సిలెహ్ రహమ్ యొక్క అర్థం మరియు దాని ప్రాముఖ్యత ఇస్లాం దృష్టిలో కొన్ని రివాయతులనుసారం...

సిలెహ్ రహమీ యొక్క అర్థం బంధువులు మరియు దగ్గర సంబంధం కలిగి ఉన్న వారితో సంబంధాన్ని కలిగి ఉండడం, వారితో ప్రేమగా ఉండడం, కలిసిమెలసి ఉండడం, కలుసుకోవడం, ధన సహాయం, మంచి ప్రవర్తన కలిగి ఉండడం, కష్ట సమయాలలో తోడుగా ఉండడం. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించెను: “వేటినయితే కలిపి ఉంచమని అల్లాహ్ ఆదేశించాడో వాటిని కలిపి ఉంచుతారు”[1]
ఈ ఆయత్ లో దైవప్రవక్తల యొక్క ఉపదేశాలను ఆహ్వానించిన ఉలిల్ అల్బాబ్ అంటే విజ్ఞుల మరియు వివేకుల గుణగణాల నుండి ఒక గుణం “వారు అల్లాహ్ ఎవరెవరితో సంబంధాలను ఖాయం చేయమన్నాడో వారిని ఖరారు చేస్తారు” అని వివరిస్తుంది.
సిలెహ్ రహమీ యొక్క ప్రాముఖ్యత
సిలెహ్ రహమీ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే ప్రజలందరినీ సిలెహ్ రహమ్ పై అమలు చేయమని ఆదేశమిస్తున్న దైవప్రవక్త(స.అ) యొక్క ఈ హదీస్ చాలు. ఈ మార్గంలో చాలా కష్టాలు మరియు ఇబ్బందులు వచ్చినా సరే, దూర ప్రయాణం చేయ్యాల్సి వచ్చినా సరే, సిలెహ్ రమమ్ ను ఇస్లాం యొక్క భాగంగా నిర్ధారించారు. దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించెను: “సిలెహ్ రహమ్ ను అమలు పరచని వాడి దీన్ అసంపూర్ణమైనది” వారు ఇలా అన్నారు: నా ఉమ్మత్ యొక్క ఇక్కడున్నవారు మరియు లేనివారు మరియు అంతిమ దినం వరకు వచ్చేవారు మరియు తండ్రి వంశంలో మరియు తల్లి కడుపులో ఉన్న వారందరికి సిఫారసు మరియు వసీయత్ చేస్తున్నాను; ఒక సంవత్సరం సమయం పట్టే దూరంలో ఉన్నా సరే సిలెహ్ రహమ్ ను అమలు పరచండి ఎందుకంటే సిలెహ్ రహమ్ దీన్ యొక్క భాగం.[2]
సిలెహ్ రహమీ యొక్క పరిమాణం
సిలెహ్ రహమీ అంటే తప్పకుండా ఒక ప్రోగ్రామ్ పెట్టాలి, వివిధ భోజనాలు సిద్ధం చేయాలి అని కాదు, ఇలా అర్థం చేసుకున్నట్లైతే దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లే. ఇస్లాం సిలెహ్ రహమీ యొక్క భావాన్ని చాలా విశాలమైనదిగా మరియు చాలా సులభమైనదిగా వివరించెను. ఉదాహారణకు ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఒక హదీస్ లో ఇలా ఉపదేశించారు: “సిలెహ్ రహమీ ను అమలు పరుచు అది నీళ్లు త్రాగించి అయినా సరే, ముఖ్యమైందేమిటంటే సిలెహ్ రహమీ అవ్వాలి, (అంతేగాని) బంధువులను కష్టపెట్టడం, వాళ్లను ఇబ్బంది పెట్టడం మరియు వారిని పీడించడం లాంటి పనులకు దూరంగా ఉండాలి”.[3]
రిఫరెన్స్
1. సూరయె రఅద్, ఆయత్21.
وَالَّذِينَ يَصِلُونَ مَا أَمَرَ اللَّهُ بِهِ أَن يُوصَلَ وَيَخْشَوْنَ رَبَّهُمْ وَيَخَافُونَ سُوءَ الْحِسَابِ
2. కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబె కులైనీ, అల్ కాఫీ, భాగం2, పేజీ151.
عَنْ جَابِرٍ عَنْ أَبِي جَعْفَرٍ ع قَالَ قَالَ رَسُولُ اللَّهِ ص أُوصِي الشَّاهِدَ مِنْ أُمَّتِي وَ الْغَائِبَ مِنْهُمْ وَ مَنْ فِي أَصْلَابِ الرِّجَالِ وَ أَرْحَامِ النِّسَاءِ إِلَى يَوْمِ الْقِيَامَةِ أَنْ يَصِلَ الرَّحِمَ وَ إِنْ كَانَتْ مِنْهُ عَلَى مَسِيرَةِ سَنَةٍ فَإِنَّ ذَلِكَ مِنَ الدِّينِ
3. కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబె కులైనీ, అల్ కాఫీ, భాగం2, పేజీ151.
عَنْ أَحْمَدَ بْنِ مُحَمَّدِ بْنِ أَبِي نَصْرٍ عَنْ أَبِي الْحَسَنِ الرِّضَا ع قَالَ قَالَ أَبُو عَبْدِ اللَّهِ ع صِلْ رَحِمَكَ وَ لَوْ بِشَرْبَةٍ مِنْ مَاءٍ وَ أَفْضَلُ مَا تُوصَلُ بِهِ الرَّحِمُ كَفُّ الْأَذَى عَنْهَا وَ صِلَةُ الرَّحِمِ مَنْسَأَةٌ فِي الْأَجَلِ مَحْبَبَةٌ فِي الْأَهْلِ
వ్యాఖ్యానించండి