ్” మాసం ప్రతిష్టత
“జిల్‌హిజ్” మాసం రాగానే దీన్ పెద్దలు మరియు గొప్పవారు మొదటి పది రోజులలో ప్రార్థనలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు.[1]
ఈ నెలలో రెండు గొప్ప పండుగలు ఉన్నాయి; ఈద్-ఎ-ఖుర్బాన్ (ఈదుల్ అధ్హా) మరియు ఈద్-ఎ-గదీర్ అలాగే అరఫా లాంటి ముఖ్యమైన దినం.
“జిల్ హిజ్” నెల యొక్క మొదటి పది రోజులను “అయ్యామె మాలూమాత్” అంటారు. దీని ప్రస్తావనం ఖుర్ఆన్ లో ఉంది. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం ప్రకారం, ఈ పది రోజులలో చేసే పుణ్యకార్యములు మరియు ప్రార్ధనలు అల్లాహ్ దృష్టిలో మిగిలిన రోజులలో అమలు పరిచేవాటి కన్నా ఇష్టమైనవి. ఈ పది రోజులలో కొన్ని ప్రార్ధనలు ఉన్నాయి. వాటి వివరణ:
1. మొదటి 9 రోజులు ఉపవాసం ఉండడం. ఈ ఉపవాసం యొక్క పుణ్యం జీవిత కాలం ఉపవాసం ఉన్నంత పుణ్యం కలదు.
2. ఈ పది రోజుల రాత్రులలో మగ్రిబ్ మరియు ఇషాఁ నమాజ్ మధ్యలో రెండు రక్అత్ల నమాజ్ ను ఈ విధంగా చదవడం; ప్రతీ రక్అత్ లో అల్ హంద్ సూరహ్ తరువాత ఒకసారి ఇఖ్ లాస్ సూరహ్ ను చదివిన తరువాత ఈ ఆయత్ ను చదవాలి: “వ వాఅద్నా మూసా తలాతీన లైలతన్ వ అత్ మమ్నాహా బి అష్రి, ఫతమ్మ మీఖాతు రబ్బిహి అర్బయీన లైలతన్ వ ఖాల మూసా లి అఖీహి హారూనఖ్ లుఫ్నీ ఫీ ఖౌమీ వ అస్లిహ్ వలా తత్తబిఅ’ సబీలల్ ముఫ్సిదీన్” ఈ నమాజ్ చదివిన వారు, హజ్ చేసిన వారి పుణ్యంలో భాగస్వాములవుతారు.
3. మొదటి పది రోజులలో ఫజ్ర్ సూరహ్ ను చదవడం: ఒక హదీస్ లో దైవప్రవక్త(స.అ) ఇలా ఉల్లేఖించారు: జిల్‌హిజ్ మాసం యొక్క మొదటి పది రోజులలో సూరయె ఫజ్ర్ పఠించేవారి పాపములు క్షమించబడతాయి. అలాగే ఈ రోజుల్లో కాకుండే వేరే రోజుల్లో పఠిస్తే అది వారి కోసం ప్రళయ దినాన కాంతివంతానికి కారణం అవుతుంది.[2].
ఇవి కాకుండా ఈ పది రోజులలో చదవవలసిన దుఆలు ఉన్నాయి. వాటిని మఫాతీహుల్ జినాన్ నుండి చదవ గలరు.[3].
“జిల్‌హిజ్” మాసం యొక్క మొదటి రోజు చేయవలసిన ప్రత్యేక ఆమాల్
“జిల్‌హిజ్” మాసం యొక్క మొదటి రోజు చాలా శుభకరమైన రోజు, ఈ రోజు చేయవలసిన కొన్ని ఆమాలు ఇలా వివరించబడి ఉన్నాయి:
1. ఉపవాస దీక్ష: ఒక రివాయత్ లో ఇమామ్ మూస ఇబ్నె జాఫర్(అ.స) నుండి ఇలా ఉల్లేఖించబడి ఉంది.. “జిల్‌హిజ్” మాసం యొక్క మొదటి రోజు ఉపవాస దీక్ష నిర్వర్తించిన వారికి అల్లాహ్ ఉత్తమ పుణ్యాన్ని లిఖిస్తాడు.[4]
2. నమాజె హజ్రత్ ఫాతెమా(స.అ) చదవడం: ఈ రోజు నమాజె హజ్రత్ ఫాతెమా(స.అ) చదవడం ముస్తహబ్ అని మర్హూమ్ షేఖ్ తూసీ(ర.అ) చెప్పారు. ఈ నమాజ్ నాలుగు రక్అత్లు (రెండేసి రక్అత్లు చేసి చదవాలి) ఈ నమాజ్ కూడా నమాజె అమీరుల్ మొమినీన్(అ.స) మాధిరి చదవాలి; ప్రతీ రక్అత్ లో అల్ హంద్ సూరహ్ తరువాత 50 సార్లు ఖుల్ హువల్లాహ్ సూరహ్ ను చదవాలి, సలామ్ చదివిన తరువాత తస్బీహ్ హజ్రత్ ఫాతెమా(స.అ) జపించి ఈ దుఆ ను చదవాలి: “సుబ్హన ౙిల్ ఇజ్జిష్ షామిఖిల్ మునీఫి, సుబ్హాన ౙిల్ జలాలిల్ బజిఖిల్ అజీమి, సుబ్హాన ౙిల్ ముల్కిల్ ఫాఖిరిల్ ఖదీమి, సుబ్హాన మన్ లబిసల్ బహ్జత వల్ జమాల, సుబ్హాన మన్ తరద్ద బిన్నూరి వల్ వఖారి, సుబ్హాన మన్ యరా అసరన్ నమ్లి ఫిస్సఫా, సుబ్హాన మన్ యరా వఖ్అత్ తైరి ఫిల్ హవాయి, సుబ్హాన మన్ హువ హాకజా లా హాకజా గైరుహ్”
3. జోహ్ కు అర్థ గంట ముందు రెండు రక్అత్ల నమాజ్ చదవడం: ప్రతీ రక్అత్ లో అల్ హంద్ సూరహ్ తరువాత పది సార్లు ఖుల్ హువల్లాహ్ సూరహ్, పది సార్లు ఆయతల్ కుర్సీ మరియు పది సార్లు ఇన్నా అన్జల్నా సూరహ్ చదవాలి.
4. దుర్మార్గుల నుండి భయం కలిగిఉన్నవారు ఎవరైనా సరే ఈ రోజు ఇలా చెప్పాలి: “హస్బీ హస్బీ హస్బీ మిన్ సుఆలీ ఇల్ముక బిహాలీ”[5]
రిఫ్రెన్స్
1. జాదుల్ మఆద్, పేజీ240.
2. మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ341.
3. షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, పేజీ440, మతర్జిమ్ ఇలాహీ ఖుమ్షెయి, ఇంతెషారాతె ఉస్వహ్, 1379.
4. మిస్బాహుల్ ముతహజ్జిద్, పేజీ671.
5. షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, పేజీ440, మతర్జిమ్ ఇలాహీ ఖుమ్షెయి, ఇంతెషారాతె ఉస్వహ్, 1379.
వ్యాఖ్యలు
Jazakallah
వ్యాఖ్యానించండి